మిగిలిందెంత..? వేలంలో వెచ్చించేదెంత..? ఫ్రాంచైజీ పర్సులలో ఉన్న డబ్బులివే..

Published : Nov 16, 2022, 01:58 PM IST

ఐపీఎల్ -  2023 మినీ వేలం  కోసం పది ఫ్రాంచైజీలు నిన్న తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్లు,  వేలానికి వదిలేసేవారి జాబితాను విడుదల చేశాయి.  రిటైన్ చేసుకున్న ఆటగాళ్లకు పోను ఆయా ఫ్రాంచైజీలలో మిగిలిన డబ్బులెంతో  తెలుసుకుందాం.   

PREV
111
మిగిలిందెంత..? వేలంలో వెచ్చించేదెంత..? ఫ్రాంచైజీ పర్సులలో ఉన్న డబ్బులివే..

ఐపీఎల్ మినీ వేలం  వచ్చే నెల 23న కొచ్చిలో జరగాల్సి ఉంది. ఈ  మేరకు పది ఫ్రాంచైజీలు  తాము రిటైన్ చేసుకున్న, వేలంలో వదిలేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి.  ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత   పది ఫ్రాంచైజీల వద్ద కొంత నగదు నిల్వలోకి వచ్చింది. ఆ వివరాలు ఇవిగో.. 

211

సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి 16 మంది (వీరిలో నలుగురు ఓవర్సీస్ ప్లేయర్స్) ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. వీరికి పోను   హైదరాబాద్ పర్స్ లో ఉన్న  నగదు రూ. 42.25 కోట్లు.   వేలంలో 13 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ 13లో నలుగురు విదేశీ ఆటగాళ్లకూ ఛాన్స్ ఉంది. 
 

311

ముంబై ఇండియన్స్  21 మంది (ఐదుగురు ఓవర్సీస్)ని రిటైన్ చేసుకుంది. వేలంలో 12 మంది  (ముగ్గురు ఓవర్సీస్)  ఆటగాళ్లను వేలంలో దక్కించుకోవచ్చు. ముంబై  పర్స్ వాల్యూ : రూ 20.55 కోట్లు 
 

411

చెన్నై సూపర్ కింగ్స్  24 మందిని రిటైన్ చేసుకుంది.  వీరిలో ఆరుగురు విదేశీ ఆటగాళ్లు.  వేలంలో 9 మంది (ఇద్దరు విదేశీ)ఆటగాళ్లను వేలంలో దక్కించుకోవచ్చు. సీఎస్కేవద్ద పర్స్ లో రూ. 20.45 కోట్లు మిగిలున్నాయి.

511

ఢిల్లీ క్యాపిటల్స్ 26 మంది (ఆరుగురు విదేశీ) ఆటగాళ్లను తమతోనే ఉంచుకుంది. వేలంలో మరో ఏడుగురిని దక్కించుకునేందుకు రూ. 19.55 కోట్లు మిగిలున్నాయి. 

611

గుజరాత్ టైటాన్స్  23 మంది ఆటగాళ్ల (ఐదుగురు విదేశీ)ను తమతోనే ఉంచుకుంది. మరో పది మందిని వేలంలో దక్కించుకునే అవకాశముంది. ఇందుకు గాను గుజరాత్ పర్స్ లో రూ. 19.25 కోట్లున్నాయి. 
 

711

కోల్కతా నైట్ రైడర్స్ 19 మంది (ఐదుగురు విదేశీ) ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది.  వేలంల 14 మందిని దక్కించుకునే ఛాన్స్ ఉంది.   ఇందుకోసం కేకేఆర్ పర్స్ లో  రూ. 23.35 కోట్లున్నాయి. 

811

కోల్కతా నైట్ రైడర్స్ 19 మంది (ఐదుగురు విదేశీ) ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది.  వేలంల 14 మందిని దక్కించుకునే ఛాన్స్ ఉంది.   ఇందుకోసం కేకేఆర్ పర్స్ లో  రూ. 23.35 కోట్లున్నాయి. 

911

పంజాబ్ కింగ్స్ 21 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది.  ఇందులో ఐదుగురు విదేశీ ఆటగాళ్లున్నారు. వేలంలో 12 మందిని కొనుగోలు  చేసుకోవచ్చు. ఇందుకు గాను  పంజాబ్ వద్ద  రూ. 32.2 కోట్లు ఉన్నాయి. 

1011

రాజస్తాన్ రాయల్స్  20 ఆటగాళ్ల (నలుగురు విదేశీయులు)ను రిటైన్ చేసుకుంది. వేలంలో 13మందిని దక్కించుకునే అవకాశముంది. ఇందుకు గాను రూ. 13.2 కోట్లు పర్స్ లో ఉన్నాయి.

1111

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 మంది (నలుగురు విదేశీ ఆటగాళ్లు)ని  రిటైన్ చేసుకుంది. వీరికి పోను  మరో 13  మందిని వేలంలో కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం రూ 8.75 కోట్లు పర్స్ లో ఉన్నాయి. 

click me!

Recommended Stories