Vaibhav Sooryavanshi : లక్నోపై 93 పరుగులతో చెలరేగిన రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. తన వైరల్ 'A' సింబల్ సెలబ్రేషన్ వెనుక ఉన్న అసలు సీక్రెట్, ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ గా మారాయి.
ఆ సింబల్ వెనుక ఉన్నది ఎవరో చెప్పేసిన వైభవ్.. షాక్ అవుతున్న అభిమానులు
ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ దుమ్మురేపుతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఆడిన ఇన్నింగ్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. లక్నో నిర్దేశించిన 221 పరుగుల భారీ టార్గెట్‌ను రాజస్థాన్ రాయల్స్ టీమ్ మరో ఓవర్ మిగిలి ఉండగానే అందుకుంది అంటే దానికి మెయిన్ రీజన్ ఈ కుర్రాడి విధ్వంసమే.
గ్రౌండ్‌లో ఫోర్లు, సిక్సర్లతో లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 38 బంతుల్లోనే 7 ఫోర్లు, ఏకంగా 10 సిక్సర్లతో 93 పరుగులు చేసి ఆర్ఆర్ టీమ్‌కు సాలిడ్ విక్టరీని అందించాడు. దీంతో రాజస్థాన్ 19.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను ఫినిష్ చేసింది.
25
Vaibhav Sooryavanshi
ఈ మ్యాచ్‌లో వైభవ్ బ్యాటింగ్ చూస్తుంటే పక్కా ప్లానింగ్‌తో వచ్చినట్టు కనిపించాడు. కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను టచ్ చేసిన ఈ వండర్ కిడ్.. ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. అయితే మోహ్‌సిన్ ఖాన్ వేసిన 13వ ఓవర్లో ఒక ఆసక్తికర డ్రామా జరిగింది. ఓవర్ ఫస్ట్ బాల్‌కే వైభవ్ రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న వైభవ్ రన్ కోసం ట్రై చేయగా.. బౌలర్ మోహ్‌సిన్ ఖాన్ వికెట్లను సరిగ్గా హిట్ చేయలేకపోయాడు. దాంతో బతికిపోయిన వైభవ్.. అదే ఓవర్ లాస్ట్ బాల్‌కి పెద్ద షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్ అయ్యాడు. కేవలం 7 పరుగుల తేడాతో సెంచరీ మిస్సైనా.. లక్నోకి చేయాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఈ సూపర్ ఇన్నింగ్స్‌తో వైభవ్ ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచి ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు.
35
వైరల్ అయిన A సింబల్ సెలబ్రేషన్ సీక్రెట్ ఏంటి?
హాఫ్ సెంచరీ కంప్లీట్ అవ్వగానే వైభవ్ సూర్యవంశీ తన చేతి వేళ్లతో ‘A’ సింబల్ చూపిస్తూ డిఫరెంట్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. సోషల్ మీడియాలో ఈ పిక్ తెగ వైరల్ అయింది. మ్యాచ్ అయిపోయాక ప్రెజెంటేషన్ లో కామెంటేటర్ మురళీ కార్తిక్ దీని గురించి అడగ్గా.. వైభవ్ మొదట తనదైన స్టైల్లో ఫన్నీగా సమాధానమిచ్చాడు.
"ఏమో సార్.. నాకే తెలియదు! నేను ప్రతి మ్యాచ్‌లో ఏదో ఒక కొత్త స్టైల్ ట్రై చేస్తాను. ముందేం ప్లాన్ చేసుకోను, దీని వెనుక పెద్దగా అర్థం కూడా లేదు" అంటూ నవ్వేశాడు. కానీ ఆ తర్వాత అసలు గుట్టు విప్పాడు. ఈ క్రేజీ ఇన్నింగ్స్‌ను తన తల్లికి అంకితం ఇస్తున్నానని, ఆమె పేరు 'A' అక్షరంతో స్టార్ట్ అవుతుందని, అందుకే ఆ సింబల్ చూపించానని చెప్పి అందరి మనసులు గెలుచుకున్నాడు.
ఈ సీజన్‌లో మూడోసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ గెలుచుకున్నా వైభవ్ తలకెక్కించుకోవడం లేదు. ఎంతో మెచ్యూర్డ్‌గా మాట్లాడుతూ.. "మా బౌలింగ్ టైమ్‌లోనే డగౌట్‌లో కూర్చుని పిచ్‌ను క్లియర్ గా అబ్జర్వ్ చేశాను. వికెట్ బ్యాటింగ్‌కు బాగా హెల్ప్ అవుతుందని అర్థమైంది. అందుకే స్టార్టింగ్‌లోనే అనవసరంగా తొందరపడకుండా, కొంచెం టైమ్ తీసుకుని క్రీజులో నిలబడాలి అనుకున్నాను. నేను ఎక్కువ సేపు ఉంటే అవతలి బ్యాటర్‌కు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. నాపై వచ్చే పొగడ్తలను నేను అస్సలు పట్టించుకోను. అసలు న్యూస్ పేపర్లే చదవను. ఇది కేవలం నా కెరీర్ బిగినింగ్ మాత్రమే. లాంగ్ రన్ ఆడడమే నా టార్గెట్" అని క్లారిటీ ఇచ్చాడు.
55
ప్లే ఆఫ్స్ రేసులో రాజస్థాన్ రాయల్స్ దూకుడు
ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ టీమ్ మైండ్ సెట్ చాలా సింపుల్‌గా ఉందని వైభవ్ తెలిపాడు. ఎలాంటి ప్రెజర్ తీసుకోకుండా ప్రతీ మ్యాచ్‌ను ఎంజాయ్ చేయడమే తమ ప్లాన్ అని చెప్పాడు. టోర్నీలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశామని, కానీ చివరి మ్యాచ్‌లో కూడా ఇదే జోష్ కంటిన్యూ చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
కాగా, లక్నోపై గెలుపుతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో నాల్గో స్థానానికి దూసుకెళ్లింది. ముంబై ఇండియన్స్‌తో జరగబోయే నెక్స్ట్ మ్యాచ్‌లో గెలిస్తే ఆర్ఆర్ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం అవుతుంది. ఆల్రెడీ ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్స్ ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యాయి.