ఐపీఎల్ కోసమే ఐదో టెస్టు రద్దు... భారత ఆటగాళ్లకు నెగిటివ్ వచ్చాక ఆడటానికి భయమెందుకు...

First Published Sep 11, 2021, 9:18 AM IST

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య ఐదో టెస్టు అర్ధాంతరంగా రద్దు కావడానికి ఐపీఎల్ దగ్గరపడడమే కారణమంటున్నాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్. భారత ఆటగాళ్లకు నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు భయపడ్డారంటూ ప్రశ్నించాడు...

ఐదో టెస్టు ఆరంభానికి ముందు బీసీసీఐ, ఈసీబీ మధ్య హై డ్రామా నడిచింది. టెస్టు మ్యాచ్ మరో రెండు గంటల్లో ప్రారంభమవుతుందనగా... తొలి సెషన్ రద్దయిదంటూ వార్తలు వచ్చాయి...

ఆ తర్వాత మొదటి రోజు రద్దయిదంటూ, రెండు రోజులు వాయిదా పడిందంటూ వార్తలు వచ్చాయి. అయితే బీసీసీఐ, ఈసీబీ మధ్య జరిగిన చర్చల తర్వాత మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటన వచ్చింది...

అయితే ఐపీఎల్ 2021 ఫేజ్ 2 కోసమే, ఐదో టెస్టును రద్దు చేశారంటూ సంచలన ఆరోపణలు చేశాడు ఇంగ్లాండ్ కెప్టెన్ నాజర్ హుస్సేన్...

‘భారత జట్టులో ఇద్దరు ఫిజియోలు కరోనా బారిన పడ్డారు. అందుకే వారిపై చాలా సానుభూతి ఉంది. వారిలో అసిస్టెంట్ ఫిజియో, ఐదో టెస్టు ముందు వరకూ భారత ఆటగాళ్లకు అందుబాటులో ఉన్నాడు...

ఆటగాళ్లతో క్లోజ్ కాంటాక్ట్ లేకుండా ఫిజియోథెరపీ చేయలేరు. అయితే ఫిజియోకి పాజిటివ్ వచ్చిన తర్వాత క్రికెటర్లకు రెండుసార్లు నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది...

అయితే టెస్టు మ్యాచ్ ప్రారంభమైన తర్వాత రెండు, మూడు రోజులకు వాళ్లకి కూడా కరోనా పాజిటివ్ వచ్చి, ముగ్గురు, నలుగురు కీ ప్లేయర్లు మ్యాచ్‌కి దూరమవుతారేమోనని భారత జట్టు భయపడింది...

బీసీసీఐ ఈ మ్యాచ్ నిర్వహించడానికి శాయశక్తులా ప్రయత్నించింది. దాన్ని నేను కాదనను. అలాగే ఐపీఎల్‌పై ఐదో టెస్టు ఎఫెక్ట్ పడకుండా వాళ్లు చాలా జాగ్రత్త పడ్డారు..

ఐపీఎల్ చాలా ఖరీదైన లీగ్. భారత క్రికెట్ కంటే ఐపీఎల్‌కి ఉండే విలువ చాలా ఎక్కువ. ఐపీఎల్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి... ఇప్పుడు దాన్ని వాయిదా వేయడం కుదరదు..

అందుకే భారత జట్టు చాలామంది ఆటగాళ్లు, ఐపీఎల్ 2021 మొదలయ్యే సమయానికి అక్కడ ఉంటామో లేదోనని భయపడ్డారు... 

ఒకవేళ ఐదో టెస్టు సమయంలో పాజిటివ్ వస్తే, మరో 10 రోజులు క్వారంటైన్‌లో గడపాల్సి వస్తుందనే ఆలోచనే... టెస్టు మ్యాచ్ రద్దు కావడానికి ప్రధాన కారణం...

వారి ఆలోచన కరెక్టో కాదో నాకు తెలీదు, కానీ వారి నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నా. ఎందుకంటే బయో బబుల్ కారణంగా ఆటగాళ్లలో విపరీతమైన అసహనం, ఆవేశం నిండిపోయి ఉంటాయి...

బయో బబుల్ నుంచి బయో బబుల్‌లోకి, క్వారంటైన్ నుంచి క్వారంటైన్‌లోకి వెళ్తున్నారు. దీనివల్ల అనేక మానసిక సమస్యలు వస్తాయి...

బెన్ స్టోక్స్ విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. కఠినమైన బబుల్ నిర్మించడం కూడా కరెక్ట్ కాదు...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్...

click me!