Image credit: PTI
టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 53 బంతుల్లో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచిన విరాట్ కోహ్లీ, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ, టీమిండియా తరుపున టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు...
‘నేను చాలా సార్లు, చాలా ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పాను. విరాట్ కోహ్లీ నా ఫెవరెట్ బ్యాటర్. అతను ఈ తరంలో ది బెస్ట్ బ్యాట్స్‌మెన్... అందులో ఎలాంటి చర్చ అవసరం లేదు. విరాట్‌ని మిగిలినవారితో పోల్చడం కరెక్ట్ కాదు...
virat kohli
నేను విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేశా. ఈ తరంలో విరాట్‌తో పోల్చి చూస్తున్న మిగిలిన ప్లేయర్లకు కూడా బౌలింగ్ చేశా. విరాట్‌లో ఉన్న టెంపర్‌మెంట్, అతని మైండ్‌సెట్, అంకిత భావం... మిగిలిన ఏ బ్యాటర్‌లోనూ కనిపించలేదు. అందుకే అతనికి అభిమానిగా మారిపోయా...
మ్యాచ్ ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే విరాట్ కోహ్లీ అంత బాగా ఆడతాడు.ప్రెషర్‌ని విరాట్ ఢీల్ చేసే విధానమే వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇలా ఏ బ్యాట్స్‌మెన్ కూడా ఆడలేడు. విరాట్ ఇన్నింగ్స్‌ని చాలామంది వేరే బ్యాటర్లతో పోల్చి చూస్తున్నారు...
అది చాలా పెద్ద తప్పు. తన కెరీర్‌లో ఇదే బెస్ట్ టీ20 ఇన్నింగ్స్ అని విరాట్ కోహ్లీ కూడా చెప్పాడు. మిగిలిన వారి ఇన్నింగ్స్‌లతో పోల్చి చూడడం, విరాట్‌ని అవమానించడమే అవుతుంది. పాక్ చేతుల్లోంచి విరాట్ గేమ్‌ని లాక్కున్న విధానం అసాధారణం... అది అందరి వల్ల అయ్యే పని కాదు...
విరాట్ కోహ్లీ ఫామ్ గురించి చాలా చర్చ జరిగింది.అతన్ని టీ20 ఫార్మాట్‌కి పనికి రాడని, టీ20 వరల్డ్ కప్‌లో ఆడించడం వేస్ట్ అని అన్నారు. ఇప్పుడు కోహ్లీ ఆడినట్టు, మిగిలిన ప్లేయర్లు ఆడలేకపోయారు... విరాట్ రేంజ్ ఏంటో ఇకనైనా వారికి అర్థమైందని అనుకుంటా...’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్..