స్టార్లు లేకుండా సిరీస్ గెలిచి... ఆస్ట్రేలియా రికార్డును లేపేసిన టీమిండియా...

First Published Oct 11, 2022, 7:49 PM IST

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్... టీమిండియా సీనియర్ క్రికెటర్లు ఎవ్వరూ లేకుండా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడింది భారత జట్టు. మరోవైపు సఫారీ టీమ్ మాత్రం పూర్తి ప్లేయర్లతో, స్టార్లతో బరిలో దిగింది. అయినా విజయం భారత్‌నే వరించింది...

Image credit: PTI

తొలి వన్డేలో సంజూ శాంసన్ వీరోచిత పోరాటంతో 9 పరుగుల తేడాతో విజయాన్ని మిస్ చేసుకున్న భారత జట్టు, ఆ తర్వాత వరుసగా రెండు వన్డేల్లో గెలిచి 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. 2017 నుంచి మొదటి మ్యాచ్ ఓడిన తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి సిరీస్ గెలవడం ఇది 9వ సారి..

Sanju Samson-Shreyas Iyer

టీమిండియా ఈ ఏడాది ఇది 38వ విజయం. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో కలిపి ఈ ఏడాది 38 విజయాలు అందుకున్న భారత జట్టు, ఒకే ఏడాది అత్యధిక మ్యాచుల్లో గెలిచిన టీమ్‌గా ఆస్ట్రేలియా టీమ్ రికార్డును సమం చేసింది. 2003లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా 47 మ్యాచులు ఆడి 38 విజయాలు అందుకోగా ఈ ఏడాది 55 మ్యాచులు ఆడి 38 విజయాలు అందుకుంది టీమిండియా...

Image credit: PTI

2017లో 53 మ్యాచులు ఆడి 37 విజయాలు అందుకున్న భారత జట్టు, ఆస్ట్రేలియా రికార్డును ఒక్క మ్యాచ్ తేడాతో మిస్ చేసుకుంది. ఈ ఏడాది ఇంకా భారత జట్టు రెండున్నర నెలల పాటు క్రికెట్ ఆడనుంది. దీంతో ఒకే ఏడాది అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా సరికొత్త చరిత్ర లిఖించనుంది టీమిండియా...
 

Shreyas Iyer-Shubman Gill

3 వన్డేల సిరీస్‌లో ఓ సెంచరీ, మరో హాఫ్ సెంచరీతో 191 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో అయ్యర్ యావరేజ్ 191.0గా ఉంది. 3 వన్డేల సిరీస్‌లో అత్యధిక యావరేజ్ నమోదు చేసిన ఐదో బ్యాటర్‌గా నిలిచాడు శ్రేయాస్ అయ్యర్. ఇంతకుముందు నవ్‌జోత్ సింగ్ సిద్ధూ, వెస్టిండీస్‌పై 231, పాక్‌పై ఎమ్మెస్‌ ధోనీ 203, జింబాబ్వేపై కెఎల్ రాహుల్ 196, ఆస్ట్రేలియాపై 193 సగటుతో పరుగులు చేసి అయ్యర్ కంటే ముందున్నారు...

మూడు వన్డేల సిరీస్‌లో అతి తక్కువ పరుగులు చేసిన ఐదో భారత ఓపెనర్‌గా చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు శిఖర్ ధావన్. గౌతమ్ గంభీర్ 2007లో ఆస్ట్రేలియాపై 17, సచిన్ 2009లో లంకపై 18, 2011లో సౌతాఫ్రికాపై మురళీ విజయ్ 18, 2017లో ఇంగ్లాండ్‌పై కెఎల్ రాహుల్ 24 పరుగులు చేశారు. శిఖర్ ధావన్ ఈ సిరీస్‌లో 25 పరుగులు చేసి వీరి తర్వాతి స్థానంలో నిలిచాడు...

మూడు వన్డేల్లో 5 వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ దక్కించుకున్నాడు. తొలి వన్డేలో 8 ఓవర్లు బౌలింగ్ చేసి 49 పరుగులిచ్చి వికెట్ తీయలేకపోయిన సిరాజ్, రెండో వన్డేలో 10 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 38 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.. మూడో వన్డేలో 5 ఓవర్లలో 17 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు...

Shreyas and Sanju

మూడు వన్డేల్లోనూ నాటౌట్‌గా నిలిచిన సంజూ శాంసన్, ఎమ్మెస్ ధోనీ తర్వాత ఈ ఫీట్ సాధించిన భారత క్రికెటర్‌గా నిలిచాడు. 2013లో వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల్లో 13, 51, 23 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు ధోనీ. ఈ సిరీస్‌లో 86, 30, 2 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు సంజూ శాంసన్... 

click me!