ఏమో నాకైతే అతడి మీద అనుమానంగా ఉంది.. హిట్ మ్యాన్ కు టెస్టు కెప్టెన్సీపై గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు

First Published Jan 18, 2022, 4:40 PM IST

Sunil Gavaskar Comments On Rohit Sharma:  టెస్టు కెప్టెన్సీకి కోహ్లి గుడ్ బై చెప్పిన తర్వాత అతడి వారసుడు ఎవరు..? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పరిమిత ఓవర్ల క్రికెట్ లో కోహ్లి స్థానాన్ని రోహిత్ శర్మ భర్తీ చేస్తుండగా టెస్టులలో కూడా.. 

Sunil Gavaskar

భారత జట్టు టెస్టు సారథిగా  విరాట్ కోహ్లి తప్పుకోవడంతో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా..? అనే చర్చ ఊపందుకుంది. ఈ జాబితాలో  ప్రముఖంగా వినిపిస్తున్న పేరు  పరిమిత ఓవర్లలో భారత్ కు సారథ్యం వహిస్తున్న రోహిత్ శర్మ తో పాటు కెఎల్ రాహుల్, వికెట్ కీపర్ రిషభ్ పంత్. 
 

అయితే రాహుల్, పంత్ లు అనుభవలేమీ కారణంగా రోహిత్ శర్మకే ఈ పోస్టు దక్కవచ్చునని  క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత  క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కూడా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత టెస్టులకు సారథిగా  హిట్ మ్యాన్ పేరును ప్రకటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
 

ఈ నేపథ్యంలో  భారత క్రికెట్ మాజీ దిగ్గజం  సునీల్ గవాస్కర్ స్పందించాడు.  రోహిత్ శర్మకు టెస్టు సారథ్య బాధ్యతలు అప్పజెప్పడంపై అతడు అంతగా సుముఖంగా లేడు. అందుకు గల కారణాలను కూడా సన్నీ వివరించాడు. 
 

గవాస్కర్ మాట్లాడుతూ.. ‘రోహిత్ తో సమస్య ఏంటంటే ఫిట్నెస్. అన్ని  మ్యాచులకు అందుబాటులో ఉండే ఆటగాడు భారత్ కు కావాలి.  అందుకు అతడు (టీమిండియా కెప్టెన్) ఫిట్ గా ఉండాలి. 
 

ఈ విషయంలో మనం ఒకసారి శ్రీలంక మాజీ సారథి ఏంజెలో మాథ్యూస్ ను చూస్తే..  అతడికి కూడా చేతి గాయమైంది. దాంతో అతడు కొన్ని మ్యాచులకు అందుబాటులో లేడు. దాంతో ఆ జట్టుకు తాత్కాలిక కెప్టెన్లను వెతకాల్సిన సమస్య ఎదురైంది. అంతేగాక త్వరగా పరుగులు చేయడంలో కూడా అతడు ఇబ్బందులు పడ్డాడు. 

అలా జరగకుండా ఉండాలంటే మీరు (బీసీసీఐ) మరొకరిని కెప్టెన్ గా నియమించాల్సి ఉంటుంది. ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బందులు పడే ఆటగాళ్ల కంటే చిన్న చిన్న బాహ్య గాయాలున్నా.. ఎప్పుడూ మ్యాచులకు ఫిట్ గా ఉండే ప్లేయర్లను ఎంపిక చేసింది బెటర్...’ అని గవాస్కర్  అన్నాడు. 
 

కాగా.. కోహ్లి  స్థానాన్ని రిషభ్ పంత్ తో భర్తీ చేయాలని సునీల్ గవాస్కర్ గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. యువకుడైన పంత్ కు ఇంకా ఎంతో కెరీర్ ఉందని, అతడిని ఇప్పట్నుంచే సానబెడితే భవిష్యత్ లో మంచి నాయకుడిగా ఎదుగుతాడని చెప్పాడు. 

Rohit Sharma

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కు ముందు చేతి వేలికి గాయం కావడంతో రోహిత్ శర్మ ఈ టూర్ నుంచి తప్పుకున్నాడు. అయితే కొద్దిరోజుల పాటు  ఎన్సీఏ లో గడిపినా రోహిత్ మాత్రం ఫిట్నెస్ సాధించలేదు.దీంతో అతడు  వన్డే సిరీస్ కు కూడా దూరమైన విషయం తెలిసిందే. అదీగాక బద్దకస్తుడుగా రోహిత్ కు పేరుంది.  ఇప్పుడిదే విషయాన్ని  సన్నీ తన వ్యాఖ్యలలో ఎత్తి చూపాడు. 

click me!