కోహ్లీ దాన్ని వదిలేశాడు, మళ్లీ ముట్టుకోడు... విరాట్ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ...

Published : Jun 28, 2022, 12:05 PM IST

గత ఏడాది ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు విరాట్ కోహ్లీ. వర్షం కారణంగా తొలి టెస్టు డ్రాగా ముగియగా రెండో టెస్టులో టీమిండియా, మూడో టెస్టులో ఇంగ్లాండ్ గెలిచాయి. నాలుగో టెస్టు గెలిచిన టీమిండియా 2-1 తేడాతో ఆధిక్యంలో ఉండగా భారత బృందంలో కరోనా కేసుల కారణంగా ఐదో టెస్టు వాయిదా పడింది...

PREV
15
కోహ్లీ దాన్ని వదిలేశాడు, మళ్లీ ముట్టుకోడు... విరాట్ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ...

ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరగనున్న ఐదో టెస్టుకి అవాంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి. టీమిండియా కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ కెప్టెన్సీ నుంచి జో రూట్  తప్పుకోవడంతో భారత సారథిగా రోహిత్ శర్మ, ఇంగ్లాండ్ కెప్టెన్‌గా బెన్ స్టోక్స్... ఐదో టెస్టు ఆడాల్సి ఉంది...

25

అయితే ఐదో టెస్టు ఆరంభానికి ముందు రోహిత్ శర్మ కరోనా బారిన పడడంతో ఈ మ్యాచ్‌కి ఎవరు కెప్టెన్సీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీయే ఈ ఐదో టెస్టుకి కూడా కెప్టెన్‌గా వ్యవహరించి, సిరీస్‌ని ముగించాలని కోరుకుంటున్నారు ఆయన అభిమానులు...

35

‘విరాట్ కోహ్లీ టెస్టుల్లో కెప్టెన్సీ నుంచి తప్పించలేదు. అతనే స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. ఒక్కసారి ఆ పొజిషన్‌ని వదిలేసిన తర్వాత మళ్లీ తీసుకోవడానికి విరాట్ ఇష్టపడడు... 
 

45

సెలక్టర్లు లేదా బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటారో నాకు తెలీదు. విరాట్ ఎప్పుడూ టీమ్ మ్యాన్. ఇండియా విజయం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు... అయితే మళ్లీ కెప్టెన్సీ తీసుకోవడానికి విరాట్ ఇష్టపడకపోవచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ...

55

టెస్టు కెప్టెన్‌గా అత్యధిక విజయాలు అందుకున్న భారత సారథిగా రికార్డు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ, సౌతాఫ్రికా టూర్‌లో కేప్ టౌన్ టెస్టు పరాజయం తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే... 

Read more Photos on
click me!

Recommended Stories