దీపక్ హుడా పర్ఫామెన్స్‌ వెనక గౌతమ్ గంభీర్... లక్నో మెంటర్ చేసిన పనిని బయటపెట్టిన...

Published : Jul 25, 2022, 01:16 PM IST

టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నాడు ఆల్‌రౌండర్ దీపక్ హుడా. దేశవాళీ టోర్నీల్లో పర్ఫామెన్స్ కారణంగా 2017లోనే సెలక్టర్ల దృష్టిలో పడినా, తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయిన దీపక్ హుడా, ఇప్పుడు విరాట్ కోహ్లీ ప్లేస్‌కే ఎసరు పెట్టే రేంజ్‌లో వచ్చిన అవకాశాలను కరెక్టుగా వాడుకుంటున్నాడు...

PREV
110
దీపక్ హుడా పర్ఫామెన్స్‌ వెనక గౌతమ్ గంభీర్... లక్నో మెంటర్ చేసిన పనిని బయటపెట్టిన...

ఐర్లాండ్‌తో జరిగిన ఆఖరి టీ20లో సెంచరీ చేసి... రోహిత్ శర్మ, సురేష్ రైనా, కెఎల్ రాహుల్ తర్వాత టీ20ల్లో సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు దీపక్ హుడా...

210

వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేల్లో 32 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 27 పరుగులు చేసి పర్వాలేదనిపించిన దీపక్ హుడా, రెండో వన్డేలో 36 బంతుల్లో 2 ఫోర్లతో 33 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు...

310
Deepak Hooda

తొలి వన్డేలో పొదుపుగా బౌలింగ్ చేసిన దీపక్ హుడా, రెండో వన్డేలో 9 ఓవర్లలో 42 పరుగులు మాత్రమే ఇచ్చి డేంజరస్ బ్యాటర్ కేల్ మేయర్స్‌ని అవుట్ చేశాడు. 23 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 39 పరుగులు చేసిన కేల్ మేయర్స్, దీపక్ హుడా బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

410
Image credit: PTI

ఐపీఎల్ 2022 సీజన్‌లో 15 మ్యాచులు ఆడిన దీపక్ హుడా 32.21 సగటుతో 451 పరుగులు చేశాడు. ఈ పర్ఫామెన్స్ కారణంగానే అతనికి ఐర్లాండ్ సిరీస్‌తో పాటు ఇంగ్లాండ్ టూర్‌లోనూ అవకాశం ఇచ్చారు సెలక్టర్లు...

510
Image credit: PTI

‘దీపక్ హుడా, ఐపీఎల్ 2022 సీజన్‌లో ఈ విధంగా ఆడడానికి ప్రధాన కారణం గౌతీ. సీజన్ ఆరంభానికి ముందే ఏం జరిగినా నువ్వు అన్ని మ్యాచుల్లో ఆడతావు... అని హుడాతో గౌతమ్ గంభీర్ చెప్పాడు...

610

ఆ మాటలు విని దీపక్ హుడా కూడా షాక్ అయ్యాడు. ఓ ప్లేయర్‌ని ఎలా బ్యాక్ చేయాలో గౌతమ్ గంభీర్‌కి బాగా తెలుసు. హుడా ప్రతీ విషయాన్ని నేర్చుకోవాలని ఆతృతగా ఎదురుచూసే ప్లేయర్. ప్రతీ రోజూ తనని మరింత మెరుగ్గా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు..

710

అందుకే అతని ఆకలిని తెలుసుకున్న గౌతీ, మోరల్ సపోర్ట్‌ అందించాడు. దీపక్ హుడా క్రీజులో కుదురుకుంటే అతన్ని ఆపడం చాలా కష్టం.. ఆ విషయం గంభీర్ చాలా త్వరగానే పసిగట్టారు...

810

పొట్టి ఫార్మాట్‌లో తప్పులు చేస్తే వాటిని సరిదిద్దుకోవడం చాలా కష్టం. అందుకే అన్ని సార్లు క్రీజులోకి వెళ్లగానే బౌండరీలు బాదడం కరెక్ట్ కాదు. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి నెమ్మదిగా ఆడాల్సి ఉంటుంది...

910

మైండ్‌సెట్ కరెక్టుగా ఉంటే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా స్వేచ్చగా ఆడొచ్చు. పిచ్ అనుకూలించనప్పుడే బ్యాటర్‌లోనే అసలు సిసలు సత్తా అనేది బయటికి వస్తుంది.. అందుకే దీపక్ హుడా ఓ ఫైవ్ స్టార్ ప్లేయర్ అవుతాడు...’ అంటూ కామెంట్ చేశాడు లక్నో సూపర్ జెయింట్స్ అసిస్టెంట్ కోచ్ విజయ్ దహియా...

1010

ఐపీఎల్ 2022 సీజన్‌లో కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన లక్నో సూపర్ జెయింట్స్, ఎలిమినేటర్ 1 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతుల్లో ఓడి నాలుగో స్థానానికి పరిమితమైంది.. 

click me!

Recommended Stories