మురళీధరన్, సునీల్ నరైన్ నా ముందు పనికి రారు! వరల్డ్ బెస్ట్ స్పిన్నర్‌ నేనే! క్రిస్ గేల్ కామెంట్...

First Published Aug 24, 2022, 6:26 PM IST

జీవితాన్ని ఎంజాయ్ చేయడమనే పుస్తకం రాస్తే అందులో ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్‌తో ముందుమాట రాయించాల్సిందే. జీవితంలో ప్రతీ మూమెంట్‌ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంటాడు క్రిస్ గేల్. 43 ఏళ్ల వయసులోనూ అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇవ్వని క్రిస్ గేల్, త్వరలో ‘6ixty’ పేరుతో ఓ లీగ్ తీసుకురాబోతున్నాడు...

Chris Gayle and Marsh

టీ20ల్లో 14,562 పరుగులు చేసిన క్రిస్ గేల్, పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. త్వరలో 10 ఓవర్ల ఫార్మాట్‌లో ‘6ixty’ (60 బంతులు) పేరుతో టోర్నీని మొదలెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు క్రిస్ గేల్...

Chris Gayle

ఈ టోర్నీ ఆరంభానికి ముందు తన బౌలింగ్ గురించి క్రిస్ గేల్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి. ‘మీకు తెలుసా... నాకు బౌలింగ్ సహజసిద్ధంగా వచ్చింది. ఈ సారి నేను కచ్ఛితంగా బౌలింగ్ చేయబోతున్నా.. ఎందుకంటే నేను ఆల్‌టైం గ్రేట్ ఆఫ్ స్పిన్నర్‌ని...

ముత్తయ్య మురళీధరన్ నాతో పోటీపడలేదు. ఎందుకంటే నా ఎకానమీ అతని కంటే చాలా బాగుంటుంది. సునీల్ నరైన్ నా దరిదపుల్లోకి కూడా రాలేదు...’ అంటూ ఫన్నీగా సమాధానాలు చెప్పాడు క్రిస్ గేల్...

Chris Gayle

‘మళ్లీ ఫీల్డ్‌లో అడుగుపెట్టేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా. కొన్నాళ్లుగా క్రికెట్‌ని బాగా మిస్ అయ్యా. ఇప్పుడు నేను మళ్లీ పిల్లాడిగా మారిపోయా. నా మొదటి మ్యాచ్ ఆడేందుకు తహతహలాడుతున్నా... ఓ రకంగా ఇది నా తొలి మ్యాచ్...

మళ్లీ మునుపటి షేప్‌లోకి రావాలి. అంటే ఇప్పుడు షేప్‌లో లేనని కాదు, కొంచెం ప్రిపరేషన్ అవసరం. ఆ తర్వాత క్రికెట్ ఆడడానికి కావాల్సిన మైండ్‌సెట్‌ని రెఢీ చేసుకోవాలి...’ అంటూ కామెంట్ చేశాడు క్రిస్ గేల్...


2021 టీ20 వరల్డ్ కప్‌లో చివరిసారిగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన క్రిస్ గేల్, ఆ టోర్నీలో ఆఖరి మ్యాచ్‌‌లో అవుటైన తర్వాత బ్యాటు ఎత్తి అందరికీ అభివాద చేశాడు. గేల్ రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడని అప్పుడే వార్తలు వచ్చినా, దాని గురించి ఇప్పటిదాకా అధికారిక ప్రకటన అయితే చేయలేదు...

Chris Gayle celebration

క్రిస్ గేల్‌కి బౌలింగ్‌లోనూ మంచి రికార్డు ఉంది. 103 టెస్టుల్లో 73 వికెట్లు తీసిన క్రిస్ గేల్, 301 వన్డేల్లో 167 వికెట్లు పడగొట్టాడు. 79 టీ20 మ్యాచుల్లో 20 వికెట్లు తీసిన క్రిస్ గేల్... లిస్టు ఏ, ఫస్ట్ క్లాస్, టీ20ల్లో 440 వికెట్లకు పైగా పడగొట్టాడు.. 

click me!