కోహ్లీ ఫిట్నెస్ సీక్రెట్స్... విరాట్ ఫాలో అయ్యే సూపర్ డైట్ ఇదే..!

First Published Sep 21, 2021, 12:37 PM IST

విరాట్ ఇప్పుడు ఒక విజయవంతమైన, సమర్థవంతమైన అంతర్జాతీయ క్రికెటర్‌గా పరిగణించబడుతున్నప్పటికీ, ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు. నిజానికి, అతని మొదటి ప్రపంచ కప్ తర్వాత మాత్రమే అతను ఫిట్‌నెస్‌ని సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టాడు.

Virat Kohli

టీమిండియా విరాట్ కోహ్లీ ఆటకు ఎంత మంది అభిమానులు ఉన్నారో.. ఆయన ఫిట్నెస్ కి కూడా అంతే అభిమానులు ఉన్నారు. అంతర్జాతీయ అత్యుత్తమ బ్యాట్స్ మెన్ గా పేరున్న కోహ్లీ.. క్రమ శిక్షణలోనూ ఆయనకు ఎవరూ సాటిరారనే చెప్పాలి.

మరి కోహ్లీ అంత ఫిట్నెనెస్ గా ఉండేందుకు ఎలాంటి సీక్రెట్స్ ఫాలో అవుతాడు..? డైట్ ఎలా ఉంటుందనే విషయం తెలుసుకునేందుకు చాలా మంది అభిమానులు ఉత్సాహపడుతుంటారు. మరి కోహ్లీ సీక్రెట్స్ ఏంటో ఓసారి చూసేద్దామా..

విరాట్ ఇప్పుడు ఒక విజయవంతమైన, సమర్థవంతమైన అంతర్జాతీయ క్రికెటర్‌గా పరిగణించబడుతున్నప్పటికీ, ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు. నిజానికి, అతని మొదటి ప్రపంచ కప్ తర్వాత మాత్రమే అతను ఫిట్‌నెస్‌ని సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టాడు.
 


తన ఫిజిక్ సరిగా లేదని తనకు తాను గుర్తుంచుకొని.. ఫిట్నెస్ మీద దృష్టి పెట్టాలని అనుకున్నాడట. అప్పటి నుంచి ఒక్కరోజు కూడా వెనక్కి తిరిగి కూడా చూసుకోకుండా.. తన ఫిజిక్ కోసం కష్టపడ్డానని ఆయన చెప్పడం గమనార్హం. 

విరాట్ కోహ్లీ.. తన డైట్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కువగా.. ఆకుకూరలను తన ఆహారంలో భాగం చేసుకుంటాడు. ఆకు కూరలు, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే ఆహారాన్ని ఆయన తీసుకుంటారు. సమతుల్య ఆహారం కారణంగా ఆయన అంత ఫిట్ గా ఉండగలుగుతున్నారు.

virat kohli

అల్పాహారంలో.. కోహ్లీ కోడిగుడ్లు, మిరియాలు, వెజ్జీనీ తీసుకుంటారు. ఇప్పుడు కోహ్లీ పూర్తిగా వెజిటేరియన్ గా మారిపోయాడు. అయితే.. అంతకముందు మాత్రం చికెన్, సాల్మన్ ఫిష్ ని ఇష్టంగా తినేవాడు. ఇప్పుడు మాత్రం నాన్ వెజ్ ముట్టుకోవడం లేదు.

వీటితో పాటు.. తనకు అదనపు శక్తి లభించడం కోసం.. గింజలు, మొలకలను తీసుకుంటూ ఉంటారు. గ్లూటెన్ లేని రొట్టెలు, డెజర్ట్స్ ని తినడానికి కోహ్లీ ఎక్కువ ఆసక్తిచూపిస్తుంటాడు. ఇక డిన్నర్ లో ప్రోటీన్స్ ని ఎక్కువగా తీసుకుంటారు.  స్మూతీలు, సోయా ప్రోటీన్ షేక్ లను తాగడానికి ఇష్టపడతాడు. ప్రయాణ సమయాల్లో ఇంటి నుంచి తయారు చేసిన ఆహారాన్ని తీసుకువెళ్లడానికి ఇష్టపడతారు.

ప్రపంచంలో చాలా మంది అథ్లెట్స్ మాంసాహారాలు తీసుకుంటారని అందరూ అనుకుంటారు. అయితే.. కోహ్లీ మాత్రం పూర్తిగా శాకాహారి కావడం గమనార్హం. ఫిట్ గా ఉండాలంటే కేవలం పూర్తి శాకాహారంతో కూడా ఉండొచ్చని కోహ్లీ నిరూపించాడు.

మొదట్లో కోహ్లీ తన ఆహారం, ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకునేవాడుకాదట. తర్వాత తన ఆహారం విషయంలో మార్పులు చేసుకున్నానని చెప్పాడు. తన డైట్ లో షుగర్ ని పూర్తిగా తగ్గించేశాడట. ఒక్క రోజుల్లో ఆయన దాదాపు 3-4 కప్పుల గ్రీన్ టీ తాగుతాడట. అది  ఆయన ఆరోగ్య రహస్యమట. ట్యాక్సిన్స్ బయటకు రావడానికి ఈ గ్రీన్ టీ ఉపయోగపడుతుంది.

వెయిట్ లిఫ్టింగ్స్, కార్డియో లను కోహ్లీ ఎక్కువగా చేస్తుంటారు. వారంలో ఐదు, ఆరు రోజులు ఆయన వ్యాయామం చేస్తుంటారట. తన కండరాలు బలంగా ఉండే వ్యాయామాలను ఆయన ఎంచుకుంటారు. ఆయన ఎంతలా వ్యాయామం చేస్తాడో.. ఆయన ఇన్ స్టాగ్రామ్ చూస్తే అందరికీ అర్థమౌతుంది. 

click me!