ఈ సందర్భంగా అక్తర్ సచిన్ పై ప్రశంసలు కురిపించాడు. సచిన్ తన కెరీర్ లో ప్రపంచంలోనే భీకరమైన బౌలర్లను ఎదుర్కున్నాడని చెప్పాడు. ‘సచిన్ తొలుత వసీం అక్రమ్, ఇమ్రాన్ ఖాన్ లను ఎదుర్కున్నాడు. ఆ తర్వాత వకార్ యూనిస్, షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్ లను కూడా ఆడాడు. ఆ తర్వాత తరమైన బ్రెట్ లీ, నా బౌలింగ్ ను కూడా సమర్థవంతంగా ఎదుర్కున్నాడు. అందుకే సచిన్ ను నేను చాలా టఫ్ బ్యాట్స్మెన్ అని పిలుస్తాను..’ అని చెప్పాడు. కాగా వన్డేలు, టెస్టులలో కలిపి సచిన్ తన కెరీర్ లో సుమారు 34 వేల పరుగులు చేయడం గమనార్హం.