ధోనీ కంటే విరాట్ కోహ్లీ బెస్ట్ కెప్టెన్, ఎందుకంటే... స్టువర్ట్ బిన్నీ షాకింగ్ కామెంట్...

First Published Sep 11, 2021, 11:09 AM IST

టీమిండియా తరుపున ఆడింది తక్కువ మ్యాచులే అయినా ప్రత్యేకమైన రికార్డులను సొంతం చేసుకున్నాడు ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ. 37 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన స్టువర్ట్ బిన్నీ... కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు...

టీమిండియా తరుపున వన్డేల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదుచేసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసిన స్టువర్ట్ బిన్నీ... బంగ్లాదేశ్‌పై కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు...

భారత మాజీ క్రికెటర్, లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రికార్డును బ్రేక్ చేసిన స్టువర్ట్ బిన్నీ, తన కెరీర్‌లో 14 వన్డేలు, ఆరు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్ మాత్రమే ఆడగలిగాడు...

వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఐదు సిక్సర్లు సమర్పించిన స్టువర్ట్ బిన్నీ, ఆ తర్వాత టీమిండియా నుంచి పిలుపు అందుకోలేక, కేవలం దేశవాళీ క్రికెట్‌లో మాత్రమే కొనసాగాడు.

‘నా జీవితంలో బెస్ట్ మూమెంట్ అంటే, ఎమ్మెస్ ధోనీ చేతుల మీదుగా నా టెస్టు క్యాప్ అందుకోవడం. అప్పుడు ధోనీ, నేను ఈ అవకాశానికి అర్హుడనని చెప్పాడు...

అయితే నా వరకూ ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో కంటే విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆడడం చాలా సౌకర్యంగా అనిపించింది...

ఎందుకంటే మాహీ కెప్టెన్సీలో పెద్దగా స్వేచ్ఛ ఉండదు. విరాట్ కోహ్లీ మాత్రం ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛను ఇస్తాడు... భయం లేకుండా ఆడమని ప్రోత్సహిస్తాడు...

అందుకే నా దృష్టిలో మహేంద్ర సింగ్ ధోనీ కంటే విరాట్ కోహ్లీ బెస్ట్ కెప్టెన్. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే...’ అంటూ కామెంట్ చేశాడు స్టువర్ట్ బిన్నీ...

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో భారత జట్టు తరుపున ఆడిన స్టువర్ట్ బిన్నీ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడాడు...

click me!