ఉన్న ఒక్కడినీ వదిలేసి, రిటైర్ అయ్యేలా చేశారు... పోలార్డ్ పోయాక, ఇక ముంబై ఇండియన్స్‌ని కాపాడేదెవరు...

First Published Nov 16, 2022, 2:00 PM IST

ఐపీఎల్‌లో ఫైవ్ టైం టైటిల్ విన్నర్ ముంబై ఇండియన్స్.. 8 సీజన్ల గ్యాప్‌లో 5 టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్, గత రెండు సీజన్లలో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఐపీఎల్ 2021 సీజన్‌లో నెట్ రన్ రేట్ తక్కువగా ఉండడంతో ప్లేఆఫ్స్ చేరలేకపోయిన ముంబై ఇండియన్స్, 2022 సీజన్‌లో ఘోరమైన ప్రదర్శన ఇచ్చింది...

Jasprit Bumrah and Pollard

ఐపీఎల్ 2022 సీజన్‌లో 14 మ్యాచులు ఆడిన ముంబై ఇండియన్స్, 4 మ్యాచుల్లో గెలిచి 10 పరాజయాలను చవి చూసింది. ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా మొదటి 8 మ్యాచుల్లో విజయాన్ని అందుకోలేకపోయిన రోహిత్ సేన, చివరి 6 మ్యాచుల్లో 4 విజయాలు అందుకోని పరువు నిలబెట్టుకోగలిగింది...

Image credit: Mumbai Indians

ఈ సీజన్ ఎఫెక్ట్‌తో ఆల్‌రౌండర్ కిరన్ పోలార్డ్‌ని 2023 మినీ వేలానికి విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది ముంబై ఇండియన్స్. 2010 నుంచి ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న కిరన్ పోలార్డ్, 13 సీజన్లలో 189 మ్యాచులు ఆడాడు. ఒకే ఫ్రాంఛైజీ తరుపున 150కి పైగా మ్యాచులు ఆడిన రెండో ప్లేయర్ కిరన్ పోలార్డ్... (ఆర్‌సీబీ తరుపున విరాట్ కోహ్లీ)

Image credit: Mumbai Indians

బ్యాటుతో 3412 పరుగులు చేసిన కిరన్ పోలార్డ్, బాల్‌తో 69 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచుల్లో ముంబై ఇండియన్స్‌కి మ్యాచ్ విన్నర్‌గా ఉన్నాడు పోలార్డ్. ముంబై ఇండియన్స్ తరుపున ప్లేఆఫ్స్‌లో 170 స్ట్రైయిక్ రేటుతో 341 పరుగులు చేసిన కిరన్ పోలార్డ్, 3 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచాడు...

Kieron Pollard

జట్టులో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, ఇషాన్ కిషన్ వంటి ప్లేయర్లు ఉన్నా వీళ్లు కీలక మ్యాచుల్లో సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేదు. కీలక మ్యాచుల్లో అదరగొట్టే ఒకే ఒక్కడినీ వేలానికి విడుదల చేయాలని నిర్ణయం తీసుకోవడం... వేరే ఫ్రాంఛైజీ తరుపున ఆడడం లేదని కిరన్ పోలార్డ్ ఐపీఎల్ రిటైర్మెంట్ ప్రకటించడం వెంటవెంటనే జరిగిపోయాయి...

Kieron Pollard

రిటైర్మెంట్ తీసుకోగానే, పోలార్డ్‌ని బ్యాటింగ్ కోచ్‌గా నియమస్తూ నిర్ణయం తీసుకుంది ముంబై ఇండియన్స్. నాటకీయ పరిణామాల మధ్య కిరన్ పోలార్డ్, తిరిగి ముంబై ఇండియన్స్ జట్టులోకే వచ్చినా... ఇప్పుడు ఆ జట్టును ఆదుకునేది ఎవరు? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

2021 సీజన్ వరకూ హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా వంటి ప్లేయర్లు బాధ్యత తీసుకుని ఆడేవాళ్లు. ఇప్పుడు పాండ్యా బ్రదర్స్ కూడా ముంబై జట్టులో లేరు... క్వింటన్ డి కాక్, ట్రెంట్ బౌల్ట్ వేరే జట్ల తరుపున ఆడుతున్నారు... రూ.8 కోట్లు పెట్టి కొన్న జోఫ్రా ఆర్చర్ వస్తాడో రాడో కూడా తెలీదు...

నాథన్ కౌంటర్ నైల్, జేమ్స్ నీశమ్, మిచెల్‌ మెక్‌లగాన్, క్రిస్ లీన్ వంటి మ్యాచ్ విన్నర్లు కూడా ముంబై ఇండియన్స్ తుది జట్టులో చోటు దక్కించుకోవడానికి కష్టపడేవాళ్లు. అలాంటి టీమ్ ఇప్పుడు ప్లేయర్ల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితిలో పడింది... ఉన్న ఒక్కడినీ ఇలా వదిలేసి, ముంబై ఇండియన్స్ తప్పుచేసిందనే అంటున్నారు ఫ్యాన్స్...

అసలే కష్టల్లో ఉన్న జట్టు, కిరన్ పోలార్డ్‌ని విడుదల చేసి మరిన్ని కష్టాలను కొని తెచ్చుకుందని అంటున్నారు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్.. రోహిత్ శర్మ కూడా ఫామ్‌లో లేకపోవడం, బుమ్రా గాయాలతో సతమతమవుతుండడంతో ఈసారి ముంబై జట్టు ఏం చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు...
 

click me!