కుల్దీప్ యాదవ్ ఫిట్... కెఎల్ రాహుల్ డౌట్! వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ కోసం రోహిత్ సేన రెఢీ...

Published : Jul 25, 2022, 12:15 PM ISTUpdated : Jul 25, 2022, 12:18 PM IST

ఇంగ్లాండ్ టూర్‌లో వన్డే, టీ20 సిరీస్ గెలిచిన విజయోత్సాహంతో వెస్టిండీస్ టూర్‌లో అడుగుపెట్టింది భారత జట్టు. విండీస్‌పై గత 10 ఏళ్లుగా పరాజయం ఎరుగని భారత జట్టు, హోరాహోరీగా జరిగిన తొలి రెండు వన్డేల్లో గెలిచి వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. మూడో వన్డే తర్వాత జరిగే టీ20 సిరీస్ కోసం సీనియర్లు, వెస్టిండీస్‌కి చేరుకుంటున్నారు...

PREV
15
కుల్దీప్ యాదవ్ ఫిట్... కెఎల్ రాహుల్ డౌట్! వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ కోసం రోహిత్ సేన రెఢీ...

ఇంగ్లాండ్ టూర్ తర్వాత వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కి దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్.. టీ20 సిరీస్‌లో ఆడబోతున్నారు... ఇప్పటికే టీ20 సిరీస్ కోసం వీరంతా వెస్టిండీస్ పయనమయ్యారు...

25

అలాగే గాయం కారణంగా ఇంగ్లాండ్ టూర్‌లో చోటు దక్కించుకోలేకపోయిన కెఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్‌లకు కూడా విండీస్‌తో టీ20 సిరీస్‌లో అవకాశం కల్పించింది బీసీసీఐ. అయితే ఈ ఇద్దరూ ఫిట్‌నెస్ నిరూపించుకున్న తర్వాత ఆడేది? లేనిది... తేలుతుందని స్పష్టం చేసింది...

35
Image credit: PTI

సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, బీసీసీఐ నిర్వహించిన పరీక్షల్లో ఫిట్‌నెస్ నిరూపించుకుని వెస్టిండీస్‌కి బయలుదేరాడు. కెఎల్ రాహుల్‌ గాయం నుంచి కోలుకున్నా, కరోనా పాజిటివ్‌గా తేలడంతో టీ20 సిరీస్‌కి అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది...

45

జర్మనీకి వెళ్లి హెండ్రియాకి శస్త్ర చికిత్స చేయించుకున్న కెఎల్ రాహుల్, బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ప్రాక్టీస్ కూడా చేశాడు. అయితే ఇక్కడే కెఎల్ రాహుల్ కరోనా పాజిటివ్‌గా తేలడంతో ప్రస్తుతం అతను ఐసోలేషన్‌లో ఉన్నాడు...
 

55

టీ20 సిరీస్ సమయానికి కెఎల్ రాహుల్ కరోనా నుంచి కోలుకున్నా, టీమిండియాకి అందుబాటులో ఉంటాడా? లేక రెస్ట్ తీసుకుంటాడా? అనేది తేలాల్సి ఉంది... 

click me!

Recommended Stories