ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా షెడ్యూల్ విడుదల చేసిన సఫారీ క్రికెట్ బోర్డు... బాక్సింగ్ డే టెస్టు నుంచి...

Published : Dec 07, 2021, 09:25 AM IST

న్యూజిలాండ్‌తో స్వదేశంలో టీ20, టెస్టు సిరీస్‌ను పూర్తి చేసుకున్న భారత జట్టు, ఇదే నెలలో సౌతాఫ్రికా టూర్‌కి సిద్ధమవుతోంది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 17 నుంచి జరగాల్సిన ఈ టూర్‌ను, కరోనా ఒమిక్రాన్ వేరియెంట్ కారణంగా వారం రోజుల పాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే...

PREV
19
ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా షెడ్యూల్ విడుదల చేసిన సఫారీ క్రికెట్ బోర్డు... బాక్సింగ్ డే టెస్టు నుంచి...

డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే సౌతాఫ్రికా టూర్‌లో భారత జట్టు మూడు టెస్టులు, మూడు వన్డే మ్యాచులు ఆడనుంది. నాలుగు వేదికకల్లో ఈ మ్యాచులన్నీ జరగనున్నాయి... 

29

షెడ్యూల్ ప్రకారం నాలుగు టీ20 మ్యాచులు కూడా జరగాల్సి ఉన్నా, ఒమిక్రాన్ వేరియెంట్ కారణంగా పొట్టి ఫార్మాట్ సిరీస్‌ను వాయిదా వేశారు. 2022 ఏడాదిలో అవకాశాన్ని బట్టి ఈ టీ20 సిరీస్ నిర్వహిస్తామని తెలిపింది సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు.

39

‘క్లిష్ట పరిస్థితుల్లో కూడా భారత జట్టు, సౌతాఫ్రికా పర్యటించినందుకు ఆనందంగా ఉంది. వారం రోజుల ముందు ప్రకటించినట్టుగానే ఈ టూర్‌లో భారత జట్టు మూడు సిరీస్‌లకు బదులుగా రెండు సిరీస్‌లు ఆడనుంది. టెస్టులతో పాటు వన్డే సిరీస్ ఇప్పుడు జరుగుతుంది... ’ అంటూ క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటన విడుదల చేసింది. 

49

డిసెంబర్ 26 నుంచి 30 వరకూ ఇండియా, సౌతాఫ్రికా మధ్య సెంచూరియన్‌లోని సూపర్ స్టోర్ట్ పార్క్ వేదికగా మొదటి టెస్టు మ్యాచ్ జరుగుతుంది...

59

ఆ తర్వాత జనవరి 3 నుంచి జనవరి 7, 2022 వరకూ జోహన్‌బర్గ్‌లోని ఇంపీరియల్ వండరర్స్‌ గ్రౌండ్‌లో ఇండియా, సౌతాఫ్రికా మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది.  

69

జనవరి 11 నుంచి జనవరి 15 వరకూ కేప్‌ టౌన్‌లోని సిక్స్ గన్ గ్రిల్ న్యూలాండ్స్ మైదానంలో ఇరు దేశాల మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరుగుతుంది...

79

ఈ టెస్టు మ్యాచులన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం అవుతాయి. (సౌతాఫ్రికా కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు)...

89

పార్ల్,యూరోలక్స్ బోలాండ్ పార్క్‌లో జనవరి 19, 2022న మొదటి వన్డే, అదే మైదానంలో జనవరి 21న రెండో వన్డే జరుగుతాయి. ఆ తర్వాత కేప్‌టౌన్ వేదికగా జనవరి 23న ఆఖరి వన్డే ఆడుతుంది టీమిండియా...

99

టెస్టు మ్యాచులన్నీ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 సీజన్‌లో భాగమైతే, వన్డే సిరీస్ మ్యాచులు వరల్డ్ కప్ సూపర్ లీగ్ 2020-2023కు అర్హత సాధించడానికి కీలకంగా మారనున్నాయి.. 

click me!

Recommended Stories