India vs Afghanistan : పసికూనతో పెట్టుకుంటే మాములుగా ఉండదు.. గిల్ సేనకు అసలైన అగ్నిపరీక్ష

Published : Jun 06, 2026, 09:51 AM IST

India vs Afghanistan: ఇండియాలోనే భారత్‌కు ఆఫ్ఘనిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. చండీగఢ్‌లో అశ్విన్, జడేజా లేకుండానే 16 ఏళ్ల తర్వాత సరికొత్త స్పిన్ జోడీతో గిల్ సేన టెస్ట్ పోరుకు సిద్ధమైంది. అలాగే, కోహ్లీ, రోహిత్ లు లేకుండా ఆఫ్ఘన్ తో భారత్ తలపడుతోంది.

PREV
15
IND v AFG: ఇండియాలో ఇండియాకే హోస్ట్.. ఇదేం విచిత్రం బ్రో

క్రికెట్ చరిత్రలోనే ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన, మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ ఇది. టీమిండియాకే ఆతిథ్యం ఇవ్వబోతోంది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు.. వినడానికి కాస్త క్రేజీగా అనిపించినా ఇది అక్షరాలా నిజం. "ఆఫ్ఘనిస్తాన్ హోస్ట్ చేయాలనుకుంటే వాళ్ల దేశంలో మ్యాచ్‌లు పెట్టాలి కానీ, మన దేశంలో మనకు హోస్ట్ చేయడం ఏంటి బాసూ?" అని మీ డౌట్ వస్తుంది కదా.

అసలు మ్యాటర్ ఏంటంటే.. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న అంతర్గత ఉద్రిక్త పరిస్థితుల వల్ల గత పదేళ్లుగా వాళ్లు తమ హోమ్ మ్యాచ్‌లను భారత్, యూఏఈ లలోనే ఆడుతున్నారు. అందులో భాగంగానే సెప్టెంబర్ నెలలో భారత్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఆఫ్ఘనిస్తాన్ అధికారికంగా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్‌లన్నీ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగబోతున్నాయి. సెప్టెంబర్ 13, 16, 19 తేదీల్లో ఈ టీ20ల షెడ్యూల్‌ను బీసీసీఐ ప్లాన్ చేసింది. గతంలో కూడా 2017లో గ్రేటర్ నోయిడాలో ఐర్లాండ్‌తో, 2018లో డెహ్రాడూన్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లకు ఆఫ్ఘాన్ ఇక్కడే హోస్ట్ చేసింది.

25
16 ఏళ్ల అజేయ రికార్డుకు బ్రేక్.. ఆ ఇద్దరు లేకుండానే

చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జూన్ 6 నుంచి ఆఫ్ఘనిస్తాన్‌తో ప్రారంభమైన ఏకైక టెస్ట్ మ్యాచ్‌తో భారత క్రికెట్‌లో సరికొత్త శకం మొదలైంది. అయితే ఈ మ్యాచ్‌తో 16 ఏళ్ల సుదీర్ఘమైన, అద్భుతమైన రికార్డుకు తెరపడింది. నవంబర్ 2010 తర్వాత భారత జట్టు స్వదేశంలో ఆడుతున్న ఒక టెస్ట్ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఇద్దరూ లేకుండా బరిలోకి దిగడం ఇదే మొదటిసారి. 

గత 16 ఏళ్లలో భారత్‌లో జరిగిన ప్రతి టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు కచ్చితంగా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండేవారు. కానీ ఇప్పుడు అశ్విన్ రిటైర్ అయిపోవడం, జడేజాకు మేనేజ్‌మెంట్ రెస్ట్ ఇవ్వడం, ఫామ్ లేమితో అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టడంతో సరికొత్త స్పిన్ అటాక్‌తో గిల్ సేన రంగంలోకి దిగింది. అలాగే, స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా లేరు.

