Virat Kohli
విరాట్ కోహ్లీ
ఈ ఏడాదిలో ఇప్పటివరకు 34 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 34 ఇన్నింగ్స్‌ల్లో ఎనిమిది సెంచరీలు, 9 అర్ధసెంచరీలతో 66.68 సగటుతో 1,934 పరుగులు చేశాడు. 2023 టాప్-10 క్రికెటర్ల లిస్టులో అగ్రస్థానంలో నిలిచాడు.
Shubman Gill
శుభమాన్ గిల్
ఈ ఏడాది ఇప్పటి వరకు 47 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన శుభ్‌మన్ గిల్ 48.31 సగటుతో ఏడు సెంచరీలు, 10 అర్ధసెంచరీలతో 2,126 పరుగులు చేశాడు.
ట్రావిస్ హెడ్
ఈ సంవత్సరం 30 అంతర్జాతీయ మ్యాచ్‌లలో, ట్రావిస్ హెడ్ 45.43 సగటు, 97 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో మూడు సెంచరీలు సాధించాడు. అలాగే, తొమ్మిది అర్ధసెంచరీలతో మొత్తం 1,681 పరుగులు చేశాడు.
rohit 1
రోహిత్ శర్మ
ఈ ఏడాది ఇప్పటివరకు 34 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ 51.28 సగటుతో 1,795 పరుగులు చేశాడు, 37 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలు, 11 అర్ధసెంచరీలతో 131 పరుగుల అత్యుత్తమ స్కోరు దుమ్మురేపాడు.
Aiden Markram
ఐడెన్ మార్క్‌రమ్
ఈ ఏడాది ఇప్పటి వరకు 34 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఐడెన్ మార్క్‌రమ్ 36 ఇన్నింగ్స్‌ల్లో నాలుగు సెంచరీలు, ఆరు అర్ధసెంచరీలతో 51.60 సగటుతో 1,548 పరుగులు చేశాడు.
మిచెల్ మార్ష్
ఈ ఏడాది 27 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మిచెల్ మార్ష్ 31 ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు, 10 అర్ధసెంచరీలతో 57.88 సగటుతో 1,447 పరుగులు చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 177*.
రవీంద్ర జడేజా
రవీంద్ర జడేజా ఈ ఏడాది 35 మ్యాచ్‌ల్లో 66 అంతర్జాతీయ వికెట్లు తీశాడు. వీటిలో 33 టెస్టుల్లో, 31 వన్డేల్లో, 2 టీ20ల్లో కలిపి ఈ వికెట్లు తీశాడు. ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో, అతను 30.65 సగటుతో 613 పరుగులు చేశాడు.
Mitchell Starc
మిచెల్ స్టార్క్
మిచెల్ స్టార్క్ ఇప్పటివరకు 22 మ్యాచ్‌లలో 59 వికెట్లు పడగొట్టాడు, అత్యుత్తమ గణాంకాలు 5/33. టెస్టుల్లో 34, వన్డేల్లో 25 వికెట్లు పడగొట్టాడు.
మహ్మద్ షమీ
మహమ్మద్ షమీ 23 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 56 వికెట్లతో 7/57 అత్యుత్తమ గణాంకాలతో ఈ ఏడాదిని ముగించాడు. వీటిలో 13 వికెట్లు టెస్టుల్లోనే వచ్చాయి. 24 వికెట్లతో ప్రపంచకప్ ఎక్కువ వికెట్లు తీసుకున్న బెస్ట్ బౌలర్ పట్టికలో అగ్రస్థానంలో నిలిచాడు.
పాట్ కమిన్స్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, ఐసీసీ వన్డే ప్రపంచ కప్ విజేత ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఇప్పటివరకు 23 మ్యాచ్‌లలో 6/91 అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలతో 49 వికెట్లు తీశాడు. వీటిలో 32 వికెట్లు టెస్టుల్లో కాగా, 17 వన్డేల్లో తీసుకున్నాడు.