ఆ లెక్కన టీమిండియా 3-1 తేడాతో సిరీస్ గెలిచింది... ఇంగ్లాండ్‌ను ట్రోల్ చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్...

First Published Sep 11, 2021, 9:44 AM IST

భారత్, ఇంగ్లాండ్ మధ్య హోరాహోరీగా సాగిన టెస్టు సిరీస్‌ ఫలితంలో స్పష్టత లేకుండా ముగిసింది. మొదటి నాలుగు టెస్టుల్లో రెండు మ్యాచులు గెలిచిన టీమిండియా, వర్షం కారణంగా తొలి టెస్టు విజయాన్ని అందుకోలేకపోయింది...

లీడ్స్‌లో జరిగిన మూడో టెస్టులో ఓటమి తప్ప, ఇంగ్లాండ్ సిరీస్‌లో భారత జట్టు, ఆతిథ్య జట్టుపై పూర్తి ఆధిక్యం కనబర్చింది... 

అయితే కరోనా భయంతో ఐదో టెస్టు ఆడడానికి టీమిండియా ఆటగాళ్లు అంగీకరించకపోవడంతో సిరీస్ ఫలితంపై సందిగ్ధత నెలకొంది...

ఐదో టెస్టును వచ్చే ఏడాది నిర్వహించేందుకు ఇరుజట్లు అంగీకరించినా... ఈ సిరీస్ ముగిసిందని, వచ్చే ఏడాది జరిగే టెస్టుతో దీనికి సంబంధం లేదని కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సీఈవో టామ్ హారీసన్...

ఈ టెస్టు సిరీస్ ఫలితాన్ని తేల్చే బాధ్యతను ఐసీసీకి అప్పగించింది ఇంగ్లాండ్. అయితే మరోసారి ఇంగ్లాండ్ జట్టును ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు నెటిజన్లు...

2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో స్కోర్లు సమం కావడం, సూపర్ ఓవర్ కూడా టైగా ముగియడంతో ఎక్కువగా బౌండరీలు బాదిన ఇంగ్లాండ్‌ను విజేతగా నిర్ణయించారు...

అలా చూసుకుంటే ఈ సిరీస్‌లో టీమిండియా 245 బౌండరీలు బాదగా, ఇంగ్లాండ్ జట్టు మొత్తం 233 బౌండరీలు మాత్రమే బాదింది. 

ఆ లెక్కన ఐదో టెస్టులో టీమిండియా 12 బౌండరీల తేడాతో గెలిచిందని... సిరీస్‌ 3-1 తేడాతో భారత జట్టుకే దక్కుతుందని ట్రోల్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

click me!