రిషబ్ పంత్‌తో కలిసి ఆడడం చాలా ఇష్టం... కానీ ఆ ఒక్కటి మార్చుకుంటే మంచిది... ఛతేశ్వర్ పూజారా

First Published Feb 8, 2021, 11:44 AM IST

ఆస్ట్రేలియా టూర్ నుంచి భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆటతీరులో చాలా మార్పు వచ్చింది. ఆసీస్ టూర్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన రిషబ్ పంత్, ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన తొలి టెస్టులోనూ అదిరిపోయే ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 91 పరుగుల వద్ద అవుటై, సెంచరీ మిస్ అయినా ఛతేశ్వర్ పూజారాతో కలిసి రిషబ్ పంత్ నిర్మించిన భాగస్వామ్యం భారత జట్టుకు ఎంతో అమూల్యమైంది.

73 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను ఛతేశ్వర్ పూజారా, రిషబ్ పంత్ కలిసి ఆదుకున్నారు. రిషబ్ పంత్‌తో కలిసి ఐదో వికెట్‌కి 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఛతేశ్వర్ పూజారా... అనుకోని విధంగా అవుటై పెవిలియన్ చేరాడు. 143 బంతుల్లో 11 ఫోర్లతో 73 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా... డామ్ బెస్ బౌలింగ్‌లో షాట్‌కి ప్రయత్నించగా ఫీల్డర్ హెల్మెట్‌కి తాకిన బంతి గాల్లోకి ఎగిరి... రోరీ బర్న్స్ చేతుల్లోకి వెళ్లింది.
undefined
88 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 91 పరుగులు చేసిన రిషబ్ పంత్... సెంచరీ చేరువలో భారీ షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. ఇంగ్లాండ్‌పై 5 సిక్సర్లు బాదిన మొట్టమొదటి భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు రిషబ్ పంత్.
undefined
ఓ వైపు రిషబ్ పంత్ బౌండరీలు, సిక్సర్లతో ప్రత్యర్తి బౌలర్లపై విరుచుకుపడుతుంటే, మరోవైపు ఛతేశ్వర్ పూజారా తనదైన స్టైల్‌లో డిఫెన్స్ ఆడుతూ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. రిషబ్ పంత్ మాస్ ఇన్నింగ్స్‌, పూజారా క్లాస్ ఇన్నింగ్స్ కలిసి ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాయి. దూకుడుకి మారుపేరున నిలిచిన పంత్‌తో కలిసి ఆడడం తనకెంతో ఇష్టమని ప్రకటించాడు ఛతేశ్వర్ పూజారా...
undefined
‘రిషబ్ పంత్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా సరదాగా ఉంటుంది. అతను బ్యాటింగ్ చేస్తుంటే మనకి కూడా షాట్స్ ఆడాలనే ఊపు వస్తుంది. దూకుడుగా ఆడడం రిషబ్ పంత్ స్టైల్. దాన్ని మార్చుకోవాలని చెప్పడ సరి కాదు... అతను డిఫెన్స్ ఆడాల్సిన అవసరం లేదు. తన స్టైల్ మార్చుకుని డిఫెన్స్ ఆడాలని ప్రయత్నిస్తే, రిషబ్ పంత్ త్వరగా అవుట్ అవుతాడు...
undefined
టెస్టుల్లో అయినా షాట్స్ ఆడడం ఏ జట్టుకైనా మంచి చేస్తుంది. కానీ రిషబ్ పంత్‌కి నేను ఒకే ఒక్క సలహా ఇవ్వాలనుకుంటున్నా. ఏ బంతిని షాట్ ఆడాలి, ఏది డిఫెన్స్ ఆడాలనేది తెలుసుకుంటే చాలు... క్రీజులో ఎంత ఎక్కువ సేపు ఉంటే, అన్ని ఎక్కువ పరుగులు చేయొచ్చని తెలుసుకోవాలి... ఎక్కువసేపు ఆడేందుకు ప్రయత్నించి, వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయొచ్చు...
undefined
రిషబ్ పంత్ చాలా బాగా ఆడుతున్నాడు. కానీ కొన్ని తప్పులు చేస్తున్నాడు. ఓ భాగస్వామ్యం విడిపోయిన తర్వాత మరో భాగస్వామ్యాన్ని నిర్మించడం చాలా అవసరం. దానిపైన పంత్ ఫోకస్ చేస్తే అతను స్టార్‌గా మారతాడు. జట్టును మంచి పొజిషన్‌లో నిలబెట్టగలుగుతాడు... ’ అంటూ కామెంట్ చేశాడు ఛతేశ్వర్ పూజారా...
undefined
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 88 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 91 పరుగులు చేసి అవుట్ అయ్యాడు రిషబ్ పంత్. ఇలా 90ల్లో అవుట్ కావడం రిషబ్ పంత్‌కి ఇది నాలుగోసారి... 17 టెస్టుల్లో నాలుగుసార్లు సెంచరీ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు రిషబ్ పంత్...
undefined
సిడ్నీ టెస్టు మ్యాచ్‌లో కూడా దూకుడుగా బ్యాటింగ్ చేసిన రిషబ్ పంత్ 97 పరుగుల వద్ద అవుటైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో కూడా పూజారా, పంత్ కలిసి భారత జట్టును మంచి భాగస్వామ్యాన్ని అందించారు. పూజారా పూర్తి డిఫెన్స్ ఆటతీరు చూపిస్తే, రిషబ్ పంత్ బౌండరీలతో ఆస్ట్రేలియా గుండెల్లో గుబులు రేపాడు...
undefined
రిషబ్ పంత్ ఆట తీరును ప్రశంసల్లో ముంచెత్తాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. ‘రిషబ్ పంత్ చాలా దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను ఆడుతుంటే చూడడం చాలా చక్కగా ఉంటుంది. అయితే ఓ మంచి ఇన్నింగ్స్ నిర్మించిన తర్వాత నిర్లక్ష్యంగా ఆడుతూ వికెట్ పడేసుకుంటున్నాడు పంత్. అతను భయం లేకుండా ఆడడానికి, బాధ్యత లేకుండా ఆడడానికి మధ్య చిన్న తేడా గుర్తించాలి. అది గమనిస్తే రిషబ్ పంత్ ఓ అద్భుతమైన బ్యాట్స్‌మెన్ అవుతాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు సునీల్ గవాస్కర్.
undefined
click me!