ఒకే ఫ్రేమ్‌లో యువరాజ్ సింగ్, ఎమ్మెస్ ధోనీ... చాలా ఏళ్ల తర్వాత పాత మిత్రులను కలిపిన కబడ్డీ...

First Published Dec 7, 2021, 10:00 AM IST

రాజకీయాల్లోలాగే క్రికెట్‌లో కూడా శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ యువరాజ్ సింగ్, ఎమ్మెస్ ధోనీ. టీమిండియా మ్యాచ్ ఫినిషిర్లుగా, ఎన్నో విజయాలను అందించిన యువీ, మాహీ... ఆ తర్వాత వివిధ కారణాల వద్ద శత్రువులుగా మారారు. కబడ్డీ కారణంగా చాలా ఏళ్ల తర్వాత ఈ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూసే అవకాశం కలిగింది...

అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఐపీఎల్‌ మాత్రమే ఆడుతున్న ఎమ్మెస్ ధోనీ, ప్రస్తుతం ప్రో కబడ్డీ లీగ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు...

కబడ్డీ యాడ్‌ కోసం తన పాత స్నేహితుడు, టీమిండియా టీమ్‌మేట్ యువరాజ్ సింగ్‌ను కలిశాడు మహేంద్ర సింగ్ ధోనీ. మాహీతో కలిసి ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు యువరాజ్ సింగ్... 

2004 నుంచి 2011 వరకూ భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ మధ్య స్నేహం చూసి క్రికెట్ ఫ్యాన్స్ ఆనందపడేవాళ్లు. వీరిద్దరూ కలిసి కొన్ని మధురమైన భాగస్వామ్యాలు నెలకొల్పి, భారత జట్టుకి విజయాలను అందించారు...
 

ధోనీ సెంచరీ చేస్తే, యువీ సెలబ్రేట్ చేసుకునేవాడు. విజయం తర్వాత యువరాజ్ సింగ్‌, ధోనీ కలిసి మైదానంలో చిందులు వేసేవాళ్లు, క్రీజులో అల్లరి చేసేవాళ్లు... బైక్ ఎక్కి, గోల గోల చేసేవాళ్లు. 

అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ ఈ ఇద్దరి స్నేహం ఎక్కువ కాలం నిలవలేదు.  2011 వన్డే వరల్డ్‌కప్‌లో యువీ కంటే ముందు ధోనీ బ్యాటింగ్‌కి రావడం, ఆ తర్వాత మాహీ కెప్టెన్‌గా ఉన్నప్పుడే యువరాజ్ సింగ్ జట్టులో చోటు కోల్పోవడం వంటివి ఈ ఇద్దరి మధ్య వైరాన్ని పెంచాయి. 

అయితే మహీ, దీపికా పదుకొనే, యువరాజ్ సింగ్ మధ్య జరిగిన ముక్కోణపు ప్రేమకథే... ఈ ఇద్దరు ఆప్త మిత్రులు, బద్ధ శత్రువులుగా మారడానికి కారణమని కూడా టాక్ వినిపించింది...

ఓ బ్రాండ్ ప్రమోషన్‌లో మహేంద్ర సింగ్ ధోనీకి, దీపికా పదుకొనేకి ఏర్పడిన పరిచయం, స్నేహంగా మారింది. ధోనీ, దీపికా పదుకొనే కలిసి కొన్ని ఈవెంట్లకు హాజరయ్యారు కూడా... వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, రహస్యంగా డేటింగ్ చేస్తున్నారని వార్తలు కూడా పుట్టుకొచ్చాయి. 

ఇదే సమయంలో దీపికా పదుకొనేను చూసిన యువరాజ్ సింగ్ కూడా ఆమెపై మనసు పారేసుకున్నాడు... తన స్నేహితుడు మనసు పడడంతో ధోనీ, దీపికాను త్యాగం చేశాడని వార్తలు వచ్చాయి...

జాతీయ మీడియాలో ధోనీ, దీపికా, యువరాజ్ సింగ్... ఈ ట్రైయాంగిల్ ప్రేమకథ గురించి చాలా వార్తలే వచ్చాయి... స్వయంగా బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌నే ఈ విషయం గురించి ప్రశ్నించారు చాలామంది రిపోర్టర్లు... దీనికి ఫన్నీగా సమాధానం చెప్పాడు షారుక్... ‘దీపికా, యువీది కాదు, ధోనీది కాదు... నాది... నా సినిమాలో హీరోయిన్ తను’ అని చెప్పాడు షారుక్.

కొన్ని షోల కోసం దీపికా పదుకొనేతో కలిసి వెళ్లానని, ఆ తర్వాత ఇలాంటి రూమర్లు పుట్టుకొచ్చాయని ఆమెతో ప్రేమాయణం గురించి కొట్టిపాడేశాడు మహేంద్ర సింగ్ ధోనీ... అయితే అప్పటిదాకా లాంగ్ హెయిర్‌తో ట్రెండ్ సెట్ చేసిన మహేంద్ర సింగ్ ధోనీ, షార్ట్ హెయిర్‌ స్టైల్‌లో మారడానికి దీపికా పదుకొనేనే కారణమంటారు చాలామంది...

కిమ్ శర్మ వంటి బాలీవుడ్ హీరోయిన్లతో డేటింగ్ చేసిన యువీతో దీపికా కూడా కొన్నాళ్లు డేటింగ్ చేసిందని వార్తలు వచ్చాయి. వీరిద్దరూ రెస్టారెంట్లకి, కొన్ని షోలకు కలిసి వెళ్లిన ఫోటోలు వార్తల్లో నిలిచాయి...  అయితే వీరి అనుబంధం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు.. ప్రాణ స్నేహితులుగా ఉన్న యువీ, ధోనీ మధ్య రిలేషన్... దీపికా ఇష్యూ తర్వాత పూర్తిగా మారిపోయిందని అంటారు...

అయితే ధోనీ కెప్టెన్‌ అయిన తర్వాత సీనియర్ల విషయంలో వ్యవహారించిన తీరు... యువీ దూరం కావడానికి కారణమని మరికొందరి వాదన... ఇవన్నీ కాదు 2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో తన ప్లేస్‌లో బ్యాటింగ్‌కి వెళ్లిన మహేంద్ర సింగ్ ధోనీ, హెలికాఫ్టర్ షాట్‌తో మ్యాచ్‌ను ముగించడం, క్రెడిట్ మొత్తం కొట్టేయడంతో యువీ అప్‌సెట్ అయ్యాడని అంటారు మరికొందరు.

అసలు ఏమైందో, ఎలా అయ్యిందో క్లారిటీ లేదు కానీ భారత క్రికెట్‌లో బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్న యువరాజ్ సింగ్, ధోనీ మధ్య మనస్ఫర్థలు ఏర్పడ్డాయి. ఈ కారణంగానే యువరాజ్ సింగ్ పోస్టు చేసిన ఫ్రెండ్‌షిప్ డే విషెస్ వీడియోలో కూడా మాహీ కనిపించలేదు.

సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, ఆశీష్ నెహ్రా, అజిత్ అగార్కర్, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్ వంటి... తన టీమ్‌ మేట్స్ దగ్గర్నుంచి క్రిస్‌గేల్, తన జూనియర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ వరకూ చాలామంది క్రికెటర్ల ఫోటోలను ఈ వీడియోలో జత చేసిన యువరాజ్ సింగ్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం పట్టించుకోలేదు... 

click me!