2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి ముందు టీమిండియాకి ప్రధాన పేసర్‌గా ఉండేవాడు భువనేశ్వర్ కుమార్. ఓ ఎండ్‌లో జస్ప్రిత్ బుమ్రా, మరో ఎండ్‌లో భువీ... కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టేవాళ్లు...
2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాత ఐపీఎల్ 2020 సీజన్‌లో గాయపడిన భువనేశ్వర్ కుమార్, ఆ తర్వాత ఇంతకుముందున్న పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు...
211
టెస్టుల్లో చోటు కోల్పోయిన భువనేశ్వర్ కుమార్, సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు మ్యాచుల్లోనూ వికెట్ తీయలేకపోగా, భారీగా పరుగులు సమర్పించాడు...
311
ఈ పర్ఫామెన్స్ కారణంగా భువనేశ్వర్ కుమార్‌ను వన్డే జట్టు నుంచి తప్పించిన సెలక్టర్లు, వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌లో మాత్రం అతనికి అవకాశం కల్పించారు...
411
భువీకి ఛాన్స్ ఇవ్వడంపై భారత మాజీ పేసర్ మదన్ లాల్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు... ‘రోహిత్ శర్మ కమ్‌బ్యాక్ టీమిండియాకి చాలా అవసరం...
511
టీ20ల్లో అయినా, వన్డేల్లో అయినా సరైన ఓపెనింగ్ లభిస్తే, మంచి స్కోరు చేయడానికి అవకాశాలు పెరుగుతాయి.... రోహిత్ ఈ పొజిషన్‌లో అద్భుతంగా రాణించగలడు..
611
రవిభిష్ణోయ్‌ని సెలక్ట్ చేయడం మిగిలిన బౌలర్లకు మంచి సందేశాన్ని ఇచ్చినట్టు అవుతుంది. ఐపీఎల్‌తో పాటు విజయ్ హాజారే ట్రోఫీలోనూ భిష్ణోయ్ చక్కగా రాణించాడు...
711
అతను చాలా మంచి స్పిన్ బౌలర్. ఐపీఎల్‌లో కూడా బంతిని చక్కగా తిప్పగలిగాడు. భిష్ణోయ్ మంచి ఫీల్డర్ కూడా...
811
భువనేశ్వర్ కుమార్‌ను వన్డేల నుంచి తప్పించడమే సరైన నిర్ణయం. అతను సరిగ్గా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు. కానీ అతనికి టీ20ల్లో ఎందుకు అవకాశం కల్పించారు...
911
అతని స్థానంలో మరో యంగ్ పేసర్‌కి అవకాశం వచ్చి ఉంటే బాగుండేది. నాకు తెలిసి భువీకి ఇదే ఆఖరి అవకాశం కూడా కావచ్చు...
1011
టీమిండియా తరుపున వరుసగా మ్యాచులు ఆడాలనుకుంటే భువనేశ్వర్ కుమార్, మరోసారి తన సత్తాను నిరూపించుకోవాల్సి ఉంటుంది...
1111
ఆవేశ్ ఖాన్‌ని ఎంపిక చేయడం కూడా టీమిండియాకి మేలు చేస్తుంది. అతను మ్యాచ్ విన్నర్. చాలా టాలెంటెడ్ యంగ్‌స్టర్... ’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ మదన్ లాల్...