ఉస్మాన్ ఖవాజాకి షాక్... వీసా ఆలస్యం కావడంతో ఇండియా ఫ్లైట్ ఎక్కని ఆసీస్ ఓపెనర్..

First Published Feb 1, 2023, 11:20 AM IST

ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాకి భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభమయ్యే బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు, ఇండియాకి బయలుదేరింది. అయితే టెస్టు సిరీస్‌కి ఎంపికైన ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా మాత్రం ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉండిపోయాడు...

ఉస్మాన్ ఖవాజాకి ఇండియన్ వీసా రావడం ఆలస్యం కావడంతో అతను ఆస్ట్రేలియా టీమ్‌తో కలిసి ఇండియాకి రాలేకపోయాడు. ప్యాట్ కమ్మిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు, ఇప్పటికే భారత్‌కి బయలుదేరింది. ఉస్మాన్ ఖవాజా, గురవారం లేదా శుక్రవారం లోగా ఇండియాకి వచ్చే అవకాశాలు ఉన్నాయి...

Usman Khawaja

పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 165.33 సగటుతో 496 పరుగులు చేసిన ఉస్మాన్ ఖవాజా, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలిచాడు. పాక్‌లో పుట్టిన ఉస్మాన్ ఖవాజా, స్పిన్‌కి సహకరించే ఉపఖండ పిచ్‌లపై అద్భుతంగా రాణించగలనని నిరూపించుకున్నాడు...

సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో 4 వేల పరుగుల మైలురాయిన అందుకున్న ఉస్మాన్ ఖవాజా, మూడో టెస్టులో 195 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ అందుకునే ఘనతను మిస్ చేసుకున్నాడు ఉస్మాన్ ఖవాజా...
 

ఆఖరి నాలుగు టెస్టుల్లో 3 సెంచరీలు చేసిన ఉస్మాన్ ఖవాజా, బీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడు. వీసా రావడం ఆలస్యం కావడంతో ఇండియా ఫ్లైట్ మిస్ అయిన ఉస్మాన్ ఖవాజా... గార్డెన్ కూర్చీ మీద దిగులుగా కూర్చున్న ఓ వ్యక్తి పాపులర్ మీమ్‌ని పోస్ట్ చేసి.. ‘నేను, నా ఇండియా వీసా కోసం ఇలాగే ఎదురుచూస్తున్నా... నన్ను వదిలేయకండి’ అంటూ కాప్షన్ జోడించాడు...
 

ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, డేవిడ్ వార్నర్‌ల కంటే ఎక్కువగా భారత బౌలర్లను ఉస్మాన్ ఖవాజా ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఉస్మాన్ ఖవాజాకి భారత స్పిన్ పిచ్‌లపై ఎలా ఆడాలో బాగా తెలుసు..

కొన్ని రోజుల క్రితం క్రికెట్ ఆస్ట్రేలియాలో జాతివివక్షపై సంచలన వ్యాఖ్యలు చేశాడు ఉస్మాన్ ఖవాజా. ‘క్రికెట్ ఆస్ట్రేలియాలో కనిపించకుండా పక్షపాతం, వివక్ష ఉన్నాయి. క్రికెట్ టీమ్‌లోకి వచ్చాక తెల్ల క్రికెటర్, నల్ల (బ్రౌన్)క్రికెటర్ ఇద్దరూ ఒకటే. అయితే వైట్ కోచ్, వైట్ క్రికెటర్లకే మొదటి ప్రాధాన్యం ఇస్తాడు...అలాగే తెల్ల సెలక్టర్లు, తెల్ల తోలు క్రికెటర్లనే సెలక్ట్ చేస్తారు. ఎందుకంటే వారి బిడ్డలు ఇలా తెల్లగానే కనిపిస్తారు కాబట్టి....’ అంటూ ఉస్మాన్ ఖవాజా చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం క్రియేట్ చేశాయి.. 

click me!