సెంచరీ తర్వాత అట్టర్ ఫ్లాప్ అవుతున్న దీపక్ హుడా... ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చినా...

First Published Feb 1, 2023, 10:44 AM IST

దీపక్ హుడా, టీ20ల్లో సెంచరీ బాదిన అతికొద్ది భారత క్రికెటర్లలో ఒకడు. 2022లో అంతర్జాతీయ ఆరంగ్రటేం చేసిన దీపక్ హుడా, గత ఏడాది జూన్‌లో ఐర్లాండ్‌పై సెంచరీ చేశాడు. అయితే ఆ తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేకపోయాడు దీపక్ హుడా...

దీపక్ హుడా, ఐర్లాండ్‌పై సెంచరీ చేయగానే టీ20ల్లో విరాట్ కోహ్లీ ప్లేస్‌లో అతన్ని ఆడించాలని డిమాండ్ వినిపించింది. విరాట్ కోహ్లీ, టీ20ల్లో వరుసగా ఫెయిల్ అవుతుండడంతో దీపక్ హుడా, వన్ డౌన్ ప్లేయర్‌గా సరిగ్గా సెట్ అవుతాడని కపిల్ దేవ్ వంటి క్రికెట్ మాజీలు సలహాలు ఇచ్చారు...

Deepak Hooda

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఫామ్‌లో లేని విరాట్ కోహ్లీ కంటే ఫామ్‌లో ఉన్న దీపక్ హుడాని ఆడించడం కరెక్టుగా ఉంటుందని కపిల్ దేవ్ చేసిన కామెంట్లు అప్పట్లో పెను సంచలనం క్రియేట్ చేశాయి.. 

అయితే సెంచరీ చేసిన తర్వాత దీపక్ హుడా వరుసగా ఫెయిల్ అవుతూ టీ20ల్లో ఛాన్స్ కోల్పోయే స్థితికి చేరుకున్నాడు. జూన్‌లో ఐర్లాండ్ టూర్ తర్వాత దీపక్ హుడా 13 టీ20 మ్యాచులు ఆడాడు. వీటిల్లో ఒక్కదాంట్లో కూడా హాఫ్ సెంచరీ మార్క్ అందుకోలేకపోయాడు హుడా...

ఈ ఏడాది శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 41 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన దీపక్ హుడా, రెండు మ్యాచుల్లో 30+ స్కోర్లు నమోదు చేశాడాడు. ఆరు మ్యాచుల్లో సింగిల్ డిజిట్ స్కోరుకే అవుటైన దీపక్ హుడా, వరుసగా రెండు టీ20ల్లో డకౌట్ అయ్యాడు...

13 మ్యాచుల్లో కలిపి 19.4 సగటుతో 194 పరుగులే చేశాడు దీపక్ హుడా. న్యూజిలాండ్ టూర్‌లో రెండో వన్డేలో 4 వికెట్లు తీసి అదరగొట్టిన దీపక్ హుడా.., ఆ తర్వాత పెద్దగా బౌలింగ్ వేసింది లేదు. బౌలింగ్ చేసిన మ్యాచుల్లో వికెట్లు తీసిందీ లేదు...

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో 10 బంతుల్లో 10 పరుగులు చేసిన దీపక్ హుడా, మ్యాచ్ కీలక సమయంలో అవుటై పెవిలియన్ చేరాడు. దీపక్ హుడాని బౌలర్‌గా వాడుకోవడంపై కూడా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు..

Image credit: Getty

టీ20ల్లో పోటీ విపరీతంగా పెరిగిపోతోంది. జితేశ్ శర్మ, రజత్ పటిదార్, షాబ్రాజ్ అహ్మద్ వంటి ప్లేయర్లు టీమ్‌లో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నాయి. దీంతో దీపక్ హుడా టీమ్‌లో ఉండాలంటే మూడో టీ20లో ఓ మంచి ఇన్నింగ్స్ ఆడాల్సిందే..

click me!