IND vs SA: రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..

First Published | Dec 27, 2023, 10:18 AM IST

Virat Kohli breaks Rahul Dravid's record: వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ 2023లో స‌చిన్ టెండూల్క‌ర్ అత్య‌ధిక వ‌న్డే రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ..  సెంచూరియన్ లోని సూపర్ స్పోర్ట్ పార్క్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో మ‌రో దిగ్గ‌జ ప్లేయ‌ర్ రాహుల్ ద్ర‌విడ్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు.
 

Virat Kohli: ర‌న్ మిష‌న్ విరాట్ కోహ్లీ రికార్డుల మోత కొన‌సాగుతోంది. ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న టెస్టులో మ‌రో రికార్డును న‌మోదుచేశాడు. సెంచూరియన్ లోని సూపర్ స్పోర్ట్ పార్క్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో విరాట్ కోహ్లీ భార‌త దిగ్గ‌జ ప్లేయ‌ర్ రాహుల్ ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేశాడు. 
 

Virat Kohli

వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి నిరాశను వీడి రెయిన్ బో నేషన్ లో కొత్త అధ్యాయానికి నాంది పలికిన విరాట్ మ్యాచ్ తొలి రోజు బ్యాటింగ్ దిగ్గజం, ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొట్టాడు. దక్షిణాఫ్రికాతో తన 15వ టెస్టు ఆడుతున్న విరాట్ టెస్టుల్లో ప్రొటీస్ పై ద్రవిడ్ సాధించిన 1252 పరుగుల రికార్డును అధిగమించడానికి 16 పరుగులు అవసరం.


ఇక ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 38 పరుగులు చేసి కగిసో రబాడకు దొరికిపోయాడు. ఈ క్ర‌మంలోనే ద్ర‌విడ్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. టెస్టుల్లో దక్షిణాఫ్రికాపై 55.39 సగటుతో 1274 పరుగులు చేశాడు. తొలి టెస్టుకు ముందు మూడో స్థానంలో ఉన్న ద్రవిడ్ ను అధిగమించి దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు పరుగుల పట్టికలో మూడో స్థానంలో నిలిచాడు.
 

ఇక రెండో ఇన్నింగ్స్ లో విరాట్ 32, అంతకంటే ఎక్కువ పరుగులు చేయగలిగితే.. మ‌రో రికార్డు ఖాతాలో చేరుతుంది. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్.. 15 టెస్టుల్లో 1306 పరుగులతో సెహ్వాగ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ లిస్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 25 టెస్టుల్లో 42.46 సగటుతో 1741 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ రికార్డులో అగ్రస్థానంలో నిలవాలంటే విరాట్ రెండు టెస్టుల్లో 505, అంతకంటే ఎక్కువ పరుగులు చేయాలి. 
 

ఇటీవ‌ల ముగిసిన ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ లో 11 మ్యాచ్ ల‌లో  95.62 సగటుతో 765 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఈ టోర్నీలో మూడు సెంచరీలు, ఆరు అర్ధసెంచరీలు సాధించాడు. ప్రపంచకప్ లో విరాట్..   సచిన్ టెండూల్కర్ అత్యధిక వన్డే సెంచరీల రికార్డును కూడా బద్దలు కొట్టాడు.
 

ప్రపంచకప్ లో విరాట్ కోహ్లీ.. బ్యాట్ తో అద‌ర‌గొట్ట‌డ‌మే కాకుండా.. అత్యధిక వన్డే సెంచరీలు చేసిన తన చిన్ననాటి ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్లో సచిన్ మైలురాయిని అధిగమించి తన 50వ వన్డే సెంచరీని సాధించాడు.
 

Latest Videos

click me!