గంభీర్, విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా... ఐసీసీ మెగా టోర్నీ ఫైనల్స్‌లో ఇరగదీసిన భారత ప్లేయర్లు వీళ్లే...

First Published | May 31, 2021, 1:01 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం భారత జట్టు సన్నద్ధమవుతోంది. ఇంగ్లాండ్‌లోని సౌంతిప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ గెలిస్తే, ఐసీసీ టోర్నీ గెలవాలనే విరాట్ కోహ్లీ కల నెరవేరినట్టే. అయితే ఫైనల్ టీమ్ మొత్తం రాణిస్తేనే ఇది సాధ్యమవుతుంది.

1983 వన్డే వరల్డ్ కప్ నుంచి 2021 టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ దాకా... ఇప్పటివరకూ భారత జట్టు 9 సార్లు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్ మ్యాచులు ఆడింది. వీటిల్లో నాలుగింట్లో భారత జట్టుకి విజయం దక్కగా, ఐదుసార్లు ఆఖరాటలో నిరాశ తప్పలేదు.
ఐసీసీ మెగా ఈవెంట్స్ ఫైనల్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన భారత ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మాత్రమే రెండేసి సార్లు టాప్ స్కోరర్‌గా నిలిచారు...

2 अप्रैल 2011 को मुंबई के वानखेड़े स्टेडियम में खेले गए बांग्लादेश और भारत के बीच विश्व कप (World Cup 2011) फाइनल मैच में धोनी और गौतम गंभीर की ऐतिहासिक पार्टनरशिप की थी। अकेले गंभीर ने ही इस मैच में 97 रन बनाए थे।
1983 వరల్డ్‌కప్‌ ఫైనల్ మ్యాచ్‌లో భారత మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ 82 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 38 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 54.4 ఓవర్లలో భారత జట్టు 183 పరుగులకి ఆలౌట్ అయ్యింది. అయితే బౌలింగ్‌లో మదన్‌లాల్ 3, అమర్‌నాథ్ 3 వికెట్లు తీయడంతో విండీస్ జట్టు 140 పరుగులకి ఆలౌట్ అయ్యింది. టీమిండియా తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది
2000 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌లో సౌరవ్ గంగూలీ 130 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 117 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ 69 పరుగులు చేసినా మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో భారత జట్టు 264 పరుగులే చేయగలిగింది. న్యూజిలాండ్ ప్లేయర్ క్రిస్ కైరిన్స్ సెంచరీతో చెలరేగి న్యూజిలాండ్‌కి టైటిల్ అందించాడు.
2003 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో సచిన్ టెండూల్కర్ 4 పరుగులకే అవుట్ అయినా వీరేంద్ర సెహ్వాగ్ 82 పరుగులు చేసి పోరాడాడు. 360 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన భారత జట్టు 234 పరుగులకి ఆలౌట్ అయ్యింది. సెహ్వాగ్ రనౌట్ కాగా రాహుల్ ద్రావిడ్ 47 పరుగులు చేశాడు.
2007 టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్ మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్ 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 75 పరుగులు చేసి రాణించాడు. రోహిత్ శర్మ 16 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 30 పరుగులు చేశాడు. టీమిండియా 157 పరుగులు చేయగా పాక్ 152 పరుగులకి ఆలౌట్ అయ్యింది.
2011 వన్డే వరల్డ్‌కప్... 2007లో టాప్ స్కోరర్‌గా నిలిచిన గౌతమ్ గంభీర్, 2011 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో 122 బంతుల్లో 9 ఫోర్లతో 97 పరుగులు చేసి సెంచరీ మిస్ అయ్యాడు. 275 పరుగుల లక్ష్యచేధనలో విరాట్ కోహ్లీ 35 పరుగులు చేయగా ధోనీ 79 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 91 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు.
2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో విరాట్ కోహ్లీ 34 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 43 పరుగులు చేసి టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. శిఖర్ ధావన్ 24 బంతుల్లో 31 పరుగులు, రవీంద్ర జడేజా 25 బంతుల్లో 33 పరుగులు చేశారు. టీమిండియా 129 పరుగులు మాత్రమే చేసినా, ఇంగ్లాండ్‌ను 124 పరుగులకి కట్టడి చేసి అద్భుత విజయం అందుకుంది.
2014 టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో విరాట్ కోహ్లీ 58 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ తప్ప మిగిలిన బ్యాట్స్‌మెన్ అందరూ విఫలం కావడంతో 20 ఓవర్లలో 130 పరుగులు మాత్రమే చేయగలిగింది టీమిండియా. సంగర్కర 52 పరుగులతో రాణించి శ్రీలంకకి అద్భుత విజయాన్ని అందించాడు.
2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత జట్టు ఘోరపరాజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 338 పరుగులు చేయగా లక్ష్యచేధనలో భారత్ 158 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రోహిత్ శర్మ డకౌట్ కాగా విరాట్ కోహ్లీ 5 పరుగులు, ధోనీ 4 పరుగులు చేసి అవుట్ అయ్యారు. అయితే హార్ధిక్ పాండ్యా 43 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 76 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే జడేజాతో సమన్వయం కుదరకపోవడంతో కీలక సమయంలో రనౌట్ అయ్యాడు హార్ధిక్ పాండ్యా.
గౌతమ్ గంభీర్ టాప్ స్కోరర్‌గా నిలిచిన రెండు సార్లు భారత జట్టుకి విజయం దక్కగా, విరాట్ కోహ్లీ ఓసారి విజయాన్ని అందించాడు. ఈసారి రోహిత్ శర్మ, అజింకా రహానే, రిషబ్ పంత్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారా, హనుమ విహారి వంటి ప్లేయర్లు ఈ రేసులో ఉన్నారు.
టెస్టు ఫార్మాట్‌లో జరిగే మొట్టమొదటి ఐసీసీ టోర్నీ ఫైనల్ కాబట్టి మొదటి ఇన్నింగ్స్‌లో ఫెయిల్ అయినా రెండో ఇన్నింగ్స్‌ రూపంలో మరో ఛాన్స్ దొరుకుతుంది. మరి భారత జట్టు ప్లేయర్లలో ఫైనల్‌లో ఎవరు టాప్ స్కోరర్‌గా నిలుస్తారో చూడాలి.

Latest Videos

click me!