టీమిండియానా..? ఫేవరేట్సా..? నాన్సెన్స్.. అంత సీన్ లేదు.. మైఖేల్ వాన్ షాకింగ్ కామెంట్స్

Published : Nov 16, 2022, 03:12 PM IST

టీ20 ప్రపంచకప్ లో సెమీస్ గండాన్ని దాటలేకపోయిన టీమిండియాపై ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖేల్ వాన్ తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నాడు. టీమిండియాకు ఫేవరేట్స్ అనేంత సీన్ లేదని  వ్యాఖ్యానించాడు.   

PREV
16
టీమిండియానా..? ఫేవరేట్సా..? నాన్సెన్స్.. అంత సీన్ లేదు.. మైఖేల్ వాన్ షాకింగ్ కామెంట్స్

ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ లో సెమీస్ లో నిష్క్రమించిన టీమిండియాపై ఇంగ్లాండ్ మాజీ సారథి  మైఖేల్ వాన్ మరోసారి అవాకులు చెవాకులు  పేలాడు. టీమిండియాకు  ఫేవరేట్స్ అనే మాట వాడటం సరికాదని.. వాళ్లకు అంత సీన్ లేదని  వాన్ అభిప్రాయపడ్డాడు. 

26

డైలీ టెలిగ్రాఫ్ కు రాసిన ఓ కాలమ్ లో వాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.   వచ్చే వన్డే ప్రపంచకప్ లో టీమిండియా ఫేవరేట్స్ కానే కాదని.. టీ20 ప్రపంచకప్ లో భారత్ కు షాకిచ్చినట్టే.. వన్డే ప్రపంచకప్ లో కూడా ఇంగ్లాండ్ జట్టు భారత్ ను చిత్తుగా ఓడిస్తుందని వ్యాఖ్యానించాడు.  

36

వాన్ మాట్లాడుతూ... ‘టీ20 ప్రపంచకప్ ముగిసింది. ఇక వచ్చే ఏడాది  వన్డే ప్రపంచకప్  సాధించడమే ఇంగ్లాండ్ లక్ష్యం.   ఇంగ్లాండ్ కు మంచి స్పిన్ ఆప్షన్స్ ఉన్నాయి. దీంతో ప్రత్యర్థులను దెబ్బకొట్టొచ్చు.  ఎందుకంటే  వచ్చేవన్డే ప్రపంచకప్ ఇండియాలో జరుగనుంది. 

46

ప్రపంచకప్ ప్రారంభం కాగానే అందరూ టీమిండియాను ఫేవరెట్లుగా భావిస్తారు. నాన్సెన్స్. ఆ జట్టుకు అంత సీన్  లేదు. టీ20 ప్రపంచకప్ లో ఓడించిన మాదిరిగానే వన్డే వరల్డ్ కప్ లో  కూడా భారత్ ను ఓడిస్తాం. అప్పుడే కాదు మరికొన్నాళ్లూ జరిగేది అదే.

56

పరిమిత ఓవర్ల క్రికెట్ లో  ఇంగ్లాండ్ జట్టు చాలా పటిష్టంగా ఉంది.   ఈ ఫార్మాట్ లో ఇంగ్లాండ్ అనుసరిస్తున్న వైఖరిని ఇతర జట్లు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. ఒకవేళ  నేనే గనక బీసీసీఐలో ఉంటే మాత్రం అహంకారాన్ని వదిలేసి, ఇంగ్లాండ్ అనుసరిస్తున్న విధానాన్ని ఫాలో అవుతాన’ని తెలిపాడు.  

66

వాన్ కామెంట్స్ పై  టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ప్రపంచకప్  టోర్నీ గెలవగానే  వాన్ కు  అహంకారం తలకెక్కిందని,   ఏదో ఒక్క కప్ గెలిచినంత మాత్రానా క్రికెట్ ను శాసిస్తున్నజట్టుగా ఫీల్ అవుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ ను తక్కువ అంచనా వేస్తే ఏమవుతుందో వాన్ కు గతంలో అనుభవమే అని.. దానిని గుర్తుంచుకుని మాట్లాడాలని  సూచిస్తున్నారు. 

click me!

Recommended Stories