అజింకా రహానేకి కాదు, అతనికి బ్రేక్ కావాలి... బెన్ స్టోక్స్‌లా విరాట్ కోహ్లీ కూడా...

First Published Dec 7, 2021, 11:23 AM IST

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు, టెస్టు సిరీస్‌ను 1-0 తేడాతో సొంతం చేసుకుంది. టీ20 వరల్డ్ కప్ 2021 పరాజయం తర్వాత దక్కిన ఈ విజయాలు, భారత జట్టులో జోష్ నింపాయి...

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో అజింకా రహానే బ్యాట్స్‌మెన్‌గా ఫెయిల్ అయితే, రెండో టెస్టులో కమ్‌బ్యాక్ ఇచ్చిన విరాట్ కోహ్లీ కూడా బ్యాటింగ్‌లో పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయాడు.

దాదాపు ఐదేళ్లుగా అజింకా రహానే టెస్టు సగటు క్షీణిస్తూ వస్తోంది. గత ఏడాది 30+ యావరేజ్‌తో 1000+ పరుగులు చేసిన అజింకా రహానే, ఈ ఏడాది కేవలం 19.51 సగటుతో పరుగులు చేశాడు...

ఐదో స్థానంలో ఆరంగ్రేటంతోనే శ్రేయాస్ అయ్యర్ సెంచరీతో ఆకట్టుకోవడంతో అజింకా రహానే ప్లేస్‌కి చెక్ పెట్టినట్టైంది. దీంతో సౌతాఫ్రికా టూర్‌కి రహానేకి విశ్రాంతినివ్వాలని సూచిస్తున్నారు మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు...

ఎన్నో ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్న అజింకా రహానే, కొంత కాలం విశ్రాంతి తీసుకుంటే, మెంటల్‌గా, టెక్నికల్‌గా తనను తాను సరిదిద్దుకుని జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు అవకాశం కల్పించినట్టు అవుతుందని చెబుతున్నారు...

అయితే ఈ లిస్టులో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కూడా చేరాలని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్... గత రెండేళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు విరాట్ కోహ్లీ...

రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన విరాట్ కోహ్లీ (అంపైర్ వివాదాస్పద నిర్ణయం కారణంగా), రెండో ఇన్నింగ్స్‌లో జిడ్డు బ్యాటింగ్‌తో తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్టు కనిపించాడు...

తాను ఎదుర్కొన్న మొదటి 51 బంతుల్లో ఒక్క బౌండరీ కూడా బాదలేకపోయిన విరాట్ కోహ్లీ, తన ఇన్నింగ్స్‌లో ఒకే ఫోర్, ఓ సిక్సర్‌ మాత్రమే బాదాడు...

రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ అవుటైన విధానం, ఇంగ్లాండ్ టూర్‌లో అవుటైన విధానికి పెద్దగా తేడా కనిపించలేదు. మాటిమాటికి లెగ్ స్పిన్నర్ బౌలింగ్‌లో అవుట్ అవుతున్న కోహ్లీ, తన టెక్నిక్‌ను సరిదిద్దుకోవడంపై ఫోకస్ పెట్టడం లేదు...

విరాట్ కోహ్లీ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు సాధించాడు. అయితే విరాట్ ఆఖరి సెంచరీ సాధించి 50 ఇన్నింగ్స్‌లు దాటిపోయాయి...

కోహ్లీ ఈ సారి సెంచరీ కొడతాడు? ఈసారి కచ్ఛితంగా శతకం సాధిస్తాడు? అని అభిమానులు ఆశగా ఎదురుచూడడం, విరాట్ నిరాశపరచడం ఆనవాయితీగా మారింది...

రెండేళ్ల కిందటి వరకూ సరదాకా సెంచరీలు కొట్టినట్టు కనిపించిన విరాట్ కోహ్లీ, ఇప్పుడు ఓ విధమైన ట్రాన్స్‌లోకి వెళ్లినట్టు కనిపిస్తున్నాడు...

విరాట్ కోహ్లీ పరుగుల దాహం తీరనిది. అయితే కరోనా లాక్‌డౌన్ తర్వాత అతని నుంచి వరల్డ్ క్లాస్ ఇన్నింగ్స్ చూడలేదు. అందుకే అవసరమైతే విరాట్ కోహ్లీ, బెన్ స్టోక్స్‌లా కావాల్సినంత బ్రేక్ తీసుకుని, స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు అభిమానులు...

అయితే సౌతాఫ్రికా టూర్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ సాధిస్తాడని, దక్షిణాఫ్రికా టూర్‌లో ఆయన కూతురు వామిక పుట్టినరోజున కేప్‌టౌన్‌లో మ్యాచ్ ఆడనుంది టీమిండియా...

వామిక పుట్టినరోజు కానుకగా కేప్‌టౌన్‌లో విరాట్ కోహ్లీ బ్యాటు నుంచి 71వ సెంచరీ వస్తుందని ఆశ పడుతున్నారు అభిమానులు...

click me!