ఓవర్‌నైట్ స్కోరు 555/8 వద్ద మూడో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన ఇంగ్లాండ్ జట్టు 578 పరుగులకి ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ తీసి ఇంగ్లాండ్ జట్టును ఆలౌట్ చేశారు. మొత్తంగా అశ్విన్, బుమ్రాలకు మూడేసి వికెట్లు దక్కగా ఇషాంత్, షాబజ్ నదీంలకు రెండేసి వికెట్లు దక్కాయి.

మూడో రోజు మొదటి సెషన్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు... వెంటవెంటనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆస్ట్రేలియా టూర్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ 6 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆర్చర్ బౌలింగ్‌లో బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు రోహిత్ శర్మ. 19 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా.

ఆస్ట్రేలియా టూర్‌లో అద్భుతంగా రాణించిన యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్... దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. 28 బంతుల్లో 5 ఫోర్లతో 29 పరుగులు చేసిన గిల్‌ను కూడా ఆర్చర్ పెవిలియన్ చేర్చాడు. ఆర్చర్ బౌలింగ్‌లో అండర్సన్ ఓ అద్భుతమైన క్యాచ్‌తో శుబ్‌మన్ గిల్‌ను పెవిలియన్ చేర్చారు. 44 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది భారత జట్టు.

48 బంతుల్లో 11 పరుగులు చేసిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ... డామ్ బెస్ బౌలింగ్‌లో ఓల్లీ పోప్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. గత ఏడు టెస్టుల్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేయడం విశేషం... విరాట్ అవుటైన కొద్దిసేపటికే అజింకా రహానే కూడా పెవిలియన్ చేరాడు.

ఆరు బంతుల్లో ఒక్క పరుగు చేసిన అజింకా రహానే... డామ్ బెస్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి, జో రూట్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 73 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన భారత జట్టును రిషబ్ పంత్, ఛతేశ్వర్ పూజారా కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు...

పూజారా, రిషబ్ పంత్ కలిసి ఐదో వికెట్‌కి 119 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ దశలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 143 బంతుల్లో 11 ఫోర్లతో 73 పరుగులు చేసిన పూజారా... డామ్ డెస్ బౌలింగ్‌లో అనుకోని విధంగా అవుట్ అయ్యాడు. పూజారా ఆడిన షాట్, ఫీల్డర్ హెల్మెట్‌కి తాకి గాల్లోకి ఎగరడంతో రోరీ బర్న్స్ క్యాచ్ అందుకున్నాడు...

88 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 91 పరుగులు చేసిన రిషబ్ పంత్... సెంచరీ చేరువలో భారీ షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. ఇంగ్లాండ్‌పై 5 సిక్సర్లు బాదిన మొట్టమొదటి భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు రిషబ్ పంత్. 225 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది టీమిండియా...

ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్ కలిసి వికెట్ పడకుండా బ్యాటింగ్ కొనసాగించారు. వాషింగ్టన్ సుందర్ 68 బంతుల్లో 5 ఫోర్లతో 33 పరుగులు చేయగా రవిచంద్రన్ అశ్విన్ 54 బంతుల్లో 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో టాప్ బెస్‌కి నాలుగు వికెట్లు దక్కగా, ఆర్చర్ 2 వికెట్లు తీశాడు.