ఒకరికి ప్రతీకారం- మరొకరికి పరువు... ఆసియా కప్‌‌లో పాకిస్తాన్ vs భారత్ మ్యాచుల లెక్కలు ఇవి...

First Published Aug 24, 2022, 5:08 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీకి మరో 3 రోజుల సమయం మాత్రమే ఉంది. భారత జట్టు తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌తో తలబడనుంది. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాక్ చేతుల్లో పరాజయం తర్వాత రెండు జట్ల మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్ కావడంతో దీనికి భారీ హైప్ వచ్చేసింది... ఒకరికి ఈ మ్యాచ్ ప్రతీకారం తీర్చుకునేందుకు దొరికిన అవకాశం అయితే మరొకరికి పరువు కాపాడుకునేందుకు మిగిలిన మార్గం.  అసలు ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచుల లెక్కలు ఎలా ఉన్నాయి...

1984 నుంచి ఇప్పటిదాకా భారత్, పాకిస్తాన్ జట్లు 14 సార్లు తలబడ్డాయి. వీటిల్లో 8 మ్యాచుల్లో భారత జట్టు విజయం సాధించగా 5 మ్యాచుల్లో పాకిస్తాన్‌కి విజయం దక్కింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దయ్యింది...
 

1984లో మొట్టమొదటిసారి ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలబడ్డాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 54 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది టీమిండియా. ఆ తర్వాత 1988 ఎడిషన్‌లోనూ సేమ్ సీన్ రిపీట్ చేసింది భారత జట్టు...

1988 ఆసియా కప్ టోర్నీలో పాకిస్తాన్‌పై 4 వికెట్ల తేడాతో విజయం అందుకుంది టీమిండియా. 1995లో తొలిసారి భారత్‌ని ఓడించింది పాకిస్తాన్. ఆసియా కప్‌లో భారత్‌పై 97 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుని ప్రతీకారం తీర్చుకుంది పాకిస్తాన్...

1997 ఆసియా కప్ టోర్నీలో భారత్, పాక్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. 2000వ సంవత్సరంలో భారత్‌ను 44 పరుగుల తేడాతో ఓడించింది పాకిస్తాన్. 2004 ఆసియా కప్‌లోనూ పాక్ చేతుల్లో 59 పరుగుల తేడాతో ఓడింది టీమిండియా...

ఆరంభంలో 2 విజయాలు అందుకున్న తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో పాక్ చేతుల్లో ఓడిన టీమిండియా... 2008లో తిరిగి విజయాల బాట పట్టింది. 2008లో పాక్‌పై 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకున్న టీమిండియా.. ఇదే ఎడిషన్‌ జరిగిన రెండో మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్‌ని ఓడించింది పాకిస్తాన్...

2010 ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై 3 వికెట్ల తేడాతో గెలిచిన భారత జట్టు, 2012 లో 6 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. 2014లో పాకిస్తాన్ చేతుల్లో 1 వికెట్ తేడాతో పరాజయం పాలైంది టీమిండియా... 

2016 ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న భారత జట్టు, 2018 ఎడిషన్‌లో పాక్‌ని రెండు సార్లు చిత్తు చేసింది. 2018లో పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం అందుకున్న టీమిండియా, రెండో మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది...

ఓవరాల్‌గా భారత్, పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ టోర్నీలో జరిగిన గత 6 మ్యాచుల్లో ఐదు విజయాలు అందుకుంది టీమిండియా.7 సార్లు ఆసియా కప్ టైటిల్ గెలిచిన భారత జట్టు, ఈసారి పాక్‌ని కొట్టే దెబ్బ, టీ20 వరల్డ్ కప్ 2021 మ్యాచ్‌ని మరిచిపోయేలా ఉండాలని కోరుకుంటున్నారు టీమిండియా ఫ్యాన్స్.. 

click me!