ఓ వైపు వెంకటేశ్ అయ్యర్, మరోవైపు రుతురాజ్ గైక్వాడ్... సౌతాఫ్రికా సిరీస్‌కి ముందు...

First Published Dec 12, 2021, 2:19 PM IST

ఒకే ఒక్క సీజన్‌ పర్ఫామెన్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షించి, టీమిండియాలో చోటు దక్కించుకున్నారు సీఎస్‌కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, కేకేఆర్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్... తాజాగా విజయ్ హాజారే ట్రోఫీ 2021-22 సీజన్‌లోనూ ఈ ఇద్దరూ దుమ్మురేపుతున్నారు..

ఐపీఎల్ 2021 సీజన్‌లో 16 ఇన్నింగ్స్‌ల్లో 635 పరుగులు చేసి, ఆరెంజ్ క్యాప్ గెలిచిన అతిపిన్న వయస్కుడిగా నిలిచిన రుతురాజ్ గైక్వాడ్, తన ఫామ్‌ను కొనసాగిస్తూనే ఉన్నాడు...

గత నెలలో జరిగిన సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో 5 ఇన్నింగ్స్2ల్లో 259 పరుగులు చేసి అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్, విజయ్ హాజారే ట్రోఫీ 2021 టోర్నీలో మహారాష్ట్ర జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు...

మొదటి మూడు మ్యాచుల్లో వరుసగా మూడు సెంచరీలు చేసిన రుతురాజ్ గైక్వాడ్, ఇప్పటికే 3 ఇన్నింగ్స్‌ల్లో 414 పరుగులు చేసి టాప్‌లో నిలిచాడు...

మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 112 బంతుల్లో 136 పరుగులు చేసిన రతురాజ్ గైక్వాడ్, ఛత్తీస్‌ఘడ్‌తో జరిగిన మ్యాచ్‌లో 143 బంతుల్లో 154 పరుగులు చేశాడు...

కేరళతో జరిగిన మ్యాచ్‌లో 129 బంతుల్లో 124 పరుగులు చేసి, గత సీజన్‌లో దేవ్‌దత్ పడిక్కల్ తర్వాత వరుసగా మూడు సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రుతురాజ్ గైక్వాడ్...

మధ్యప్రదేశ్ జట్టు తరుపున వెంకటేశ్ అయ్యర్ కూడా తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. నాలుగు మ్యాచుల్లో రెండు సెంచరీలతో దుమ్ము రేపాడు అయ్యర్...

 మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో 5 బంతుల్లో 2 సిక్సర్లతో 14 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్, కేరళతో జరిగిన మ్యాచ్‌లో 84 బంతుల్లో 7 ఫోర్లు, 4  సిక్సర్లతో 112 పరుగులు చేసి అదరగొట్టాడు...

కేరళతో జరిగిన మ్యాచ్‌లో 9 ఓవర్లలో 3 వికెట్లు తీసిన వెంకటేశ్ అయ్యర్, మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ఓ వికెట్ తీశాడు. .

చంఢీఘర్‌తో జరిగిన మ్యాచ్‌లో 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి మధ్యప్రదేశ్ జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్, 88 బంతుల్లో సెంచరీ చేసి అదరగొట్టాడు..

113 బంతుల్లో 8 ఫోర్లు, 10 సిక్సర్లతో 151 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్, మధ్య ప్రదేశ్ జట్టు 331 పరుగుల భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర  పోషించాడు...

సౌతాఫ్రికా టూర్‌కి ఎంపిక చేసే జట్టులో వెంకటేశ్ అయ్యర్ పేరు ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. అయ్యర్‌తో పాటు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి ఎంపికైనా తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయిన రుతురాజ్ గైక్వాడ్‌కి కూడా మరోసారి సెలక్టర్ల నుంచి పిలుపు రావడం ఖాయంగా కనిపిస్తోంది...

వెంకటేశ్ అయ్యర్‌కి అవకాశం ఇస్తే, హార్ధిక్ పాండ్యా తుదిజట్టుకి దూరం కావాల్సి ఉంటుంది. రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేస్తే ఓపెనర్‌గా ఎవరిని ఆడించాలనే విషయంపై పోటీ మరింత పెరుగుతుంది...

click me!