వరల్డ్ కప్ ఆడాల్సిన వాడు, ఇలా అవమానించడం కరెక్ట్ కాదు... సంజూ శాంసన్‌‌పై ఆశీష్ నెహ్రా కామెంట్...

First Published Nov 28, 2022, 9:30 AM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టులో సంజూ శాంసన్ పేరు లేకపోవడం తీవ్ర వివాదాస్పదమైంది. పొట్టి ప్రపంచ కప్‌లో దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్‌లను ఆడించిన టీమిండియా మేనేజ్‌మెంట్, వారి నుంచి కనీస పరుగులు కూడా రాబట్టలేకపోయింది. కనీసం వరల్డ్ కప్ తర్వాతైనా సంజూ శాంసన్‌కి వరుస అవకాశాలు వస్తాయనుకుంటే అది కూడా జరగడం లేదు...

Sanju Samson

న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో చోటు దక్కించుకోలేకపోయిన సంజూ శాంసన్, తొలి వన్డేలో ఆరో స్థానంలో వచ్చి 30+  పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి ఐదో వికెట్‌కి 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు సంజూ శాంసన్...

Sanju Samson

అయితే తొలి వన్డేలో 307 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది టీమిండియా. దీంతో రెండో వన్డేలో రెండు మార్పులు చేసిన భారత జట్టు... దీపక్ హుడాని తుది జట్టులోకి తేవడం కోసం సంజూ శాంసన్‌పై వేటు వేసింది... శార్దూల్ ఠాకూర్ ప్లేస్‌లో దీపక్ చాహార్ తుది జట్టులోకి వచ్చాడు...

Sanju Samson

‘దీపక్ హుడాని బౌలింగ్ కోసం తీసుకుని ఉంటారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే టీమ్‌లో వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. అతను బాగానే బౌలింగ్ చేశాడు. టీ20ల్లో వికెట్లు కూడా తీశాడు. దీపక్ హుడా, టీమిండియాకి ఆరో బౌలింగ్ ఆప్షన్. అయితే మ్యాచ్‌ని మలుపు తిప్పే గొప్ప బౌలర్ అయితే కాదు...

Sanju Samson-Shreyas Iyer

శార్దూల్ ఠాకూర్ కంటే దీపక్ చాహార్ మంచి బౌలర్. అయితే తొలి వన్డేలో ఠాకూర్‌ని ఆడించారు. ఒక్క మ్యాచ్‌కే అతన్ని తీసి పక్కనెబెట్టారు. వరల్డ్ కప్‌లో ఆడిన దీపక్ హుడాని తొలి వన్డే ఆడించలేదు. సంజూ శాంసన్‌ని ఒక్క మ్యాచ్ ఆడించి పక్కనబెట్టేశారు..

Image credit: Getty

టీమ్‌కి ఏం కావాలనే విషయంలో క్లారిటీ అవసరం. ఒక్క మ్యాచ్ ఆడించి, ఇలా పక్కనబెట్టడం వల్ల ప్లేయర్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్‌లకు టీ20ల్లో మంచి అనుభవం ఉంది కానీ వన్డేల్లో పెద్దగా అనుభవం లేదు... వరల్డ్ కప్‌లో చాహాల్‌ని ఒక్క మ్యాచ్ ఆడించలేదు...

Image credit: PTI

టీమ్ మేనేజ్‌మెంట్ ప్లేయర్లతో ఏం మాట్లాడుతుందో తెలీదు. బాగా ఆడుతున్న వాళ్లను సరైన కారణం లేకుండా తీసి పక్కనబెట్టడం వల్ల జట్టు సమతుల్యం మిస్ అవుతుంది. బాగానే ఆడుతున్నా కదా... ఎందుకు తీసేశారనే ఆలోచన ప్లేయర్లలో రానివ్వకూడదు... మ్యాచ్ మ్యాచ్‌కీ మార్పులు చేయాల్సిన అవసరం ఏముంది? ’ అంటూ కామెంట్ చేశాడు గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్, మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.. 

click me!