Vaibhav Sooryavanshi: రివెంజ్ అంటే ఇలా ఉండాలి.. 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్ !

Published : Jun 21, 2026, 02:09 PM IST

Vaibhav Sooryavanshi: ట్రై నేషన్ సిరీస్ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం రేపాడు. 29 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 94 పరుగులు చేసి శ్రీలంక ఏ జట్టు బౌలర్లను ఉతికిపారేశాడు. 11 బంతుల్లోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ తో వరల్డ్ రికార్డ్ సాధించాడు.

PREV
15
లంక బౌలర్లపై మిసైల్‌లా విరుచుకుపడ్డ వైభవ్

ట్రై నేషన్ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఏ జట్టు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ శ్రీలంక ఏ టీమ్ బౌలర్లపై మిసైల్‌లా విరుచుకుపడ్డాడు. దంబుల్లాలోని రంగిరి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక ఏ కెప్టెన్ సాహన్ అరాచ్చిగే ముందుగా బౌలింగ్ ఎంచుకుని భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

క్రీజులోకి వచ్చిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 29 బంతుల్లోనే 324.14 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 94 పరుగులు బాదాడు. ఇందులో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. గతేడాది లంకతో జరిగిన మ్యాచ్‌లో గొడవ జరగడం, సూపర్‌ ఓవర్ లో ఓడిపోవడంతో ఈసారి వైభవ్ పక్కా రివెంజ్ మోడ్‌లో కనిపించాడు. మ్యాచ్‌కు కొన్ని గంటల ముందే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 100 అని పెట్టిన వైభవ్, కేవలం 6 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. కానీ లంక కెప్టెన్ సాహన్ అరాచ్చిగే వేసిన 9వ ఓవర్ లో అవుట్ అయ్యేలోపే లంక టీమ్‌కు వణుకు పుట్టించాడు.

25
11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల వరల్డ్ రికార్డ్ బ్రేక్

ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఒక సంచలన రికార్డును సాధించాడు. కేవలం 11 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీని ద్వారా లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. శ్రీలంకకు చెందిన కౌశల్య వీరరత్నే 21 ఏళ్ల క్రితం 12 బంతుల్లో చేసిన ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు. భారత్ ఏ జట్టు తరఫున వైభవ్‌కు ఇదే మొదటి హాఫ్ సెంచరీ కావడం విశేషం.

35
సచిన్ టెండూల్కర్ 36 ఏళ్ల రికార్డుకు ఎసరు

ఇటీవలే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలతో పాటు ఆసియా గేమ్స్ 2026 కోసం భారత టీ20 జట్టుకు వైభవ్ సూర్యవంశీ తొలిసారి ఎంపికయ్యాడు. 15 ఏళ్ల 71 రోజుల వయసులోనే టీమ్ ఇండియా సీనియర్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. దీనితో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 36 ఏళ్ల రికార్డు బద్దలైంది.

సచిన్ 1989లో పాకిస్తాన్‌పై 16 ఏళ్ల 205 రోజుల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఒకవేళ వైభవ్ రాబోయే సిరీస్‌లలో తుది జట్టులో ఆడితే, భారత్ తరఫున అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడైన పురుష క్రికెటర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం టీ20ల్లో వాషింగ్టన్ సుందర్ (18 ఏళ్ల 80 రోజులు), వన్డేల్లో సచిన్ (16 ఏళ్ల 238 రోజులు) అత్యంత చిన్న వయసులో అరంగేట్రం చేసిన రికార్డులు కలిగి ఉన్నారు.

45
ఐపీఎల్ 2026 లో క్రిస్ గేల్ రికార్డ్ క్లీన్ స్వీప్

రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ 2026 లో ఆడిన వైభవ్, అక్కడ అద్భుత ప్రదర్శన చేయడంతోనే టీమ్ ఇండియాకు సెలక్ట్ అయ్యాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ 16 ఇన్నింగ్స్‌లలో 237.30 స్ట్రైక్ రేట్‌తో రికార్డు స్థాయిలో 776 రన్స్ చేసి 'ఆరెంజ్ క్యాప్' సొంతం చేసుకున్నాడు. అలాగే టోర్నమెంట్‌లో 'మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్', 'ఎమర్జింగ్ ప్లేయర్' అవార్డులను కైవసం చేసుకున్నాడు.

అంతేకాదు, ఈ సీజన్ లో వైభవ్ ఏకంగా 72 సిక్సర్లు బాదాడు. దీని ద్వారా 2012లో క్రిస్ గేల్ నెలకొల్పిన 59 సిక్సర్ల ఐపీఎల్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ లో భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన వైభవ్, ఇంగ్లాండ్‌పై ఫైనల్లో 175 రన్స్ చేశాడు. యూత్ వన్డేల్లో 25 మ్యాచ్‌లాడిన వైభవ్ 56.48 యావరేజ్‌తో 1412 రన్స్ చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇందులో 110 సిక్సర్లు ఉండడం విశేషం.

55
బీహార్ లోని చిన్న గ్రామం నుండి టీమ్ ఇండియా దాకా

వైభవ్ సూర్యవంశీ 2011 మార్చి 27న బీహార్‌లోని సమస్తీపూర్ జిల్లా తాజ్‌పూర్ గ్రామంలో జన్మించాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ తో పాటు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. బీహార్ తరఫున డొమెస్టిక్ క్రికెట్ ఆడే వైభవ్, 2024లో కేవలం 12 ఏళ్ల వయసులోనే రంజీ ట్రోఫీలో ఫస్ట్-క్లాస్ డెబ్యూ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ కూడా ఒక క్రికెటరే. ఇక వైభవ్ వెస్టిండీస్ లెజెండ్ బ్రయాన్ లారాను తన రోల్ మోడల్‌గా భావిస్తాడు. తన పవర్‌ఫుల్ హిట్టింగ్‌తో 15 ఏళ్లకే టీమ్ ఇండియాలో చోటు దక్కించుకుని తనేంటో నిరూపించుకున్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories