టీమిండియాకి రిటైర్మెంట్ ప్రకటించిన స్మిత్ పటేల్... ఇకపై విదేశీ టోర్నీల్లోనే, అతని దారిలోనే...

First Published May 31, 2021, 1:26 PM IST

భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న యువ ఆటగాళ్లలోని ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ప్రారంభమైంది ఐపీఎల్. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ ద్వారా వెలుగులోకి వచ్చే యువ క్రికెటర్ల కంటే, అవకాశం కోసం ఆశగా ఎదురుచూస్తూ కాలం గడిపేస్తున్నవారే ఎక్కువ.

దాదాపు 8 ఏళ్లుగా అవకాశం కోసం ఆశగా ఎదురుచూస్తున్న భారత క్రికెటర్ స్మిత్ పటేల్, సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్న స్మిత్ పటేల్, టీమిండియా దేశవాళీ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు.
undefined
‘అండర్ 19 వరల్డ్‌కప్‌లో భారత జట్టు తరుపున ఆడడం నా అదృష్టం. అయితే ఇక టీమిండియాకి రిటైర్మెంట్ ప్రకటించేశా. ఇప్పటికే బీసీసీఐతో దీనికి సంబంధించిన పేపర్ వర్క్ మొత్తం పూర్తయ్యింది.
undefined
ఇక భారత్ తరుపున నా క్రికెట్ చాప్టర్ పూర్తయినట్టే. మళ్లీ టీమిండియాకి తిరిగి వస్తా. కాకపోతే క్రికెట్ ఆడడానికి కాదు, ట్రైయినింగ్ కోసం మాత్రమే. అమెరికాలో మంచు కురిసే సమయంలో ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తా’ అంటూ ప్రకటించాడు స్మిత్ పటేల్.
undefined
2012 అండర్ 19 వరల్డ్‌కప్‌లో టీమిండియా కెప్టెన్ ఉన్ముక్త్ చంద్‌తో కలిసి 130 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన స్మిత్ పటేల్, 64 పరుగులతో అజేయంగా నిలిచాడు. విన్నింగ్ షాట్ కొట్టి టీమిండియాకి విజయాన్ని అందించిన స్మిత్ పటేల్‌కి ఐపీఎల్‌లో కానీ, భారత జట్టులో కానీ అవకాశం రాలేదు.
undefined
ఫారిన్ లీగ్‌లో పాల్గొనే ప్లేయర్లకు ఐపీఎల్‌లో కానీ భారత జట్టు తరుపున ఆడే అవకాశం కానీ ఉండదు. అంతేకాదు దేశవాళీ లీగుల్లో కూడా వారికి చోటు ఉండదు. అయితే ఈ విషయం తెలిసినా భారత ప్లేయర్ స్మిత్ పటేల్, సీపీఎల్ 2021 సీజన్‌లో ఆడబోతున్నట్టు ప్రకటించాడు.
undefined
వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అయిన స్మిత్ పటేల్, బరోడా తరుపున దేశవాళీ టోర్నీల్లో ఆడాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో కూడా ఆడిన స్మిత్, విదేశీ లీగుల్లో పాల్గొనాలని సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
undefined
సీపీఎల్‌తో పాటు మేజర్ క్రికెట్ లీగ్ (ఎమ్‌ఎల్‌సీ), అమెరికన్ క్రికెట్ లీగ్‌లకు కూడా రిజిస్టర్ చేయించుకున్నాడు... స్మిత్ పటేల్‌తో పాటు అతని కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ కూడా విదేశీ లీగుల్లో పాల్గొనబోతున్నాడని టాక్ నడిచింది. అయితే అదేమీ లేదని కొట్టిపారేశాడు ఉన్ముక్త్.
undefined
ప్రవీణ్ తాంబే తర్వాత కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనబోతున్న రెండో భారత క్రికెటర్ స్మిత్ పటేల్. విదేశీ క్రికెటర్ల కారణంగా ఐపీఎల్‌లో కూడా చోటు దక్కించుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న కొందరు రంజీ క్రికెటర్లు కూడా విదేశీ లీగ్‌ల వైపు ఆశగా చూస్తున్నట్టు సమచారం.
undefined
click me!