india
సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడంతో పాకిస్తాన్ సెమీ ఫైనల్ ఆశలు సన్నగిల్లాయి. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి, నెదర్లాండ్స్‌పై ఘన విజయం అందుకున్న పాకిస్తాన్, మిగిలిన మ్యాచుల్లో గెలిచినా సెమీస్ ఛాన్సులు ఉండవు...
పాకిస్తాన్‌ని సెమీ ఫైనల్ రేసు నుంచి తప్పించాలనే ఉద్దేశంతోనే టీమిండియా చెత్తగా ఆడి, చిత్తుగా ఓడిందని ఆరోపిస్తున్నారు పాక్ క్రికెట్ ఫ్యాన్స్. పాక్‌తో, నెదర్లాండ్స్‌తో భారత జట్టు ఆడిన విధానానికి, సఫారీ టీమ్‌తో ఆడిన విధానానికి ఏ మాత్రం పొంతనలేదని అంటున్నారు...
Image credit: PTI
ఈ మ్యాచ్ విషయాన్ని పక్కనబెడితే ఇంతకుముందు ఓ మ్యాచ్‌లో కావాలని ఓడిపోయిన భారత జట్టు, ఐసీసీతో వేటు కూడా వేయించుకుందనే విషయం మీకు తెలుసా. 1994లో ఇండియా, న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య ట్రై సిరీస్ జరిగింది...
వరుసగా మొదటి రెండు మ్యాచుల్లో నెగ్గిన భారత జట్టు ఫైనల్‌కి అర్హత సాధించింది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 46 పరుగుల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 257 పరుగులు చేసింది. టీమిండియా టార్గెట్ 258 పరుగులు...
టీమిండియా విజయానికి 54 బంతుల్లో 63 పరుగులు కావాలి. అప్పటికే ఓపెనర్ మనోజ్ ప్రభాకర్ క్రీజులో ఉన్నాడు. నయన్ మోంగియో- మనోజ్ ప్రభాకర కలిసి 54 బంతులాడి 16 పరుగులు మాత్రమే చేశారు. బౌలింగ్ కష్టంగా లేకపోయినా డిఫెన్స్ ఆడుతూ ప్రేక్షకులకు విసుగు తెప్పించారు.
భారత జట్టు కావాలనే ఓడిపోవాలని ఇలా ఆడుతుందని అర్థం చేసుకున్న ఫ్యాన్స్, మ్యాచ్ మధ్యలోనే స్టేడియం వదిలి వెళ్లిపోయారు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే న్యూజిలాండ్‌తో ఫైనల్ ఆడాల్సి ఉంటుంది. అప్పటికే వెస్టిండీస్ వరుస పరాజయాలు ఎదుర్కొంటోంది. కివీస్ మంచి ఫామ్‌లో ఉంది. న్యూజిలాండ్‌తో ఫైనల్ ఆడితే ఓడిపోతామనే భయంతో ఇలా కావాలని ఓడిపోయింది భారత జట్టు...
అంపైర్లకు, మ్యాచ్ రిఫరీకి టీమిండియా ఆటతీరుపై అనుమానం కలిగింది. కావాలని ఓడిపోయిన టీమిండియాకి 2 పాయింట్లు కోత విధించింది. అంతేకాకుండా కావాలని టెస్టు ఇన్నింగ్స్ ఆడిన మనోజ్ ప్రభాకర్, నయన్ మోంగియా... సిరీస్‌లో మిగిలిన మ్యాచులు ఆడకుండా బ్యాన్ విధించారు...
ఆ తర్వాతి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 107 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న టీమిండియా... అనుకున్నట్టుగానే వెస్టిండీస్‌తో ఫైనల్ మ్యాచ్ ఆడింది. ఫైనల్‌లో వెస్టిండీస్‌ని 72 పరుగుల తేడాతో చిత్తు చేసింది టీమిండియా. సచిన్ టెండూల్కర్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులను దక్కించుకున్నాడు..