గాయం నుంచి కోలుకోని శ్రేయాస్ అయ్యర్! తొలి టెస్టులో సూర్యకుమార్ యాదవ్... పెద్ద ప్లానింగే ఇది!

First Published Feb 1, 2023, 9:42 AM IST

సూర్యకుమార్ యాదవ్, టీ20ల్లో నెం.1 బ్యాటర్. గత ఏడాది టీ20ల్లో 1100లకు పైగా పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేసిన సూర్య భాయ్, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాదిలోనూ టీ20ల్లో అద్భుతమైన ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్...

Suryakumar Yadav-Yogi Adityanath

ఈ ఏడాది శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో సెంచరీ బాది, పొట్టి ఫార్మాట్‌లో మూడు సెంచరీలు నమోదు చేసిన మొట్టమొదటి నాన్-ఓపెనర్‌గా రికార్డు క్రియేట్ చేసిన సూర్యకుమార్ యాదవ్... న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లోనూ ఇదే ఫామ్ కొనసాగిస్తున్నాడు.

Image credit: PTI

అయితే వన్డేల్లో మాత్రం సూర్యకుమార్ యాదవ్ సరైన ఫామ్‌ని అందుకోలేకపోతున్నాడు. వన్డేల్లో సూర్య బ్యాటు నుంచి ఓ హాఫ్ సెంచరీ వచ్చి చాలాకాలమే అయ్యింది. అయితే శ్రేయాస్ అయ్యర్ గాయపడడంతో సూర్యకుమార్ యాదవ్, న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు మ్యాచుల్లో ఆడాడు...

Image credit: PTI

సూర్యకుమార్ యాదవ్‌ని వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆడించాలని భావిస్తున్న బీసీసీఐ, కావాలనే గాయం వంకతో శ్రేయాస్ అయ్యర్‌ని సైడ్ చేసి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు కొందరు అభిమానులు. తాజాగా సూర్యకుమార్ యాదవ్‌, టెస్టు ఎంట్రీకి లైన్ క్లియర్ అయినట్టు సమాచారం...

Image credit: Getty

శ్రేయాస్ అయ్యర్ ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని, అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్, నాగ్‌పూర్‌లో టెస్టు ఆరంగ్రేటం చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.ముంబై బ్యాటర్ అయిన సూర్యకుమార్ యాదవ్ కోసం మరో ముంబై బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌ని సైడ్ చేస్తున్నారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు...

Image credit: Getty

శ్రేయాస్ అయ్యర్‌కి షార్ట్ బాల్ వీక్‌నెస్ ఉంది. ఐపీఎల్‌లోనూ, టీమిండియాకి ఆడిన సందర్భాల్లోనూ శ్రేయాస్ అయ్యర్‌లో ఈ టెక్నిక్ లోపం స్పష్టంగా కనిపించింది. కేకేఆర్‌ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్, ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టులో శ్రేయాస్ అయ్యర్‌ వీక్‌నెస్‌ని బాగా వాడుకున్నాడు కూడా...

ఆస్ట్రేలియా ప్రధాన అస్త్రం పేస్ బౌలింగే. బౌన్సర్లను భారత బ్యాట్స్‌మెన్‌ని ముప్పుతిప్పలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు ఆసీస్ బౌలర్లు. అయ్యర్‌ని వీరిని ఎలా ఫేస్ చేస్తాడనేది చాలా పెద్ద విషయమే. అందుకే రిస్క్ చేయడం ఇష్టం లేక అయ్యర్‌ని ఇలా సైడ్ చేసి, సూర్యని లైన్‌లోకి తెచ్చారని టాక్...
 

Virat Kohli-Suryakumar Yadav

వన్డేల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సూర్యకుమార్ యాదవ్, టెస్టుల్లో క్లిక్ అవ్వకపోతే టీమిండియా కొత్త కష్టాలను కోరితెచ్చుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించాలంటే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ గెలవడం టీమిండియాకి చాలా అవసరం.. 

click me!