ధోనీ సూపర్ కింగ్స్‌కి, కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్‌కీ ఉన్న తేడా ఇదే... వాళ్లు అలా గెలిస్తే, వీళ్లు ఇలా...

Published : Sep 21, 2021, 03:02 PM IST

ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో మొదటి రెండు మ్యాచులు, క్రికెట్ ఫ్యాన్స్‌కి చిత్రమైన అనుభవాన్ని మిగిల్చాయి. సీఎస్‌కే, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో చెన్నై ‘సూపర్’ విన్నింగ్స్‌తో టాప్‌లోకి దూసుకెళ్లగా... ఆర్‌సీబీ, కేకేఆర్ మధ్య మ్యాచ్ మాత్రం పూర్తి వన్‌సైడెడ్‌గా సాగింది...

PREV
115
ధోనీ సూపర్ కింగ్స్‌కి, కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్‌కీ ఉన్న తేడా ఇదే... వాళ్లు అలా గెలిస్తే, వీళ్లు ఇలా...

చెన్నై సూపర్ కింగ్స్‌, ముంబైతో జరిగిన మ్యాచ్‌లో మొదటి రెండు ఓవర్లలోనే ఓపెనర్లను కోల్పోయింది. ఆ తర్వాత సీనియర్ మోస్ట్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా, ఎమ్మెస్ ధోనీ కూడా అవుట్ అయ్యారు...

215

ఆదుకుంటాడని ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్న అంబటి రాయుడు, రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగి మళ్లీ క్రీజులోకి రాలేదు కూడా... 

315

2 పరుగులకే 2, 7 పరుగులకే 3 వికెట్లు, 24 పరుగులకే టాపార్డర్‌లోని నలుగురు కీ ప్లేయర్లు పెవిలియన్ చేరిన క్లిష్ట పరిస్థితి...

415

అయితే ఓ యంగ్ గన్ రుతురాజ్ గైక్వాడ్, పూర్తి బాధ్యత తీసుకుని జట్టుని ఆదుకున్నాడు. ఒకానొకదశలో వీళ్లు 80 పరుగులైనా చేస్తారా? అనుకున్న సీఎస్‌కే 150+ పరుగులు చేయగలిగింది...

515
RCB vs KKR (Photo Credit-iplt20.com)

సీఎస్‌కేతో పోలిస్తే, ఆర్‌సీబీది కాస్త మెరుగైన పొజిషనే... విరాట్ కోహ్లీ అవుట్ అయ్యే సమయానికే ఆర్‌సీబీ 10 పరుగులు చేసింది... 

615

మంచి ఫామ్‌లో ఉన్న దేవ్‌దత్ పడిక్కల్ క్రీజులో ఉన్నంతసేపు దూకుడుగా ఆడడంతో 6 ఓవర్లలో 41 పరుగులు వచ్చాయి... ఈ పొజిషన్‌లో వేరే జట్టు ఉంటే, కనీసం 150+ పరుగులు వస్తాయని భరోసా ఉంటుంది..

715

అయితే ఎప్పుడైతే ఏబీ డివిల్లియర్స్ డకౌట్ అయ్యాడో, అంతే జనాలకు సీన్ అర్థమైపోయింది... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ఆర్డర్‌ పెవిలియన్‌కి క్యూ కట్టేసింది... 

815

ఇండియాలో ఆడిన ఫేజ్ 1లో అదరగొట్టిన మ్యాక్స్‌వెల్, భారత్- శ్రీలంక టూర్‌లో మెరుపులు మెరిపించిన హసరంగ, భారీ షాట్లు ఆడగల జెమ్మీసన్, హర్షల్ పటేల్... ఎవ్వరూ ఆర్‌సీబీని ఆదుకోలేకపోయారు...

915

చెన్నై సూపర్ కింగ్స్‌లో డుప్లిసిస్ దగ్గర్నుంచి బ్యాటింగ్ ఆర్డర్‌లో చివరన వచ్చే బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్ దాకా... ప్రతీ ఒక్కరూ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆల్‌రౌండ్ షోతో అదరగొడతారు...

1015

అయితే ఆర్‌సీబీలో మాత్రం అలా జరగదు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ ఫెయిల్ అయితే, ఆర్‌సీబీ మ్యాచ్ గెలవడం... చాలా చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది...

1115

అది మరోసారి ఈ మ్యాచ్ ద్వారా రుజువైంది. ముంబైతో మ్యాచ్‌లో రుతురాజ్ ఆటకి ధోనీకి క్రెడిట్ ఇవ్వలేం. అలాగే నేటి మ్యాచ్‌లో ఆర్‌సీబీ పరాజయానికి కోహ్లీని బాధ్యుడిగా చూడలేం...

1215

గత ఏడాది దారుణమైన పర్ఫామెన్స్ తర్వాత జట్టును మరింత పటిష్టంగా నిర్మించడంలో సీఎస్‌కే సూపర్ సక్సెస్ అయితే, కోట్లు పెడితే స్టార్ ప్లేయర్లు వస్తారని ఆలోచించే రాయల్ ఛాలెంజర్స్... 14 సీజన్లలో టైటిల్ గెలవలేకపోయింది...

1315

CSK vs RCB

1415

ఈ రెండు జట్లకీ... అంతెందుకు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకీ... రాయల్ ఛాలెంజర్స్ జట్లకీ ఉన్న ప్రధానమైన తేడా ఒక్కటే... రోహిత్, సీఎస్‌కే టీమ్స్ ప్లేయర్ల మధ్య ఓ హెల్తీ వాతావరణాన్ని నిర్మించి, మంచి అనుబంధాన్ని పెంచుతాయి...

1515

అదే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం పూర్తి కార్పొరేట్ స్టైల్... బ్రాండ్ వాల్యూ ఉన్న క్రికెటర్లను పట్టుకొచ్చి, మార్కెటింగ్ చేస్తే విజయాలు వస్తాయని ఆలోచిస్తోంది... అందుకే జెంటిల్‌మెన్ గేమ్‌లో ఎమోషనల్ అటాచ్‌మెంట్ కుదరక సక్సెస్ కాలేకపోతోంది...

click me!

Recommended Stories