కర్వా చౌత్ లుక్‌లో ఊర్వశి.. నీకు పుణ్యముంటది ఇకనైనా పంత్‌ను వదిలేయమంటున్న ఫ్యాన్స్

Published : Oct 12, 2022, 05:19 PM IST

Karwa Chauth 2022: బాలీవుడ్ వర్ధమాన నటి ఊర్వశి రౌతేలా.. తనకు బ్రేకప్ చెప్పిన టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ ను ఇప్పట్లో వదిలేలా లేదు. పంత్ పట్టించుకోకున్నా అతడి  చుట్టూనే తిరుగుతూ వార్తల్లో నిలుస్తున్నది. 

PREV
16
కర్వా చౌత్ లుక్‌లో ఊర్వశి.. నీకు పుణ్యముంటది ఇకనైనా పంత్‌ను వదిలేయమంటున్న ఫ్యాన్స్

ఊర్వశి రౌతేలా - రిషభ్ పంత్ ల బ్రేకప్ లవ్ స్టోరీ ఇప్పట్లో ముగిసేలా లేదు. ‘నిను వీడని నీడను నేను..’ అన్న రేంజ్ లో పంత్ దుబాయ్ కు వెళ్తే  దుబాయ్‌కు.. ఆస్ట్రేలియా వెళ్తే  అక్కడికి కూడా వెళ్తున్న ఊర్వశి .. సోషల్ మీడియాలో సందు దొరికనప్పుడల్లా విరహవేదనను  తెలుపుతూనే ఉంది.  

26
Image credit: Wikimedia Commons and Twitter

నిత్యం ఏదో ఓ కామెంట్ తో పంత్ అటెన్షన్  ను తనవైపునకు తిప్పుకుని  వార్తల్లో నిలిచే ఊర్వశి..   ఇన్స్టాగ్రామ్ లో ఏ పోస్టు పెట్టినా పంత్ గురించే అనుకుంటున్నారు  నెటిజన్లు. ఆమె పోస్టు పెట్టిన కొద్దిసేపటికే అది నెట్టింట వైరల్ అవుతున్నది.  

36

తాజాగా  ఊర్వశి కర్వా చౌత్ లుక్ లో మెరిసింది. అక్టోబర్ 13న ఈ పండుగ జరుగనుంది. ఉత్తర భారతంలో  కర్వా చౌత్ ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. కార్తీక మాసంలో  పౌర్ణమి రోజు పెళ్లైన మహిళలు తమ భర్తలను జల్లెడలో  చూడటం సంప్రదాయం.  తమ భర్తలు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని  భార్యలు కోరుకుని చేసే వ్రతమిది. ఇక పెళ్లికాని ఆడవాళ్లు.. తమకు మంచి భర్త రావాలని కోరుకుని వ్రతం చేస్తారు. 

46

ఇక ఊర్వశి కూడా తన ఇన్స్టాగ్రామ్ లో నిండైన చీరకట్టు.. నుదుటన సిందూరం  పెట్టిన ఫోట్ షేర్ చేసింది.  ఈ పోస్టులో.. ‘ప్రేమలో ఉన్న ప్రేమికురాలికి  సింధూరం కంటే ప్రియమైనది ఏమీ లేదు.  క్రతువులన్నీ ఆచారాలతోనే జరగాలి. నీతో జీవితాంతం గడపాలి..’ అని ఓ కోట్ ను  రాసుకొచ్చింది. 

56

అయితే ఊర్వశి పెట్టిన ఈ పోస్టు నెటిజన్ల కంట పడింది.  దీంతో వాళ్లు ఊర్వశి.. పంత్ కోసమే ఈ పోస్టు పెట్టిందని.. ‘నీకు పుణ్యముంటది. మా పంత్ ను వదిలేయరాదు. పాపం అసలే టీ20  ప్రపంచకప్ లో ఆడతానో లేదో అని  బెంగ పెట్టుకుంటున్నాడు.  ఇప్పటికే నువ్వు ఆస్ట్రేలియా వెళ్తున్నావ్. మాకు అదే భయంగా ఉంది..’ అని కామెంట్స్ చేస్తున్నారు. 
 

66

మరికొందరేమో.. ‘పంత్ భయ్యా.. నువ్వు ఇవేమీ పట్టించుకోకు. నీ లక్ష్యం మీద  ఫోకస్ పెట్టు.. ఇలాంటోళ్లు వంద మంది నీ దగ్గరకు వస్తారు. ఈమె పెట్టే పోస్టులు అస్సలు పట్టించుకోకు..’ అని హితబోధ చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories