IPL 2026: ఈ సీజన్ తర్వాత ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్న ఆ ఐదుగురు స్టార్ ప్లేయర్స్ వీరే !

Published : May 19, 2026, 02:19 PM IST

IPL 2026: ఐపీఎల్ 2026 తుదిదశకు చేరుకుంది. అయితే, ఈ సీజన్ తర్వాత పలువురు ప్లేయర్లు మరో సీజన్ లో కనిపించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఐపీఎల్ 2026 తర్వాత ధోనీతో పాటు మరో నలుగురు స్టార్ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉంది.

PREV
16
ఇక చాలు బాసూ.. ఈ ఐపీఎల్ సీజనే లాస్ట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ సూపర్ ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది. గ్రూప్ స్టేజ్ మ్యాచులు చివరి దశకు వచ్చేశాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే ప్లేఆఫ్స్‌లో తన సీటును కన్ఫర్మ్ చేసుకుంది. అలాగే, హైదరాబాద్, గుజరాత్ జట్లు కూడా టాప్ 4కు అర్హత సాధించాయి. మిగిలిన ఒక్క ప్లేస్ కోసం 5 టీమ్స్ మధ్య గట్టి ఫైట్ నడుస్తోంది.

 అయితే, ఐపీఎల్ 2026లో ఆడుతున్న కొందరు స్టార్ ప్లేయర్స్ వయసు, ఫిట్ నెస్ కారణాలతో వచ్చే ఏడాది గ్రౌండ్‌లోకి దిగే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది. ఈ లిస్టులో ఫస్ట్ పేరు వినగానే కోట్ల మంది అభిమానుల హార్ట్ బ్రేక్ అయిపోవడం ఖాయం. అవును, ఆ పేరు మరెవరో కాదు.. చెన్నై సూపర్ కింగ్స్ థాలా మహేంద్ర సింగ్ ధోనీ. ధోని తో పాటు మరో నలుగురు స్టార్ ప్లేయర్లు కూడా ఈ లిస్టులో ఉన్నారు.

26
1. మహేంద్ర సింగ్ ధోనీ

కోట్లాది మంది గుండె చప్పుడు ఎంఎస్ ధోనీ పేరే ఈ లిస్టులో ముందువరుసలో ఉంది. థాలా కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ సీజన్‌లో ధోనీ సీఎస్‌కే టీమ్‌లో ఉన్నప్పటికీ, మోకాలి గాయం వల్ల ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 44 ఏళ్ల ధోనీ ఈ సీజన్ తర్వాత ఐపీఎల్ నుండి రిటైర్ అవ్వడం దాదాపు కన్ఫర్మ్ అని తెలుస్తోంది.

36
2. అజింక్య రహానే

ఈ లిస్టులో సెకండ్ ప్లేస్‌లో ఉన్నది సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే. 37 ఏళ్ల ఈ స్టార్ ప్లేయర్‌కు ఈ సీజన్ అస్సలు కలిసి రాలేదు. కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రహానే, బ్యాటింగ్‌లో ఘోరంగా ఫెయిల్ అవుతున్నాడు.

ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచుల్లో కేవలం 22.82 యావరేజ్‌తో 251 రన్స్ మాత్రమే చేశాడు. అతని పూర్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే వచ్చే ఏడాది కేకేఆర్ అతన్ని రిటెన్ చేసుకునే ఛాన్స్ అస్సలు లేదు. అందుకే రహానే కూడా ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

46
3. ఇషాంత్ శర్మ

భారత్ తరఫున టెస్ట్ క్రికెట్‌లో 311 వికెట్లు తీసిన ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ఈ లిస్టులో మూడో ప్లేస్‌లో ఉన్నాడు. ఇషాంత్ శర్మ ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ టీమ్‌లో ఉన్నాడు. కానీ అతనికి ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. గుజరాత్ ఫ్రాంచైజీ ఇప్పుడు యంగ్ ప్లేయర్స్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తోంది. దాంతో 37 ఏళ్ల ఈ స్టార్ బౌలర్ ఐపీఎల్ కెరీర్‌కు ఇక ఫుల్ స్టాప్ పడినట్లే అని క్రికెట్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది.

56
4. ట్రెంట్ బౌల్ట్

రిటైర్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉన్న ప్లేయర్స్ లిస్టులో నాలుగో పేరు న్యూజిలాండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌. ఒకప్పుడు బౌల్ట్ స్పీడ్, స్వింగ్ చూసి వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్ కూడా భయపడేవాళ్లు. కానీ గత రెండేళ్లుగా బౌల్ట్ మునుపటిలా వికెట్లు తీయలేకపోతున్నాడు. 

ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ టీమ్ తరఫున ఆడిన బౌల్ట్ పర్ఫార్మెన్స్ చాలా డిజప్పాయింట్ చేసింది. దాంతో అతన్ని టీమ్ నుండి డ్రాప్ కూడా చేశారు. దీన్ని బట్టి 2026 తర్వాత ట్రెంట్ బౌల్ట్ ఐపీఎల్ కెరీర్ ఎండ్ అయిపోయినట్లే అనిపిస్తోంది.

66
5. సునీల్ నరైన్

ఈ లిస్టులో అందరినీ షాక్‌కు గురిచేసే పేరు వెస్టిండీస్ లెజెండరీ టీ20 స్పిన్నర్ సునీల్ నరైన్‌ది. ఈ సీజన్‌లోనే నరైన్ ఐపీఎల్‌లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. అంతేకాదు ఐపీఎల్‌లో 200 మ్యాచులు ఆడిన ఫస్ట్ ఓవర్సీస్ ప్లేయర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. 

37 ఏళ్ల వయసులో కూడా నరైన్ తన స్పిన్ మ్యాజిక్‌తో అదరగొడుతున్నాడు. కానీ, ఈ సీజన్ సక్సెస్‌తోనే ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పాలని నరైన్ ఫిక్స్ అయినట్లు సమాచారం. అందుకే ఈ సీజన్ తర్వాత నరైన్ కూడా ఐపీఎల్ నుండి తప్పుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories