ఇండియా vs న్యూజిలాండ్ : ఇరుజట్ల బలాలు ఇవే :
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో తలపడనున్న ఇరుజట్లు చాలా బలంగా ఉన్నాయి... ఆటగాళ్ళు మంచి ఫామ్ లో ఉన్నారు. అయితే న్యూజిలాండ్ కంటే ఇండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. అందుకు గల కారణాలను కూడా వివరిస్తున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం.
దుబాయ్ లోనే ఫైనల్ జరగడం :
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్నా టీమిండియా మాత్రం ఆ దేశానికి వెళ్లలేదు. అన్నిదేశాలు పాక్ లో ఆడితే భారత్ మాత్రం దుబాయ్ లో ఆడుతోంది. భారత్ తో మ్యాచ్ ఆడేందుకు ఏ దేశమైన దుబాయ్ కి వెళ్లాల్సిందే... చివరకు ఆతిథ్య పాక్ కూడా ఇలాగే చేసింది. ఇలా ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచులను ఒకే స్టేడియంలో ఆడింది టీమిండియా.ఫైనల్ కూడా ఇదే మైదానంలో జరగనుంది. కాబట్టి ఇప్పటికే దుబాయ్ గ్రౌండ్ కు టీమిండియా ఆటగాళ్లు అలవాటుపడ్డారు... ఫైనల్లో ఇది కలిసివస్తుంది.
టీమిండియా స్మిన్నర్ల ఫామ్ :
దుబాయ్ మైదానంలో స్లో పిచ్ ఉంది. ఇది స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. అయితే భారత స్పిన్ దళం రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ లతో బలంగా ఉంది. ఇప్పటికే ఈ మైదానంలో మన స్పిన్నర్లు అదరగొట్టారు. ఇది భారత్ కు కలిసివచ్చే మరో అంశం.
లీగ్ దశలో న్యూజిలాండ్ ను ఓడించడం :
ఇదే మైదానంలో లీగ్ దశలో టీమిండియా-న్యూజిలాండ్ తలపడ్డాయి. ఇందులో భారత జట్టు విజయం సాధించింది. ఇది టీమిండియాకు కాన్ఫిడెంట్ ఇచ్చే విషయం. సేమ్ మైదానం, సేమ్ పిచ్... కాబట్టి న్యూజిలాండ్ ను మరోసారి ఓడించడం కష్టం కాదని భారత అభిమానులు భావిస్తున్నారు.
మొత్తంగా భారత్, న్యూజిల్యాండ్ జట్లు బలంగా ఉన్నాయి... కాబట్టి ఫైనల్లో హోరాహోరీ తప్పదు. కానీ టైటిల్ మాత్రం టీమిండియాదే అన్న ధీమాతో అభిమానులు ఉన్నాయి. మరి ఫలితం ఎలా ఉంటుందో వచ్చే ఆదివారం చూడాలి.