35
కుల్దీప్ భుజాలపై కొండంత భారం.. తోడుగా రాజస్థాన్ యంగ్ స్టార్

సీనియర్ స్పిన్నర్ల గైర్హాజరీలో ఇప్పుడు భారత స్పిన్ విభాగాన్ని నడిపించే పూర్తి బాధ్యత చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ భుజాలపై పడింది. హోమ్ పిచ్‌లపై టీమిండియా స్పిన్ అటాక్‌ను అతను ఒంటిచేత్తో నడిపించాల్సి రావడంతో కుల్దీప్‌కు ఇది ఒక రకమైన అగ్నిపరీక్షే. అతనికి తోడుగా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు.

ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన మూడో స్పిన్నర్ స్థానంలో హర్ష్ దూబేను పక్కన పెట్టి, రాజస్థాన్‌కు చెందిన 23 ఏళ్ల స్పిన్ ఆల్‌రౌండర్ మానవ్ సుతార్‌కు టీమిండియా మేనేజ్‌మెంట్ టెస్ట్ క్యాప్ ఇచ్చింది. కుల్దీప్ యాదవ్ చేతుల మీదుగానే మానవ్ ఈ క్యాప్ అందుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 29 మ్యాచుల్లో 129 వికెట్లతో అదరగొట్టిన మానవ్ సుతార్‌కు, రాబోయే శ్రీలంక సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు.

45
గిల్ కెప్టెన్సీలో యువ సేన.. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన భారత్

దాదాపు ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా మళ్లీ వైట్ జెర్సీస్ వేసుకుని సాంప్రదాయ టెస్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. ఐపీఎల్, టీ20 హడావుడి ముగిశాక చండీగఢ్‌ పిచ్‌పై ఆఫ్ఘాన్‌తో తలపడుతోంది. రోహిత్, విరాట్, బుమ్రా వంటి సీనియర్లు లేకపోవడంతో యువ సంచలనం శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలంటే భారత్‌కు ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం. టాస్ గెలిచిన కెప్టెన్ గిల్ ఏమాత్రం ఆలోచించకుండా ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ బరిలోకి దిగగా, నెంబర్ 3 స్థానంలో సాయి సుదర్శన్ తన ప్లేస్‌ను కాపాడుకున్నాడు.

55
రిషబ్ పంత్ కెరీర్‌లో గోల్డెన్ 50.. పసికూన గట్టి పోటీ ఇస్తుందా?

ఈ మ్యాచ్ భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు చాలా స్పెషల్. ఎందుకంటే అతడి కెరీర్‌లో ఇది 50వ టెస్టు మ్యాచ్. భారత క్రికెట్ చరిత్రలో వికెట్ కీపర్లుగా ఎంఎస్ ధోని (90), సయ్యద్ కిర్మాణి (88) మాత్రమే పంత్ కంటే ఎక్కువ టెస్టులు ఆడారు. భయంకరమైన కార్ యాక్సిడెంట్ తర్వాత కోలుకుని, మళ్లీ టెస్టుల్లో పట్టు సాధిస్తున్న పంత్ ఈ మైలురాయి మ్యాచ్‌లో సెంచరీతో మెరవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరోవైపు టెస్టుల్లో పసికూనగా కనిపించే ఆఫ్ఘనిస్థాన్ కు భారత్‌తో ఇది రెండో టెస్ట్ మాత్రమే. వారి మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ లేకపోవడం మైనస్ అయినప్పటికీ.. గుర్బాజ్, అటల్, కెప్టెన్ షాహిది వంటి టీ20 హీరోలతో టీమిండియాను సర్‌ప్రైజ్ చేయాలని ఆఫ్ఘనిస్థాన్ చూస్తోంది. నల్లమట్టితో చేసిన చండీగఢ్ పిచ్‌పై భారత ప్లేయర్లు మొదటి ఇన్నింగ్స్‌లోనే భారీ స్కోరు బోర్డుపై పెట్టి మ్యాచ్‌ను చేతుల్లోకి తీసుకోవాలని పక్కా ప్లాన్‌తో ఉన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories