ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్, తుది జట్టులో ఉన్నా బ్యాటింగ్‌కి రాకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. రుతురాజ్ గైక్వాడ్ ఫీల్డింగ్ చేసేటప్పుడు గాయపడ్డాడని, అందుకే బ్యాటింగ్ చేయలేదని కెప్టెన్ హార్ధిక్ పాండ్యా క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది... రుతురాజ్ గైక్వాడ్ గాయపడడంతో రెండో టీ20లో ఎవరు ఓపెనింగ్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది...
ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు వెంకటేశ్ అయ్యర్, టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేసి 9 టీ20 మ్యాచులు కూడా ఆడాడు. అయితే ఐపీఎల్ 2022 తర్వాత అతనికి తుది జట్టులో చోటు దక్కడం లేదు...
25
‘రెండో టీ20లో రుతురాజ్ గైక్వాడ్ ఆడతాడా? లేదా? ఒకవేళ అతను ఆడకపోతే ఎవరు ఓపెనింగ్ చేస్తారు? నా ఉద్దేశంతో వెంకటేశ్ అయ్యర్‌కి అవకాశం ఇస్తే బెటర్...
35
ఎందుకంటే అతను ఐపీఎల్ 2021 సీజన్‌లో ఓపెనర్‌గా అదరగొట్టాడు. ఒకవేళ అయ్యర్‌ని ఆడించకపోతే, అతన్ని ఇలా విదేశీ టూర్లకు ఎందుకు తీసుకెళ్తున్నారు? జట్టులో పెట్టుకుని, రిజర్వు బెంచ్‌లో ఎందుకు కూర్చోబెడుతున్నారు?
45
టూరిస్ట్ వీసా మీద ఐర్లాండ్‌కి వెళ్లలేదు కదా.. ఆడించకుండా అలా తిప్పి చూపించి తీసుకురావడానికి... రుతురాజ్ గైక్వాడ్ ఆడకపోతే మళ్లీ దీపక్ హుడా ఓపెనింగ్ వస్తాడా? అంత అవసరం లేదనే అనుకుంటా...
55
Sanju Samson
సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠిలను అలా రిజర్వు బెంచ్‌లో కూర్చోబెడుతున్నారు. ఈ ఇద్దరికీ అవకాశం ఇచ్చి, ఆడించాలి... శాంసన్ ఓపెనర్‌గా కూడా ఆడగలడు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...