లాక్ డౌన్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆహారం ఇదే...

First Published May 31, 2021, 1:22 PM IST

ప్రస్తుతం తన ఇండియన్ టీం మేట్స్ తో ముంబైలోని ఒక హోటల్‌లో క్వారంటైన్ లో ఉన్న కెప్టెన్ కోహ్లీ తన అభిమానులను ఆసక్తికరమైన ప్రశ్నోత్తరాలతో ఎంగేజ్ చేశాడు.

భారత క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఎప్పటికప్పుడు పోస్టులు, స్టోరీలతో తన అభిమానులను అలరిస్తుంటాడు.
undefined
ప్రస్తుతం తన ఇండియన్ టీం మేట్స్ తో ముంబైలోని ఒక హోటల్‌లో క్వారంటైన్ లో ఉన్న కెప్టెన్ కోహ్లీ తన అభిమానులను ఆసక్తికరమైన ప్రశ్నోత్తరాలతో ఎంగేజ్ చేశాడు.
undefined
శనివారం, విరాట్ తన ఫాలోవర్స్ ను ‘ఆస్క్ మీ యువర్ క్వశ్చన్స్’ అని ఒక పోస్ట్ పెట్టాడు. అడిగిందే తడువుగా భారత జట్టు గురించి, వారి ఆహారపు అలవాట్లు, సీక్రెట్స్, ఏది మోటివేట్ చేసింది, గూగుల్ లో చివరికి ఏం సెర్చ్ చేశారు లాంటి ప్రశ్నల వర్షం కురిపించారు.
undefined
అందులో ఓ అభిమాని క్వారంటైన్ టైంలో విరాట్ ఏం తింటాడు అన్న ప్రశ్నకు.. కోహ్లీ ఇలా సమాధానం ఇచ్చాడు..
undefined
‘ఎక్కువమొత్తంలో కూరగాయలు, కొన్ని కోడిగుడ్లు, 2 కప్పుల కాఫీ, పప్పు, క్వినోవా, ఎక్కువమొత్తంలో బచ్చలికూర, దోసలంటే కూడా చాలా ఇష్టం.. అయితే కంట్రోల్ గా తీసుకుంటా’నని తెలిపారు.
undefined
కోమ్లీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వచ్చిన మరో ప్రశ్న... రోజు మొత్తంలో కోహ్లీ ఏం తింటారు అనేదానికి ఇలా బదులిచ్చారు, “సాధారణ భారతీయ వంటకాలనే ఇష్టపడతాను. కొన్నిసార్లు చైనీస్ తింటాను. వీటితో పాటు బాదం, ప్రోటీన్ బార్లు, పండ్లు’’ ఉంటాయని పేర్కొన్నారు.
undefined
ఆహారం, ఆరోగ్యం విషయంలో విరాట్ కోహ్లీ ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. ఫిట్‌నెస్‌పై అతనికున్న ప్రేమ తెలిసిందే. ఆహారం విషయానికి వచ్చేసరికి, ఎంత ఇష్టమైప ఆహారాన్నైనా తీసుకోవాల్సిన పరిమాణంలోనే తీసుకోవడం అనే కళలో అతను బాగా ఆరితేరాడు.
undefined
ఇక మరో ప్రశ్న క్వారంటైన్ సమయంలో అతని దినచర్య గురించి.. దీనికి ‘రోజులో ఒక్కసారి వ్యాయామం చేస్తాను.. ఆ తరువాత మిగతా సమయం అంతా నా కుటుంబానికే కేటాయిస్తాను. రొటీన్ దినచర్య’ అని తెలిపాడు.
undefined
చివరగా గూగుల్ లో ఏం సెర్చ్ చేశారు అన్న ప్రశ్నకు సమాధానంగా.. పోర్చుగీస్ ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో ​​రొనాల్డో ట్రాన్స్ ఫర్ న్యూస్ గురించి సెర్చ్ చేశానని చెప్పాడు.
undefined
జూన్ 18 నుండి న్యూజిలాండ్‌తో జరిగిన ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో సహా 6 టెస్ట్ షెడ్యూల్ కోసం భారత జట్టు జూన్ 3 న యునైటెడ్ కింగ్‌డమ్‌కు బయలుదేరాల్సి ఉంది.
undefined
click me!