విరాట్ కోహ్లీని అలా బెదిరించారు, ఆడితే ఓపెనింగ్ ఆడాలని లేదంటే... చిన్ననాటి కోచ్ సంచలన కామెంట్స్...

Published : Jan 28, 2022, 04:09 PM IST

గత దశాబ్ద కాలంలో విరాట్ కోహ్లీ టీమిండియాలో రికార్డుల వరద సృష్టించాడు. 10 ఏళ్లలో 20 వేలకు పైగా పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, 12 ఏళ్లలో 70 అంతర్జాతీయ సెంచరీలతో దుమ్మురేపాడు...

PREV
18
విరాట్ కోహ్లీని అలా బెదిరించారు, ఆడితే ఓపెనింగ్ ఆడాలని లేదంటే... చిన్ననాటి కోచ్ సంచలన కామెంట్స్...

గత దశాబ్ద కాలంలో విరాట్ కోహ్లీ టీమిండియాలో రికార్డుల వరద సృష్టించాడు. 10 ఏళ్లలో 20 వేలకు పైగా పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, 12 ఏళ్లలో 70 అంతర్జాతీయ సెంచరీలతో దుమ్మురేపాడు...

28

టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక వన్డే కెప్టెన్సీ నుంచి బలవంతంగా తప్పించింది బీసీసీఐ. కేప్‌ టౌన్ టెస్టు తర్వాత టెస్టు కెప్టెన్సీకి కూడా వీడ్కోలు పలికాడు విరాట్ కోహ్లీ...

38

‘వెస్టిండీస్‌తో సిరీస్‌లో టాప్ 3 ప్లేస్‌ల్లో ఆడడానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్ మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది..

48

రుతురాజ్ గైక్వాడ్ మంచి ఫామ్‌లో ఉన్నా, అతన్ని మిడిల్ ఆర్డర్‌లో ఆడించే ప్రయత్నం చేయవచ్చు. ఓపెనర్‌గా రావాలంటే రుతురాజ్ మరికొంత కాలం వేచి చూడాల్సిందే...

58

టీమిండియాలో రాణించాలంటే ఏ స్థానంలో అయినా పరుగులు చేయగలగాలి... విరాట్ కోహ్లీ కూడా కెరీర్ ఆరంభంలో ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు...

68

శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో విరాట్ కోహ్లీకి అవకాశం దక్కింది. వీరేంద్ర సెహ్వాగ్ గాయం కారణంగా తప్పుకోవడంతో విరాట్‌ని ఓపెనింగ్ చేయాలని సూచించింది టీమ్‌ మేనేజ్‌మెంట్...

78

ఒకవేళ ఓపెనింగ్ చేయడం ఇష్టం లేకపోతే, ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి పంపాస్తామని బెదిరించారు... విరాట్ ఓపెనింగ్ చేసేందుకు ఒప్పుకున్నాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ...

88

శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్‌తో కలిసి ఓపెనింగ్ వచ్చాడు విరాట్ కోహ్లీ... గంభీర్ డకౌట్ కాగా, విరాట్ కోహ్లీ 22 బంతుల్లో ఓ ఫోర్‌తో 12 పరుగులు చేశాడు...

Read more Photos on
click me!

Recommended Stories