క్రికెట్‌లో అంపైర్లు ఎంత జీతం తీసుకుంటారు?
క్రికెట్‌లో అంపైర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. మ్యాచ్ ను నియమాల ప్రకారం నిర్వహించడంలో కీలకంగా వ్యవహరిస్తారు. మ్యాచ్ లో ఎలాంటి తప్పులకు తావులేకుండా మ్యాచ్ ను నిర్వహిస్తారు.. నిర్ణయాలు తీసుకుంటారు. అయితే, మ్యాచ్ లలో అంపైర్లు తీసుకునే వేతనం మ్యాచ్ మ్యాచ్ కు వేరువేరుగా ఉంటుంది. అంటే దేశవాళీ క్రికెట్, అంతర్జాతీయ క్రికెట్, లీగ్ మ్యాచ్ లలో వేరువేరుగా పారితోషకాలు అపైర్లు అందుకుంటారు. ఆయా దేశాల క్రికెట్ బోర్డులపై కూడా ఆధారపడి మారుతుంది.
అంతర్జాతీయ స్థాయిలో అంపైర్ల పారితోషికం స్థానిక క్రికెట్ కంటే చాలా ఎక్కువ. అంతర్జాతీయ క్రికెట్ కన్వీనింగ్ చేసిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC), అంతర్జాతీయ అంపైర్లకు పారితోషికాన్ని నిర్ణయిస్తుంది. వారి క్రికెట్ స్థాయిల ప్రమాణాలు కూడా ఇందులో కీలకంగా ఉంటాయి. టెస్టు క్రికెట్, వన్డేలు, టీ20 మ్యాచ్ లను బట్టికూడా ఇది మారుతుంది.
టెస్టు మ్యాచ్ లకు ఒక మ్యాచ్ కు సుమారు 2,000 నుండి 3,000 డాలర్లు (సుమారు ₹1,50,000 నుండి ₹2,50,000) అంపైర్లు వేతనంగా అందుకుంటారు. వన్డేల్లో ఇది 1,500 నుండి 2,000 డాలర్లు, టీ20 క్రికెట్ లో 1,500 నుండి 2,000 డాలర్లు మధ్య పారితోషికం ఉంటుంది. అయితే, ఇది సిరీస్ లేదా ఈవెంట్ ఆధారంగా మారుతుంది.
కేవలం మ్యాచ్ ఫీజులు మాత్రమే కాకుండా అదనంగా అంపైర్లకు ప్రయాణం, నివాసం, భోజనం ఖర్చులు అందిస్తారు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్, ICC చాంపియన్స్ ట్రోఫీలలో అంపైర్లు పనిచేస్తే వారికి బోనస్లు, ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి.