జడ్డూ ప్లేస్‌కి ఎసరు పెడుతున్న అక్షర్ పటేల్... వీరోచిత హాఫ్ సెంచరీతో ధోనీ రికార్డును బ్రేక్ చేసి...

First Published Jul 25, 2022, 10:54 AM IST

అక్షర్ పటేల్... టెస్టుల్లో ఆరంగ్రేటం నుంచి అదిరిపోయే పర్ఫామెన్స్‌ ఇస్తున్న స్పిన్నర్. ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చినా అక్షర్ పటేల్ నుంచి మొన్నటిదాకా బ్యాటుతో చెప్పుకునే ఇన్నింగ్స్‌ అయితే రాలేదు. అయితే వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్‌తో మాహీ రికార్డును బ్రేక్ చేశాడు అక్షర్ పటేల్...

312 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 205 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. శుబ్‌మన్ గిల్ 43, శ్రేయాస్ అయ్యర్ 63, సంజూశాంసన్ 54 పరుగులు, దీపక్ హుడా 33 పరుగులు చేసి ఆకట్టుకున్నా కీలక సమయంలో అవుటైపోయారు...

Axar Patel

మెరుపులు మెరిపిస్తాడనుకున్న శార్దూల్ ఠాకూర్ కూడా 3 పరుగులకే పెవిలియన్ చేరడంతో భారత జట్టు ఓటమి ఖాయమనుకున్నారంతా. అయితే ఆఖర్లో అక్షర్ పటేల్ అద్భుతమే చేశాడు. 35 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 64 పరుగులు చేసి ఆఖరి ఓవర్లలో సిక్సర్‌తో మ్యాచ్‌ని ముగించాడు... ఆఖరి 9.4 ఓవర్లలో 100 పరుగులు రాబట్టింది టీమిండియా...

Latest Videos


Axar Patel and Sanju Samson

ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి ఐదు సిక్సర్లు బాదిన అక్షర్ పటేల్, 12 ఏళ్ల క్రితం ధోనీ క్రియేట్ చేసిన రికార్డును బ్రేక్ చేశాడు. 2005లో జింబాబ్వేతో మ్యాచ్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన ధోనీ మూడు సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత యూసఫ్ పఠాన్ రెండు సార్లు ఈ ఫీట్ సాధించాడు...

మాహీ మూడు కొడితే, అక్షర్ పటేల్ ఏకంగా ఐదు సిక్సర్లతో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో భారత జట్టుకి వన్డే సిరీస్ విజయాన్ని అందించిన అక్షర్ పటేల్, భవిష్యత్తులో రవీంద్ర జడేజా ప్లేస్‌కి ఎసరు పెడతాడని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

Image credit: Getty

అక్షర్ పటేల్‌కి దేశవాళీ క్రికెట్‌లో మంచి రికార్డు ఉంది. 43 మ్యాచుల్లో 33.07 సగటుతో 1720 పరుగులు చేశాడు అక్షర్ పటేల్. ఇందులో ఓ సెంచరీ, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దీంతో వరుసగా గాయపడుతూ జట్టుకి అందుబాటులో ఉండలేకపోతున్న రవీంద్ర జడేజాకి కరెక్ట్ రిప్లేస్‌మెంట్ అక్షర్ పటేల్ అంటున్నారు విశ్లేషకులు...

అదీకాకుండా కొంతకాలంగా రవీంద్ర జడేజా బౌలింగ్‌లో మెరుపులు మెరిపించలేకపోతున్నాడు. బ్యాటింగ్‌లో అదరగొడుతున్నా బౌలింగ్‌లో కనీసం 1-2 వికెట్లు కూడా తీయలేకపోతున్నాడు. దీంతో జడేజా ఏదో ఒక ఫార్మాట్‌కి పరిమితమైతే మిగిలిన ఫార్మాట్లలో అక్షర్ పటేల్‌కి అవకాశం దొరకవచ్చని అభిప్రాయపడుతున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్..

click me!