అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడాకారుడిగా విరాట్ కోహ్లీ

Published : Dec 27, 2023, 11:56 AM IST

 Kohli becomes most popular sportsperson: ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో బ్యాట్ తో అద‌ర‌గొట్టిన విరాట్ కోహ్లీ ప‌లు రికార్డులు న‌మోదుచేశాడు. అయితే, భారత్ ఫైన‌ల్ లో ఓడిపోయి ఉండొచ్చు కానీ, దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడాకారుడిగా ఎదగడానికి కోహ్లీని ఆపలేదు.  

PREV
15
అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడాకారుడిగా విరాట్ కోహ్లీ
Virat Kohli Bowling

Virat Kohli: 2023 నవంబర్ నాటికి భారత స్టార్  బ్యాట్స్‌మ‌న్ విరాట్ కోహ్లీ అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడాకారుడిగా నిలిచాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడినప్పటికీ కోహ్లీకి భారత్ లో తిరుగులేని పాపులారిటీ ఉంది. భారత్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా గెలుచుకున్నాడు.
 

25

ఆర్మాక్స్ మీడియా నివేదిక ప్రకారం, 2023 నవంబర్ లో దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడాకారుల జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా, భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రెండవ స్థానంలో, రోహిత్ శర్మ మూడవ స్థానంలో ఉన్నారు.
 

35
Virat Kohli

2020లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన భారత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీకి సోషల్ మీడియా ఖాతాలో చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. ముంబై ఇండియన్స్ కు ఐదు ఐపీఎల్ టైటిల్స్ అందించినప్పటి నుంచి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మరో భారతీయ క్రికెటర్ రోహిత్ శర్మ ఈ లిస్టులో మూడో స్థానంలో ఉన్నాడు. 
 

45

విరాట్ కోహ్లీ 2023 వన్డే వరల్డ్ క‌ప్ లో ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. ఆడిన 11 మ్యాచ్ ల‌లో 95.62 సగటుతో 765 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ లపై సెంచరీలు సాధించాడు. వన్డేల్లో 49 సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించి మొత్తంగా 80 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు.
 

55
Virat Kohli

2023 వన్డే వరల్డ్ క‌ప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత ఇద్ద‌రు ప్లేయ‌ర్లు ఇప్పుడు సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న టెస్టు సిరీస్ లో ఆడుతున్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories