టీ20 కెప్టెన్సీని వదులుకుని, వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించబడి, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు విరాట్ కోహ్లీ... ప్రపంచంలోనే 160 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగిన మొట్టమొదటి క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల పెళ్లి రోజు నేడు...
దేశంలో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. నాలుగేళ్ల వివాహ బంధం తర్వాత విరాట్ కోహ్లీని ఎందుకు పెళ్లాడాలిందో సీక్రెట్ బయటపెట్టింది అనుష్క శర్మ...
210
2017, డిసెంబర్ 11న పెళ్లి చేసుకున్న అనుష్క శర్మ, విరాట్ కోహ్లీలకు అప్పుడు సరిగ్గా 29 ఏళ్లు. నిజానికి విరాట్ కోహ్లీ కంటే అనుష్క శర్మ ఆరు నెలలు పెద్ద కూడా. అనుష్క శర్మ 1988, మే 1న జన్మిస్తే, విరాట్ కోహ్లీ నవంబర్ 5, 1988న జన్మించాడు...
310
ఇటలీలో అత్యంత ఘనంగా జరిగిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల పెళ్లికి అతికొద్ది బంధుమిత్రులు, ఆప్తులు మాత్రమే హాజరయ్యారు. అయితే 29 ఏళ్ల వయసులో పెళ్లికి అంగీకరించేముందు కోహ్లీకి ఓ కండీషన్ పెట్టిందట అనుష్క శర్మ...
410
‘29 ఏళ్లకే పెళ్లి అంటే, చాలా చిన్న వయసులో పెద్ద నిర్ణయం తీసుకుంటున్నట్టు అనిపించింది. ముఖ్యంగా హీరోయిన్‌కి పెళ్లి తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోతాయి. హీరోయిన్‌గా మంచి పొజిషన్‌లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడం కూడా రిస్కే...
510
ప్రేక్షకులు, హీరో హీరోయిన్లను ఎప్పుడూ తెరపై యంగ్‌గా చూడాలని అనుకుంటారు. అంతేకాకుండా పెళ్లి కాగానే పిల్లల్ని కనాలి, తల్లిగా బాధ్యతలు తీసుకోవాలనే ఆలోచన నుంచి అందరూ బయటికి రావాలి.
610
విరాట్ కోహ్లీ పెళ్లి చేసుకుందామని అడగ్గానే, నేను ఒక కండీషన్ పెట్టాను. నాకు, నా వ్యక్తిగత జీవితానికి గౌరవం ఉండాలి... అని! దానికి విరాట్ ఎప్పుడూ అడ్డు చెప్పడని తెలుసు... ’ అంటూ చెప్పుకొచ్చింది అనుష్క శర్మ..
710
పెళ్లికి ముందు నాలుగేళ్ల పాటు డేటింగ్ చేశారు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. పెళ్లైన తర్వాత బిజీ షెడ్యూల్ కారణంగా మొదటి ఏడాది కేవలం 22 రోజులు మాత్రమే కలిసి ఉన్నామని ప్రకటించింది విరుష్క జోడి...
810
కరోనా కారణంగా క్రికెట్‌కి, సినిమాలకు బ్రేక్ పడడంతో ఈ ఇద్దరూ కలిసి గడపడానికి కావాల్సినంత సమయం దక్కింది. లాక్‌డౌన్‌లో గర్భం దాల్చిన అనుష్క శర్మ, 2021, జనవరి 11న ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే..
910
తమ కూతురికి వామిక అని నామకరణం చేశారు విరాట్, అనుష్క. సోషల్ మీడియాకి దూరంగా కూతురిని పెంచాలని నిర్ణయం తీసుకున్నారు విరుష్క జోడీ...
1010
క్రికెట్ ఫీల్డ్‌లో అగ్రెసివ్‌గా పేరు తెచ్చుకున్నా, ఇంట్లో మాత్రం విరాట్ కోహ్లీ చాలా సైలెంట్ అంట. అనుష్క శర్మయే ఎప్పుడూ విరాట్ కోహ్లీపైన అరుస్తూ ఉంటుందట. విరాట్, భార్య కోపాన్ని భరిస్తూ, తన తప్పు లేకపోయినా ప్రేమగా దగ్గరికి తీసుకుని సారీ కూడా చెబుతాడట...