అక్కడ ఎంట్రీ ఇచ్చాడు, మళ్లీ ఐపీఎల్ రిపీట్ చేశాడు.. బీబీఎల్‌లో ఉన్ముక్త్ చంద్‌కి నిరాశ....

Published : Jan 18, 2022, 05:36 PM IST

టాలెంట్ ఉన్నా, దానికంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే... బాగుపడడం కొంచెం కష్టమే. ఇప్పుడు భారత మాజీ క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ పరిస్థితి ఇదే. ఇరగదీస్తానంటూ మనోడిచ్చిన బిల్డర్‌కి తీరా ఛాన్స్ ఇస్తే... మరోసారి ఊసురుమనిపించాడు.

PREV
112
అక్కడ ఎంట్రీ ఇచ్చాడు, మళ్లీ ఐపీఎల్ రిపీట్ చేశాడు.. బీబీఎల్‌లో ఉన్ముక్త్ చంద్‌కి నిరాశ....

బిగ్‌బాష్ లీగ్‌ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన ఉన్ముక్త్ చంద్, ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వడం లేదని, వెకేషన్‌‌కి వచ్చినట్టు ఉందంటూ ట్వీట్ చేశాడు, ఛాన్స్ ఇస్తేనేమో వెంటనే అవుట్ అయిపోయాడు...

212

టీమిండియా నుంచి బిగ్‌బాష్ లీగ్‌లో పాల్గొన్న మొట్టమొదట పురుష క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ఉన్ముక్త్ చంద్...

312

మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ జట్టు తరుపున హోబర్ట్ హరీకేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరంగ్రేటం చేసిన ఉన్ముక్త్ చంద్... 8 బంతుల్లో 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

412

నేపాల్ కెప్టెన్ సందీప్ లమిచాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి, బౌండరీ లౌన్ దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఉన్ముక్త్ చంద్...

512

2024 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో యూఎస్‌ఏ జట్టు తరుపున ఆడాలని ఆశిస్తున్న ఉన్ముక్త్ చంద్, ఇదే విధమైన పర్ఫామెన్స్ కొనసాగిస్తూ... అక్కడ కూడా ఆశలు వదులుకోవాల్సిందే...

612

టీమిండియాలో అవకాశం కోసం దాదాపు 8 ఏళ్లు ఎదురుచూసి, నిరాశగా యూఎస్‌కేకి వలసెళ్లి పోయాడు ఉన్ముక్త్ చంద్...

712

2012 అండర్‌-19 వరల్డ్‌కప్ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై అజేయంగా 111 పరుగులు చేసి, భారత జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు అప్పటి కెప్టెన్ ఉన్ముక్త్ చంద్...

812

ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం ఇయాన్ ఛాపెల్‌తో ప్రశంసలు దక్కించుకున్న ఉన్ముక్త్ చంద్, అండర్-19 వరల్డ్ కప్ విజయం తర్వాత వచ్చిన క్రేజ్‌తో విరాట్ కోహ్లీ, ఎమ్మెస్ ధోనీ, సురేష్ రైనాలతో కలిసి ఓ కూల్‌డ్రింక్ యాడ్‌లో కూడా నటించాడు...

912

అయితే ఉన్ముక్త్ చంద్‌ కెరీర్‌ అనుకున్నంత సక్సెస్‌ఫుల్‌గా సాగలేదు. ఐపీఎల్ 2013లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరుపున ఆరంగ్రేటం చేసిన ఉన్ముక్త్ చంద్, బ్రెట్‌ లీ బౌలింగ్‌లో మొదటి బంతికే డకౌట్ అయ్యాడు..

1012

ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ వంటి జట్లకు మారినా అతనికి అవకాశాలు మాత్రం రాలేదు. దేశవాళీ క్రికెట్‌లోనూ ఢిల్లీ జట్టుకి దూరం కావడం, ఉత్తరాఖండ్‌కి ఆడినా పెద్దగా ఫలితం లేకపోవడంతో గత ఏడాది టీమిండియాకి రిటైర్మెంట్ ప్రకటించాడు ఉన్ముక్త్ చంద్...

1112

2021 ఆగస్టులో టీమిండియాకి రిటైర్మెంట్ ప్రకటించి, యూఎస్‌కేకి మకాం మార్చిన ఉన్ముక్త్ చంద్... మైనర్ లీగ్ క్రికెట్‌లో పాల్గొన్నాడు. మొదటి మ్యాచ్‌లో మూడు బంతుల తర్వాత డకౌట్ అయ్యాడు...

1212

అయితే ఆ తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచి, తన జట్టు సిలికాన్ వ్యాలీ స్ట్రైయికర్స్‌కి టైటిల్ అందించాడు. ఆ తర్వాత బిగ్‌బాష్ లీగ్ అగ్రీమెంట్ కూడా దక్కించుకున్నాడు...

click me!

Recommended Stories