సిక్సర్లు బాదడంలో ఆయనే అసలైన బాస్... ఐపీఎల్‌లో ‘యూనివర్సల్ బాస్’ క్రిస్‌గేల్ రికార్డులివి...

First Published Sep 21, 2021, 3:50 PM IST

క్రిస్‌గేల్... భారతీయుల అభిమానాన్ని చొరగొన్న విదేశీ ప్లేయర్లలో ఒకడు. క్రిస్‌గేల్ క్రీజులో ఉంటే, క్రికెట్ ఫ్యాన్స్‌కి పండగే. ఫోర్లు బాదడం కంటే సిక్సర్లు కొట్టడమే తేలిక అన్నట్టుగా సాగుతుంది క్రిస్ గేల్ బ్యాటింగ్... విధ్వంసకర విండీస్ బ్యాటింగ్ వీరుడు ‘యూనివర్సల్ బాస్’క్రిస్‌గేల్ 42వ పుట్టినరోజు నేడు...

టీ20 ఫార్మాట్‌లో 1000+ పైగా సిక్సర్లు బాదిన ఒకే ఒక్కడు క్రిస్‌గేల్. గేల్ టీ20ల్లో 1042 సిక్సర్లు బాదితే, వెస్టిండీస్‌కే చెందిన కిరన్ పోలార్డ్ 756, ఆండ్రే రస్సెల్ 509 సిక్సర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు... 

తనకీ, రెండో స్థానంలో ఉన్న పోలార్డ్‌కి మధ్య దాదాపు 300+ సిక్సర్ల వ్యత్యాసం ఉంటే... బాస్ బాదుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు...

ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ యూనివర్సల్ బాసే... గేల్, ఐపీఎల్‌లో 357 సిక్సర్లు బాదితే, 245 సిక్సర్లు బాదిన ఆర్‌సీబీ ప్లేయర్ ఏబీ డివిల్లియర్స్ రెండో స్థానంలో ఉన్నాడు..

ఐపీఎల్‌లో అత్యధిక సార్లు హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన బ్యాట్స్‌‌మెన్ క్రిస్‌గేల్. గేల్ 12 సార్లు వరుసగా మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాదితే, ఆండ్రే రస్సెల్ 7 సార్లు, ఏబీడీ, పోలార్డ్ ఐదేసి సార్లు, యువరాజ్ సింగ్ 4 సార్లు హ్యాట్రిక్ సిక్సర్లు బాదారు...

టీ20ల్లో 1000+ సిక్సర్లు బాదిన క్రిస్‌గేల్, అంతర్జాతీయ క్రికెట్‌లో 500+ సిక్సర్లు బాదిన ఒకే ఒక్కడు... గేల్ ఖాతాలో 550 అంతర్జాతీయ సిక్సర్లు ఉంటే, షాహిద్ అఫ్రిదీ 476 సిక్సర్లు బాదాడు. రోహిత్ శర్మ 440 సిక్సర్లత మూడో స్థానంలో ఉన్నాడు...

టీ20 క్రికెట్‌లో పది వేల పరుగులు సాధించిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేసిన ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్... ఈ ఫార్మాట్‌లో 22 సెంచరీలతో టాప్‌లో ఉన్నాడు...

ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ కూడా క్రిస్ గేల్... 2012 సీజన్‌లో ఆర్‌సీబీ తరుపున క్రిస్‌గేల్ 59 సిక్సర్లు బాదితే, ఆండ్రే రస్సెల్ 2019లో 52 సిక్సర్లు బాదాడు...

అంతేకాదు 2013లో 51 సిక్సర్లు బాదిన క్రిస్‌గేల్, 2011 సీజన్‌లో 44, 2015 సీజన్‌లో 38 సిక్సర్లు బాది టాప్ 4లో మూడు సార్లు తన పేరును లిఖించుకున్నాడు...

2011 నుంచి 2017 వరకూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన క్రిస్‌గేల్, ఈ సమయంలో ఐపీఎల్‌లో ఆరు సెంచరీలు బాదాడు...

సెంచరీలు మాత్రమే కాదు, ఐపీఎల్‌లో 99 పరుగుల వద్ద రెండు సార్లు అవుటైన బ్యాట్స్‌మెన్‌గా కూడా రికార్డు క్రియేట్ చేశాడు క్రిస్ గేల్... 

ఐపీఎల్‌లో 4950 పరుగులు చేసిన క్రిస్ గేల్, మరో 50 పరుగులు చేస్తే 5 వేల పరుగులు చేసిన ఆరో బ్యాట్స్‌మెన్‌గా నిలుస్తాడు... 

112 ఇన్నింగ్స్‌ల్లో 4 వేల పరుగులు పూర్తిచేసుకున్న గేల్, ఐపీఎల్‌లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

click me!