Vaibhav Sooryavanshi Brand Value : ఐపీఎల్ 2026 సెన్సేషన్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ భారీగా పెరిగింది. ఒక్కో ఎండార్స్‌మెంట్ డీల్ కోసం ఈ యంగ్ స్టార్ ఏకంగా రూ. 1.5 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నాడు.
వైభవ్ సూర్యవంశీ ఖాతాలో కోట్లు.. ఐపీఎల్ హిట్ తర్వాత క్యూ కడుతున్న టాప్ బ్రాండ్స్
ఐపీఎల్ 2026 సీజన్‌లో తన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను షేక్ చేసిన 15 ఏళ్ల యంగ్ వండర్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు మైదానం వెలుపల కూడా కాసుల వర్షం కురిపిస్తున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే టీమిండియా ఫ్యూచర్ స్టార్ గా మారిన వైభవ్ బ్రాండ్ వాల్యూ ఊహించని రేంజ్‌లో పెరిగిపోయింది.
ఐపీఎల్ ముగిసిన తర్వాత ఈ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ క్రేజ్ ఏకంగా డబుల్ అయింది. ఇప్పుడు మార్కెట్‌లో ఒక్కో యాడ్ లేదా ఎండార్స్‌మెంట్ డీల్ కోసం వైభవ్ ఏకంగా రూ. 1.5 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.
25
ఐపీఎల్‌లో పరుగుల విధ్వంసం
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. ఈ సీజన్‌లో ఆడిన 16 మ్యాచ్‌ల్లో ఏకంగా 776 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దాంతో పాటు మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అవార్డుతో పాటు ఆరెంజ్ క్యాప్‌ను కూడా సొంతం చేసుకున్నాడు.
ఈ సీజన్‌లో 237.30 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన వైభవ్, ఒకే ఎడిషన్‌లో 72 సిక్సర్లు కొట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఈ పవర్‌ప్యాక్ పర్‌ఫార్మెన్స్‌తో క్రికెట్ లవర్స్ తో పాటు బ్రాండ్ మార్కెట్ కూడా వైభవ్ వైపు చూస్తోంది.
35
డబుల్ అయిన బ్రాండ్ వాల్యూ
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కావడానికి ముందు వైభవ్ సూర్యవంశీ రేట్ చాలా తక్కువగా ఉండేది. అప్పట్లో కాంప్లాన్, రెడ్ బుల్, గూగుల్ పే వంటి బ్రాండ్స్‌తో దాదాపు రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు ఒప్పందాలు చేసుకున్నాడు. కానీ ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన తర్వాత, అతని డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది.
ఇప్పుడు స్పోర్ట్స్ డ్రింక్స్, క్రికెట్ కిట్స్, న్యూట్రిషన్, ఫుట్ వేర్ వంటి కేటగిరీలకు చెందిన టాప్ బ్రాండ్స్ వైభవ్‌ను సైన్ చేయడానికి చెక్ బుక్కులతో క్యూ కడుతున్నాయి. ప్రస్తుత మార్కెట్ అంచనాల ప్రకారం అతని ఫీజు రూ. 1.5 కోట్లకు పైగా పెరిగినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ టీమ్‌తో రూ. 1.10 కోట్ల వార్షిక కాంట్రాక్ట్‌లో ఉన్నాడు. 2025 వేలంలో రాజస్థాన్ అతన్ని ఈ ధరకు సొంతం చేసుకుంది. అయితే ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఆటగాడి శాలరీని వెంటనే పెంచే అవకాశం లేదు. కాబట్టి ఐపీఎల్ నుంచి వచ్చే ఆదాయం కంటే బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా వైభవ్ సంపాదించే అమౌంట్ చాలా ఎక్కువగా ఉండబోతోంది.
ఐపీఎల్ సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్‌గా నిలిచిన వైభవ్ ఒక టాటా సియెర్రా కారును కూడా గెలుచుకున్నాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే.. వైభవ్‌కు ఇంకా 15 ఏళ్లే కావడంతో, 18 ఏళ్లు నిండి లైసెన్స్ వచ్చే వరకు అతను ఆ కారును డ్రైవ్ చేయలేడు.
55
షార్ట్ టర్మ్ కాంట్రాక్టులకే మొగ్గు
సాధారణంగా పెద్ద క్రికెటర్లతో కంపెనీలు 3 నుంచి 5 ఏళ్ల లాంగ్ టర్మ్ కాంట్రాక్టులు చేసుకుంటాయి. కానీ వైభవ్ విషయంలో బ్రాండ్స్ కొత్త స్ట్రాటజీని ఫాలో అవుతున్నాయి. కేవలం 2 నుంచి 3 ఏళ్ల షార్ట్ టర్మ్ డీల్స్ మాత్రమే కుదుర్చుకుంటున్నాయి. దీనివల్ల ఆటగాడి ఫామ్‌ను బట్టి కాంట్రాక్ట్‌ను రిన్యూ చేయాలా వద్దా అనే ఫ్లెక్సిబిలిటీ కంపెనీలకు ఉంటుంది.
వైభవ్ వయసు ఇంకా చాలా తక్కువ కావడం, భవిష్యత్తులో లాంగ్ కెరీర్ ఉండటంతో ఫస్ట్-మూవర్ అడ్వాంటేజ్ కోసం కంపెనీలు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్ వంటి సీనియర్ ప్లేయర్స్ ఈ ఐపీఎల్‌లో అంతగా రాణించకపోవడంతో, బ్రాండ్ మార్కెట్ వైభవ్ లాంటి యంగ్ స్టార్స్ వైపు షిఫ్ట్ అవుతోంది.
ఇంత చిన్న వయసులో వస్తున్న క్రేజ్, కమర్షియల్ డీల్స్‌ను వైభవ్ సూర్యవంశీ తల్లిదండ్రులు దగ్గరుండి చూసుకుంటున్నారు. వారికి రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కూడా పూర్తి సపోర్ట్ అందిస్తోంది. వైభవ్ క్రికెట్ కెరీర్‌కు ఎలాంటి ఆటంకం కలగకుండా, వయసుకు తగిన బ్రాండ్స్‌ను మాత్రమే ఎంచుకునేలా ప్లాన్ చేస్తున్నారు.