రిషబ్ పంత్ పెద్ద మనసు... ఉత్తరాఖండ్ బాధితుల సహాయార్థం విరాళంగా మ్యాచ్ ఫీజు...

First Published Feb 8, 2021, 12:23 PM IST

తొలి టెస్టులో అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టిన రిషబ్ పంత్, మంచి మనసు చాటుకున్నాడు. ఉత్తరాఖండ్‌లో ఆదివారం సంభవించిన బాధితుల కోసం తన మ్యాచ్ ఫీజును విరాళంగా ప్రకటించాడు. ఆదివారం జరిగిన ఈ ప్రకృతి ప్రళయంలో ఇప్పటికే 14 మంది ప్రాణాలు కోల్పోగా 170 మందికి పైగా గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సంఘటనపై స్పందించిన రిషబ్ పంత్, తన మ్యాచ్ ఫీజును విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటిస్తూ ట్వీట్ చేశాడు.

‘ఉత్తరాఖండ్ ప్రమాదం గురించి దిగ్భ్రాంతి చెందాను. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలను ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా... వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యల్లో పాల్గొంటున్నవారికి ధన్యవాదాలు... బాధితుల సహాయార్థం నా వంతుగా మ్యాచ్ ఫీజును విరాళంగా ఇవ్వాలని అనుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశాడు యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్.
undefined
రిషబ్ పంత్‌తో పాటు ఉత్తరాఖండ్ ఘటనపై కొందరు క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘ఉత్తరాఖండ్‌లో వరద బాధితులు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నా. మీరు వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుని ఉంటే వెంటనే సాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయండి...’ అంటూ ఫోన్ నెంబర్లను ట్వీట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్
undefined
‘వరద బాధితుల అందరూ ధైర్యంగా ఉండండి. ఈ ప్రమాదంలో చిక్కుకున్నవారందంరూ క్షేమంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా...’ అంటూ ట్వీట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.
undefined
భారత ఓపెనర్, క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా ఉత్తరాఖండ్ వరదలపై స్పందించాడు... ‘ఉత్తరాఖండ్ జల ప్రళయ బాధుతులు అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా...’ అంటూ ట్వీట్ చేశాడు భారత క్రికెటర్ శిఖర్ ధావన్...
undefined
‘ఉత్తరాఖండ్‌లో జలప్రళయం గురించి తెలిసి ఎంతో బాధేసింది... ఈ ప్రకృతి విపత్తులో చిక్కుకున్న బాధితులందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా...’ అంటూ ట్వీట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్...
undefined
click me!